ఫిల్మ్ ఛాంబర్లో ఏవీఎస్ భౌతికకాయం | AVS Body in Film Chamber office | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ ఛాంబర్లో ఏవీఎస్ భౌతికకాయం

Published Sat, Nov 9 2013 9:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

ఫిల్మ్ ఛాంబర్లో ఏవీఎస్ భౌతికకాయం

ఫిల్మ్ ఛాంబర్లో ఏవీఎస్ భౌతికకాయం

హైదరాబాద్ : అభిమానుల సందర్శనార్థం ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.  సినీనటులు కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి .... తదితరులు ఏవీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఏవీఎస్కు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో నిన్న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఏవీఎస్ తన స్వగృహంలో  రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement