Kandikonda
-
నేడు నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/ నర్సంపేట రూరల్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరగనున్నాయి. తెలుగు సినిమాలకు వేల పాటలు రాసిన ఆయన.. కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఫిలిం చాంబర్లో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పార్థివదేహాన్ని సందర్శించుకున్నారు. తక్కువ కాలం జీవించి, ఎక్కువ కాలం జీవించే కవిత్వాన్ని రాసిన తెలంగాణ పాటల పూదోట కందికొండ యాదగిరి అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ఈ సందర్భంగా కొనియాడారు. కందికొండ అందరివాడని, ఆయన లేనిలోటు తీర్చలేమని పేర్కొన్నారు. అభిమానుల సందర్శన అనంతరం కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య కందికొండ మృతదేహాన్ని స్వగ్రామం నాగుర్లపల్లికి తరలించారు. మధ్యలో అంబులెన్సును నర్సంపేట పట్టణంలోని అమరువీరుల స్థూపం వద్ద కాసేపు ఆపారు. పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు, కళాకారులు, అభిమానులు పూలు చల్లి నివాళులు అర్పించాక.. నాగుర్లపల్లికి తీసుకెళ్లారు. అక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కందికొండ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తాం: తలసాని కందికొండ యాదగిరి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పాటలెన్నో కందికొండ రాశారని.. ఆయన మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వారి కుటుంబానికి మంత్రి కేటీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని, కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. -
కందికొండ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సాయం: తలసాని
ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సాయం ఉంటుందని సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న కందికొండ శనివారం(మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌లో ఉంచారు. తాజాగా ఆయన భౌతికకాయాన్ని మంత్రి తలసాని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కందికొండ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తూనే ఉందన్నారు. చదవండి: హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు, రూ. 15 కోట్ల డిపాజిట్‌కు ఆదేశం మంత్రి కేటీఆర్ ఆయన ఆసుపత్రి ఖర్చుల విషయంలో చొరవ చూపించారన్నారు. కానీ అనుకొని పరిస్థితుల్లో ఆయన మృతి చెందడం బాధాకరం అన్నారు. కందికొండ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే గతంలో ఆయన, తన కుటుంబం ఓసారి మంత్రి కేటీఆర్‌ను కలిసి తన కళ, ఆశయంతో పాటు ఉండటానికి నీడ కావాలని కోరారు. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చోరవ తీసుకుని వారికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే కందికొండ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తుందని, ఈ విషయంలో ఆయన అభిమానులు అధైర్య పాడాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’ -
ఫిల్మ్ ఛాంబర్లో కందికొండ భౌతిక కాయం.. మంత్రి తలసాని నివాళి
Kandikonda Yadagiri Passes Away: Minister Talasani Tribute In Film Chamber: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తలసాని. తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని, సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. కందికొండ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా గొంతు కేన్సర్, వెన్నెముక సమస్యలతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఆయస స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు సాంబయ్య, కొమురమ్మ కాగా కందికొండ యాదగిరికి భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ప్రముఖుల నివాళుల అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ గారు మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/Bg5zhexYUc — Talasani Srinivas Yadav (@YadavTalasani) March 12, 2022 చదవండి: ‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’ -
‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’
ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతిపట్ల చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కందికొండ కుటుంబానికి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ముందు కందికొండ యాదగిరి చిత్రపురి కాలనీలో నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారని, అనారోగ్యం పాలైన తర్వాత ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని నాలుగు లక్షలు వెనక్కి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం) అయితే ఆయన అనారోగ్యం పాలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏదైనా సహాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కందికొండ కుటుంబానికి 20 లక్షల రూపాయలు విలువ చేసే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొని అందజేయడం జరిగిందని అన్నారు. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత తండ్రి అనారోగ్యం దృష్ట్యా సింగిల్ బెడ్ రూమ్ తమకు సరిపోవడం లేదని కందికొండ కుమార్తె తమ దృష్టికి తీసుకురావడంతో అది మంత్రి శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లానని అనిల్ కుమార్ పేర్కొన్నారు. మంత్రివర్యులు కూడా ఆ విషయం మీద సానుకూలంగా స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి అంగీకరించారని వారి కుమార్తెను సమయం చూసుకుని వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. కందికొండ కుటుంబానికి ముందు సింగిల్ బెడ్ రూమ్ ఇచ్చామని డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామని ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం
Popular Lyricist Kandikonda Yadagiri Passed Away His Life Journey: ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి (49) ఇక లేరు. శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 2012లో ఆయనకు తొలిసారిగా కేన్సర్ నిర్ధారణ అయింది. అప్పట్లోనే సర్జరీ చేయించారు. 2019లో కేన్సర్ తిరగబెట్టడంతో చికిత్సలో భాగంగా చేసిన కీమోథెరపీ, రేడియేషన్ వల్ల వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి కందికొండ పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. నోటమాట కూడా రాలేదు. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కందికొండ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, కళాభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింఛాంబర్‌కు తరలించనున్నారు. కందికొండకు భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు (మార్చి 13) మహాప్రస్థానంలో జరగనున్నాయి. చదువుకునే రోజుల్లోనే.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో 1973 అక్టోబరు 13న సాంబయ్య, కొమురమ్మలకు కందికొండ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతూర్లో, హైస్కూల్ చదువు నర్సంపేటలో కొనసాగించారు. మానుకోటలో ఇంటర్ పూర్తి చేసి, మహబూబా బాద్‌లో డిగ్రీ పూర్తి చేశారాయన. ఇంటర్ సెకండియర్‌లో చక్రి (దివంగత సంగీత దర్శకుడు)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పాటల మీద ఆసక్తి ఉండడంతో ‘సాహితీ కళా భారతి’ అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఇంటర్లో ఉన్నప్పడు పుణేలో జరిగిన జాతీయస్థాయి క్రీడల పోటీల్లో పరుగు పందెంలో పాల్గొన్నారు కందికొండ. 1997– 98లో మిస్టర్ బాడీ బిల్డర్‌గానూ గెలిచారు కందికొండ. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యం, సినిమాల పట్ల కందికొండకు ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే ఆయన్ను సినిమా ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది. ఇప్పటివరకు కందికొండ పదమూడు వందలకు పైగా పాటలు రాశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు.. చక్రి సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంతో గేయరచయితగా కందికొండ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రంలో ‘మళ్లీ కూయవే గువ్వా’ పాట రాశారు. ‘ఇడియట్’ చిత్రంలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘పోకిరి’లో ‘జగడమే..’, ‘గలగల పారుతున్న గోదారిలా..’, ‘టెంపర్’ చిత్రంలో ‘వన్ మోర్ టైమ్’.. 'లవ్లీ'లో 'లవ్లీ లవ్లీ'.. ఇలా ఎన్నో హిట్ పాటలు కందికొండ కలం నుంచి వచ్చినవే. అలాగే 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాకా శ్రీకాంత్ నటించిన 'కోతలరాయుడు' చిత్రంలో ఒక పాట రాశారు. సినిమా పాటలతోనే కాదు.. సంప్రదాయ, జానపద పాటల్లోనూ తన ప్రతిభ చాటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ‘మాగాణి మట్టి మెరుపు తెలంగాణ’, ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ వంటి చెప్పుకోదగ్గ పాటలు ఉన్నాయి. అలాగే 2018లో తెలంగాణ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా కందికొండ రాసిన ‘వచ్చాడు వచ్చాడు ఒక లీడర్’, 2019లో సంక్రాంతి సందర్భంగా రాసిన పాటలు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి. ఇరవై రోజుల క్రితం నాగుర్లపల్లికి వెళ్లిన కందికొండ తన తల్లిదండ్రులు ఉంటున్న పెంకుటిల్లును తనివి తీరా చూశారట. ‘కన్న కొడుకు మాకన్నా ముందే ఈ ప్రపంచానికి దూరం అవుతాడని అనుకోలేదు’ అని కందికొండ తల్లిదండ్రులు విలపించడం స్థానికుల కళ్లు చెమర్చేలా చేసింది. కందికొండ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ కన్నుమూత
-
మూగబోయిన కందికొండ గుండె సవ్వడి
-
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. కొన్నేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆసుపత్రి ఖర్చులు భారీగా చెల్లించాల్సి వస్తుండటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సాయం చేశారు. కాగా కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. ఆయన చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో 'మళ్లి కూయవే గువ్వా' పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నారు. కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు రాశారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు ప్రతి గ్రామంలోనూ మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయడంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు. చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు లేటెస్ట్ ఫొటో చూసి షాకవుతున్న ఫ్యాన్స్! -
కందికొండకు క్యాన్సర్.. ‘మనందరం అండగా నిలబడదాం’
సినిమా ప్రపంచంలో పాటకున్న ప్రత్యేకత అసాధారణమైనది. ఒక్కో సందర్భంలో పాటల ద్వారానే సినిమాలు హిట్ అవుతుంటాయి. ఇలాంటి పాటలను రాయడంలో కందికొండ చెయ్యి తిరిగినవాడు. వందలాది పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపను తాకిన వైనం ఈయనది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నాగుర్లపల్లెలో సామాన్య కుమ్మరి కుటుంబం నుండి వచ్చినవారు కందికొండ. మట్టిమనుషుల యాస–గోసను పట్టిన కలం ఈయన సొంతం. ప్రొఫెసర్ అవ్వాలనే కోరికతో డబుల్ యంఏ చదివి 2004లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు మళ్ళీకూయవే గువ్వా అనే పాట ద్వారా సినిమా ప్రపంచంలోకి అడిగిడునాడు. అనతికాలంలోనే తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అసంఖ్యాక పాటలను అందించాడు. తెలుగు సినిమాలో రజనికాంత్, చిరంజీవితో సహా దాదాపుగా అందరు హీరోలకు కలిపి 1,300 పైగా పాటలను అందించారు కందికొండ. ఈయన పాటలు కేవలం సినిమాకే పరిమితం అవ్వలేదు తెలంగాణ పోరులో సైరన్ అయ్యింది. తెలంగాణ అస్తిత్వంలో పాటై కోట్ల గొంతుకలను ఒక్కటిగా చేసింది. బతుకమ్మ పండుగకు కంది కొండ పాటలేనిదే ఊపులేదనే చెప్పాలి. సందర్భం ఏధైనా సరే భక్తి, రక్తి, ప్రేమ, విరహం, ఊపు, అన్నికోణాల్లో పాటలను అందించగల్గిన ఒకేఒక్కడు కందికొండ. తెలంగాణ సినీగేయాలపై ఉస్మానియాలో పీహెచ్డీ చేసి ఇటీవలే డాక్టరేట్ కూడ అందుకున్నారు. తెలుగు సమాజంలో పాట మాత్రమే బ్రతికివుంటుంది, పాడినోడికి, పాట రాసినోడికి రాని గుర్తింపు కేవలం పాటలకే వస్తుంటాయి, పాటలను గన్నవాళ్ళకు జీవనమే దుర్భరమైన సందర్భాలు మనం చూశాము. కళాకారులు ప్రజల ఆస్తిగా బావించాల్సింది ప్రభుత్వాలే. అందుకే వీళ్ళకు సముచితమైన గౌరవాన్ని అందించడంలో మీనమేషాలు చూడకూడదు. ఇప్పుడు గత కొద్దిరోజులుగా కంది కొండ గొంతు క్యాన్సర్‌తో చావుతో పోరాడుతున్నారు, సరైన వైద్య సదుపాయం కావాలంటే లక్షల రూపాయల్లో ఖర్చు. ఇలాంటి సందర్భంలో అరుదైన కళాకారులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అస్థిత్వ ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం మరింత అండగా ముందుకు రావాల్సి ఉన్నది. తెలుగు సినిమా ఒకటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ కందికొండను బతికించుకోవడంలో భాగస్వామ్యం వహించవల్సి ఉన్నది. ప్రభుత్వాలే కాకుండా మనం సైతం ఇప్పుడు కందికొండకు అండగ నిలబడాలని ఉంది. దాతలు గూగుల్ పే ద్వారా 8179310687కి సహాయం అదించగలరు. అలాగే కందికొండ రమాదేవి ఆంధ్రాబ్యాంక్ 135510100174728 (అకౌంట్ నంబర్). IFSC ANDB0001355కి కూడా తమ సహాయాన్ని అందించవచ్చును. - వరకుమార్ గుండెపంగు ప్రముఖ కథా రచయిత మొబైల్: 99485 41711 -
పుట్టేశాం... ఇక బతికి సాధించాలి!
పాటతత్వం పూరి జగన్నాథ్ తో నాకది రెండో సినిమా. మా కాంబినేషన్లో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్ర మణ్యం’లో నేను రాసిన రెండు పాటలూ సూపర్‌హిట్. ‘ఇడియట్’లో మళ్లీ అవకాశ మిచ్చారు. మొత్తం మూడు పాటలు. మూడు వేరియేషన్లు. చక్రితో నాకు అయిదో సినిమా ‘ఇడియట్’. రవితేజను పక్కింటి అబ్బాయిలా తనదైన స్టయిల్లో చూపించడానికి పూరి రెడీ అవుతున్నారు. అసలే రవితేజ రియల్ లైఫ్‌లో హైపర్ యాక్టివ్. ఇక సినిమాలో అతని పాత్ర కూడా అంతే. ఏదీ మనసులో ఉంచుకోడు. సూటిగా సుత్తి లేకుండా ఎదరెవరున్నా సరే దూసుకెళ్లిపోవడం అతని తత్వం. అలాంటి హీరోకి పరిచయ గీతం. క్లిష్టతరమైన పదాలకు దూరంగా, ఎవరికైనా కనెక్ట్ అయ్యేలా ఇన్ స్పిరేషనల్‌గా రాయమన్నారు పూరి. అంద మైన పదాలతో ఓ పాటను పొదగడం ఎంత కష్టమో, సులువుగా అర్థమ య్యేలా రాయడం అంతకన్నా కష్టం. రోజూ చదివే భగవద్గీత, బైబిల్ మననం చేసుకుంటూ ఈ పాట రాశా. ఏకంగా మూడు రోజులు పట్టింది. చివరికి సక్సెస్. సై సర సర సై -సై చిరు చిందైయ్ -వెయ్ వెయ్ వెయ్/సర సర వెయ్ వెయ్ వెయ్/ నింగిలోని తార నీ చేతిలోకి రాదా/తలదిండు తీసిలేరా దునియాను దున్నుకోరా/నవ్వే నువ్వై నిప్పు రవ్వై/కదం తొక్కేయ్రా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్నారు. చాలా మంది కలలు కంటారు, అలా కంటూనే ఉంటారు. కానీ వాటిని సాకారం చేసుకోరు. అలా కాకుండా ముందడుగెయ్యాలి. చేసేది తప్పా... ఒప్పా అని చూడకూడదు. ముందు అనుకున్న పనిని మొదలుపెట్టాలి. ఎలాంటి కష్టమొచ్చినా ముఖాన చిరునవ్వు చిందిస్తూ బరిలో సాగిపోవాలి. చేసేదేదైనా చెప్పేదేదైనా/చేసేయ్ జంకూ బొంకూ లేకుండా/పిండై బండైనా ఎక్కేయ్ ఎవరెస్టయినా/సాహసంతో సావాసం చేసేయ్‌రా... మనం చేసే పని రైట్ అనుకున్నప్పుడు ఎవరికీ భయపడకూడదు. ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడాలి. అది ఎలాంటిదైనా సాహసమే శ్వాసగా సాగిపోవాలి. అప్పుడే మనకు అనుకున్న విజయాలు దక్కుతాయి. విపణి వీధి నిండా ఎగరెయ్ ప్రేమజెండా/ చిరాకు నీకు వస్తే అమ్మేయ్రా గోలుకొండ అందరి హృదయాలను ప్రేమతో గెలిచి, ఈ సమాజాన్ని ప్రేమతో నింపేసేయ్. ఒక పనిలో మనకు నష్టం వచ్చింది. అది మనకు రాదు అనుకున్నప్పుడు దాని జోలికి వెళ్లకూడదు. నిన్న తప్పు తెలుసుకుని ఫీలు కాకురా/తప్పు వల్ల కొత్త నిజం తెలుసు కోరా/చాన్సు ఉంటే మళ్లీ తప్పు చేసి చూడరా/చేసిన ఆ తప్పే మళ్లీ చేయమాకు చేయమాకు నాకు మొదటి నుంచి ఓషో ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన భావజాలాన్ని కూడా ఇందులోకి జొప్పించాను. తప్పులు చేస్తేనే నిజాలు తెలు స్తాయి. అసలు తప్పులు చేయనివాడు మనిషే కాడు. తప్పులు చేస్తూ ఉండాలి. అందులోంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. ప్రపంచంలోని ఆవిష్కరణలకు మూలం ఇలాంటి తప్పులే. కానీ చేసిన తప్పే మళ్లీ చేయడం మాత్రం మూర్ఖత్వమే. బిల్ గే ట్సే గొప్ప కాదురా/నీకు నువ్వే కింగు సోదరా... పోలిక పెడితే ఎంతటివాడైనా నిరాశలో కుంగిపోవడం ఖాయం. అందరూ బిల్ గే ట్స్, టాటా, బిర్లా, అంబానీలే గొప్పనుకుంటారు. కానీ ఎవరి టాలెంట్ వారిది. కొంతమంది పాటలు బాగా పాడితే, ఇంకొంత మంది బాగా చదువుతారు. ఇంకొద్ది మందికి చదవడమంటే చాలా ఇష్టం. ఎవడి జీవితానికి వాడే హీరో. కింగు కూడా. పుట్టాకెవడైనా బతకాలి ఏమైనా/వేసే ముందడగు ఇకనైనా/వద్దు కొండైనా చాలు రవ్వైనా/తోసేయ్ నచ్చకుంటే దేన్నైనా... పుట్టుక, చావుల మధ్య ఊగిసలాడే చిన్న దారమే ఈ జీవితం. కష్టమొచ్చిందా... భరించు, దు:ఖ మొచ్చిందా సహించు. సంతోషమొచ్చిందా ఎగిరి గంతేయ్. మళ్లీ కష్టాలొస్తాయి. చిరు నవ్వుతో సాగిపో. మనకు చావు వచ్చేదాకా బతకాలి. ఏదైనా చేసి బతకాలి అంతే. అలాగని నచ్చని పని చేయకూడదు. రాజీపడి బతక్కూ డదు. మనకంటూ ఆటిట్యూడ్, ఇండివిడ్యు వాలిటీ ఉండాలి. నడిచే దారి కరెక్ట్ అయితే చాలు. ముళ్లున్నా, పూవులున్నా, ఎవరు అడ్డొచ్చినా వెళ్లిపోవాలంతే. చేయగలను కానీ అనే మాటలొద్దురా/ గుండెలోన దమ్ములుంటే చేసిచూపరా/నడిచి నడిచి పాతబడ్డ బాటలొద్దురా/సత్తువుంటే కొత్త బాట వేసిచూపు చేసిచూపు... ఈ పని నేను చేయగలను కానీ... అంటూ కొందరు సాకులు చెబుతారు. పని తెలిసినవాడు సాధిస్తాడు. చేయలేనివాడు సాకులు వెతుక్కుంటాడు. మనకే గనక దమ్ముంటే చేసి చూపించి మన సత్తా నిరూపించుకోవాలి. ఏ పని చేసినా కొత్తగా చేయాలి. ఇలానే చేయాలి అనే రూల్స్ అన్ని చోట్లా ఉంటాయి. కానీ ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తేనే గొప్పవాళ్లవుతారు. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. లిరిక్స్ విన్నవెంటనే పూరి బాగా మెచ్చుకున్నారు. సింగిల్ వెర్షన్లో ఓకే. ఇప్పటివరకూ నేను ఆయనకు రాసిన పాటలన్నీ సింగిల్ వెర్షన్లో ఓకే చేసినవే. తను రాసే మాటలెంత సూటిగా ఉంటాయో, పాటలు కూడా అదే స్టయిల్లోనే ఉండాలంటారు పూరి. అందుకే ఆయన సినిమాకి పాటలు రాయడమంటే ఓ కిక్కు ఉంటుంది! - కందికొండ, గీత రచయిత