Kandikonda Yadagiri Passes Away: Minister Talasani Tribute In Film Chamber: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తలసాని. తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని, సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. కందికొండ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం
శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా గొంతు కేన్సర్, వెన్నెముక సమస్యలతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఆయస స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు సాంబయ్య, కొమురమ్మ కాగా కందికొండ యాదగిరికి భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ప్రముఖుల నివాళుల అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ గారు మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/Bg5zhexYUc
— Talasani Srinivas Yadav (@YadavTalasani) March 12, 2022
చదవండి: ‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’
Comments
Please login to add a commentAdd a comment