AVS
-
నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు
కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు ఏవీఎస్. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన మిస్టర్ పెళ్లాం చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మల్లీ మొదలైంది.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. దాదాపు 500 చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో ఏవీఎస్ మరణించాడు.ఇటీవలే అమ్మ కూడా..తాజాగా ఏవీఎస్ (AVS) కూతురు శాంతి- అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి (Comedian AVS Daughter Shanthi) మాట్లాడుతూ.. మా నాన్న 57 ఏళ్ల వయసులో మరణించాడు. అమ్మ 62 ఏళ్ల వయసులో (గతేడాది నవంబర్లోనే) కన్నుమూసింది. నిరంతరం షూటింగ్‌లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. కానీ బయటి వారు మాత్రం తాగడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని అపోహపడుతుంటారు.మందు అలవాటే లేదుమాది బ్రాహ్మణ కుటుంబం. నాన్న ఎగ్ కూడా తినేవారు కాదు. ఎగ్ ఉంటుందని కేక్ కూడా ముట్టుకోరు. సోడా కూడా పెద్దగా తాగకపోయేవారు. మందు జోలికి వెళ్లిందే లేదు. కానీ 2008లో నాన్న కాలేయం పాడైపోయింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. డాక్టర్స్ ఆయన్ను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యా.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్టవదన్నారు. (చదవండి: సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!)1% మాత్రమే బతికే ఛాన్స్దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో సడన్‌గా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మా అమ్మను కూడా గుర్తు పట్టలేదు. కేవలం నా ఒక్క పేరు మాత్రమే గుర్తుంది. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్ ఉందన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని ఇంటికి వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాం. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు నాన్న స్వయంగా కాల్ చేశాడు. నా భర్తే ఒప్పించాడుఎవరూ రాలేదేంట్రా? ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని మాట్లాడాడు. ఒక్క రాత్రిలో తనకు పోయిన జ్ఞాపకశక్తి ఎలా తిరిగొచ్చిందో అర్థం కాలేదు. అయితే 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దాతల కోసం వెతికేంత సమయం లేదని నేనే రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందన్నారు. కానీ, నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయమోనని సందేహించాడు. అప్పుడు నా భర్తే దగ్గరుండి తనను ఒప్పించాడు. ఆయన సరే చెప్పేందుకు వారం రోజులు పట్టింది. (చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమంటే..అలా నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్ తర్వాత నా శరీరంలో రక్తకణాల సంఖ్య పడిపోవడంతో ఒకరోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. ప్లేట్లెట్స్ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్ తర్వాత కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నకు సూచించారు. కానీ ఆయన వింటేగా! ఆపరేషన్ అయిన రెండో నెలకే మళ్లీ పనిలో పడిపోయాడు. సరిగా విశ్రాంతి తీసుకోలేదు.నా చేతిలో ప్రాణం పోయిందికాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాం. నాకు పిల్లలు పుడతారో, లేదోనని నాన్న భయపడిపోయాడు. అలాంటిది నాకు పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశాడు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆపరేషన్‌కు రూ.65 లక్షలదాకా ఖర్చయింది. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ (Tollywood) చాలా సపోర్ట్ చేసింది అని శాంతి చెప్పుకొచ్చింది.చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్ -
డైరెక్టర్ ప్రదీప్.. సన్నాఫ్ ఏవీఎస్
‘‘ఏవీయస్‌గారు నాకు మంచి మిత్రులు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ‘తుత్తి, రంగు పడుద్ది’ వంటి మేనరిజమ్స్‌ను ఆయన చాలా బాగా వాడేవారు. ఏవీఎస్‌గారు లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన ‘వైదేహి’ ట్రైలర్ బావుంది’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మహేష్, ప్రణతి, సందీప్, అఖిల, లావణ్య, ప్రవీణ్ ముఖ్య తారలుగా ఏవీయస్ తనయుడు ఎ.రాఘవేంద్ర ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైదేహి’. ఎ.జి.ఆర్. కౌశిక్ సమర్పణలో యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జననీ ప్రదీప్ నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఏవీయస్ జయంతిని పురస్కరించుని బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్. శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. ఎ.రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి జయంతి నాడు మా సినిమా ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీ. మా బావగారు నాకు ఇచ్చే సపోర్ట్‌ను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఆయన మా నాన్నగారిలాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘బాపు–రమణగారికి, ఏవీయస్‌గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏవీయస్‌గారితో నాకూ చక్కటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్. -
అదో తుత్తి!
బాపు-రమణలు తీర్చిదిద్దిన సుందరచిత్రం ‘మిష్టర్ పెళ్లాం’. ఇందులో గోపాలకృష్ణ పాత్రకు నత్తి పెట్టకపోయుంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. చాలా వెలితిగా ఉండేది కదూ! ఆ నత్తే మనకింత తుత్తినిచ్చింది మరి. మైనస్ అనుకున్న దాన్ని కూడా ప్లస్సుగా చూపడమంటే ఇదే. ఏవీయస్ చనిపోయి ఏడాది గడిచినా చిరంజీవిగా మిగిలిపోయారంటే ఇలాంటి తుత్తి పాత్రల వల్లనే! ఈ పాత్ర పేలుతుందని ముందే అనుకున్నా! బాపు-రమణలకు సన్నిహితుడైన శ్రీరమణ ద్వారా ఏవీయస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు గుర్తు. నటనతో పాటు రచయితగా కూడా ప్రయత్నాలు చేస్తుండేవారు. మా ‘మిష్టర్ పెళ్లాం’ సిట్టింగ్స్‌కి కూడా వచ్చేవారు. ఏవీయస్ ఓ నాటకంలో తుత్తి పాత్ర చేశారట. ఆ ట్రాక్ బాపు-రమణలకు చెబితే, ఇంప్రెస్ అయ్యి ఈ స్క్రిప్టులో అందంగా ఇమిడ్చారు. ఆ తర్వాత ఆ పాత్రను ఏవీయస్నే చేయమన్నారు. ఈ పాత్ర బాగా పేలుతుందని షూటింగ్ దశలోనే అనుకున్నా. - గవర పార్థసారథి, నిర్మాత జామకాయలు ఇస్తే ఒకరోజు గుర్తుపెట్టు కుంటారు. మామిడి కాయలు ఇస్తే మాసమంతా తలచుకుంటారు. మరి - లెంపకాయలు ఇస్తే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎనీ డౌట్స్! ఆ రోజు గోపాలకృష్ణ చాలా బిజీగా ఉన్నాడు. మరి కాస్సేపట్లో బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ మీటింగాయె! తను మేనేజింగ్ డెరైక్టరు. తండ్రి చైర్మను. ఇలాంటి గజిబిజీ టైములో ఫోను మోగింది. అవతల పి.ఎ.... ‘‘సార్ మీ కోసం లేడీసొచ్చారు’’. గోపాలకృష్ణ అవాక్కయ్యాడు. ‘‘ఎ... ఎంతమంది?’’ అనడిగాడు. పి.ఎ. ఫకాలున నవ్వేసి ‘‘ఓహో... లేడీసంటే బోలెడంత మంది అనుకున్నారా? ఒక్కరే’’ అని చెప్పాడు. ‘‘ఏ... ఏం పేరు... ఎందుకొచ్చారో కనుక్కో?’’ ఆర్డరేశాడు గోపాలకృష్ణ. ‘‘ఎవరో శివంగి అట సార్’’ అని పి.ఎ. చెప్పగానే గోపాలకృష్ణ ఒక్కసారి తన కుడి చెంప తడుముకున్నాడు. అతని కళ్ల ముందు ఓ పిక్చర్ కనబడింది. శివంగి అంటే ఝాన్సీలక్ష్మి. ఇంటర్లో క్లాసుమేటు. ‘‘ఆమెను తీసుకుని నా చా... ఛాంబర్‌కి రా!’’ అని పురమాయించేశాడు. శివంగిని చూడగానే గోపాలకృష్ణ కళ్లు మెరిశాయి. ఒక్కసారి కాలేజీ డేస్ అన్నీ గిర్రున గుర్తొచ్చాయి. అతని ఉత్సాహం, చిన్నపిల్లాడిలా సంబరపడటం చూసి ‘‘నువ్వేం మారలేదు గోపాల్’’ అంది శివంగి అనబడే ఝాన్సీలక్ష్మి. ఈలోగా కాఫీ వచ్చింది. ‘‘ఎ... ఎన్నాళ్లయ్యింది శివంగీ... నిన్ను చూసి! ఎక్కడున్నావ్? మీ ఆయనేం చేస్తుంటాడు? పిల్లలా?’’ అని టకటకా ప్రశ్నలు సంధించాడు గోపాలకృష్ణ. కాఫీ సిప్ చేస్తూనే తన గురించి చెప్పింది శివంగి. అలా ఇద్దరూ కాసేపు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘‘శివంగి అనగానే టక్కున గుర్తుపట్టేశావ్?’’ అంది శివంగి చిలిపిగా. ‘‘ఎ... ఎందుకు పట్టను శివంగీ. నువ్విచ్చిన లెంపకాయ అంత ఈజీగా మరిచిపోతానా? నన్ను గుర్తుంచుకుని ఇంత దూరం వచ్చావ్. నాకదే తుత్తి’’ చెప్పాడు గోపాలకృష్ణ. శివంగి కొంచెం కన్ఫ్యూజింగ్గా ‘‘తుత్తి ఏంటి?’’ అడిగింది. ‘‘తుత్తి... తుత్తి... శాటిస్ఫేక్షన్’’ చెప్పాడతను. ‘‘ఓహో... యూ మీన్ తృప్తి’’ అందామె నవ్వుతూ. చిన్నప్పటి ఈ క్లాస్మేట్ తన కంపెనీలో ఉద్యోగాని కొచ్చిందని తెలియగానే గోపాలకృష్ణ అగ్గగ్గలాడిపోయాడు. ఫ్రెండ్‌కు ఏ ఉద్యోగం ఇవ్వడానికైనా తాను రెడీ. ఈలోగా మీటింగు మొదలైంది. చైర్మన్, ఇంకొందరు డెరైక్టర్లు రెడీ. కంపెనీ సేల్స్ పెంచడానికి ఎవడో ఒకతను బోడి సలహా ఇచ్చేసరికి, శివంగి పగలబడి నవ్వేసింది. చైర్మన్‌కి కోపం వచ్చింది. మిగతా డెరైక్టర్లూ సేమ్ టూ సేమ్. ‘‘నా ఫ్రెండు’’ అంటూ గోపాలకృష్ణ ఏదో కవర్ చేయబోయాడు. చైర్మన్ ఊరుకోలేదు. ‘‘నువ్వీ మీటింగ్‌కి ఎందుకొచ్చావని అడగడం లేదు. ఎందుకు నవ్వావో చెప్పు’’ అని చైర్మన్ గద్దించాడు. ‘‘మీ కంపెనీ సేల్స్ పెంచడానికి మీరు పడుతున్న తిప్పలు చూసి నవ్వొచ్చింది. ఓ మధ్య తరగతి గృహిణిగా నేను కొన్ని సలహాలు చెప్తాను. ఇలా పాటించి చూడండి’’ అంటూ శివంగి చకచకా చిట్కాలు చెప్పేసింది. చైర్మన్ వండరైపోయాడు. ‘‘మా అన్నపూర్ణ ఫుడ్ కార్పొరేషన్ సేల్స్ డిపార్ట్మెంట్కి నిన్ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నా. వన్ ఇయర్ కాంట్రాక్ట్. నెలకు పదివేల జీతం... క్వార్టర్స్... ఫోను... కారు... ఇస్తాం’’ అని చెప్పి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ! ఆ తర్వాత రోజు - శివంగిని ఆఫీసుకు తీసుకు రావడానికి స్వయంగా ఇంటికి వెళ్లాడు గోపాలకృష్ణ. శివంగి భర్త బాలాజీని పరిచయం చేసుకున్నాడు. భార్యకు ఇంత పెద్ద ఉద్యోగం రావడం బాలాజీకి కడుపుమంటగా ఉంది. దానికి తోడు గోపాలకృష్ణ ఇంటికి రావడంతో ఒళ్లు మంటగా ఉంది. అందుకే గోపాలకృష్ణపై ఎన్నో చెణుకులు. చివరకు అతని నత్తిని కూడా అనుకరించాడు. పాపం గోపాలకృష్ణ కల్మషం లేనివాడు. ఈ కడుపుమంటలు, ఉక్రోషాల గురించి అస్సలు తెలియవు. ఝాన్సీ తన ఫ్రెండు. ఝాన్సీ భర్త కూడా తన ఫ్రెండే. ఫ్రెండ్ కాకపోతే ఇంకెవరు కామెంట్ చేస్తారు. గోపాలకృష్ణ ఆఫీసు ఎంత విశాలమో, అతని హృదయమూ అంతే విశాలం! గోపాలకృష్ణ కంపెనీలో కృష్ణాష్టమిని ప్రతి ఏటా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఆఫీసు వాళ్లంతా కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందే! శివంగికి చెబితే సరిపోతుంది. కానీ కర్టెసీ కొద్దీ బాలాజీని తనే స్వయంగా ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేశాడు గోపాలకృష్ణ. బాలాజీ నిజానికి మంచివాడే. కానీ అసూయ ఆ మంచితనాన్ని డామినేట్ చేసేస్తోంది. దానికి తోడు గోపాలకృష్ణ-ఝాన్సీల ఫ్రెండ్షిప్ పుండు మీద కారం చల్లుతోంది. గోపాలకృష్ణ కూడా సతీసమేతంగా ఆ ఫంక్షన్కొచ్చాడు. శివంగిని తన శ్రీమతికి ఇంట్రడ్యూస్ చేశాడు. ‘‘నన్ను లెంపకాయ కొట్టిందని చెప్పానే... తనే... శివంగి. కొంచెం ఉంటే నీ ప్లేసులోకి రావాల్సింది’’ అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. గోపాలకృష్ణ శ్రీమతి కోమలాదేవి కూడా అంతే ఇదిగా నవ్వుతూ, ‘‘ఇప్పటికి 972 సార్లు చెప్పారు మీ లెంపకాయ గురించి’’ అంది. గోపాలకృష్ణ కేరెక్టర్ అంతే. ఏదీ మనసులో దాచుకోడు. అంతా ఓపెనే. వాళ్ల కంపెనీ ప్రొడక్ట్స్‌లో కల్తీ ఉండనట్టే, ఇతని ఆలోచనల్లోనూ, మనసులోనూ కల్తీనే ఉండదు. శివంగి ఫ్యామిలీలో ఏదో డిస్ట్రబెన్స్ ఉందని గోపాల కృష్ణ కనిపెట్టాడు. కానీ బయటపడలేదు. పడితే శివంగి ఫీలవుతుంది. అందుకే శివంగికి ఓ ఫ్రెండ్‌లాగా... ఓ బ్రదర్‌లాగా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. బాలాజీ విషయంలో శివంగి తొందరపడితే క్లాసు పీకాడు. మార్గం చూపాడు. ఇప్పుడు బాలాజీ - శివంగి ఒకటయ్యారు. వాళ్ల చుట్టూ ముసురుకున్న మేఘాలన్నీ తొలగిపోయాయి. ‘‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంతో ‘తుత్తి’గా ఉంది’’ అన్నాడు గోపాలకృష్ణ. బాలాజీ కూడా తుత్తిగా నవ్వాడు. అవును... తుత్తి తోడుంటే ఆనందం మీ వెంటే! - పులగం చిన్నారాయణ తుత్తి... నా పాలిట అదృష్టం! - ఏవీఎస్ ‘అతలు కిత్నాత్తమి అంతే ఏంతంతే... (అసలు కృష్ణాష్టమి అంటే ఏంటంటే...) డైలాగ్‌ని ఫస్ట్‌షాట్‌గా తీశారు. కొద్దిసేపట్లో సీన్ తీస్తారనగా... విజయవాడలో ఉండే మా అక్కయ్య చనిపోయిందని కబురొచ్చింది. నా వల్ల షూటింగ్ క్యాన్సిల్ కాకూడదు. అందుకే బాధ దిగమింగుకుని, కన్నీళ్లు ఆపుకుని సీన్ పూర్తి చేశాను. 1993 ఆగస్టు 5న ‘మిష్టర్ పెళ్లాం’ రిలీజైంది. నా జీవితం తుత్తిగా సాగడానికి మార్గం ఏర్పడింది. నాకు ఈ పాత్ర ఎనలేని గుర్తింపునూ, స్థిరత్వాన్నీ తెచ్చిపెట్టింది. అందుకే ‘తుత్తి’ నా పాలిట అదృష్టం. (‘తుత్తి’ పాత్ర గురించి గతంలో ఏవీయస్ చెప్పిన మాటలు ) హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: మిష్టర్ పెళ్లాం (1993); డెరైక్ట్ చేసింది: బాపు సినిమా తీసింది: గవర పార్థసారథి; మాటలు రాసింది: ముళ్లపూడి వెంకటరమణ -
చుక్కల్లోకెక్కినారు
-
మూడు నెలల్లో మూడు విషాదాలు..!
*అక్టోబర్ 9న రియల్ స్టార్ శ్రీహరి కన్నుమూత. *నవంబర్ 8న హాస్యనటుడు ఏవీఎస్ మృతి. *డిసెంబర్ 7న మరో మేటి హాస్యనటుడు ధర్మవరపు మరణం. మూడు నెలల కాలంలో ముగ్గురు సినీ ప్రముఖుల అకాల మరణం వారి కుటుంబ సభ్యులతోబాటు తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద లోటే! ముగ్గురూ కెరీర్ పరంగా ఇంకా ఉచ్చ స్థాయిలోనే ఉన్నారు. రకరకాల కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. అనారోగ్యం చుట్టుముట్టినా కూడా చివరిక్షణం వరకూ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. వీటిల్లో కొన్ని సినిమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో, నిజంగా ఆయా దర్శక నిర్మాతలకు టెన్షనే. ఇంకొందరేమో వాళ్లని మైండ్‌లో పెట్టుకుని పాత్రలను సృష్టించుకున్నారు. వాళ్లకి కూడా ఇది మింగుడు పడని పరిణామమే. శ్రీహరి చనిపోయే సమయానికి ఆయన చేతిలో పదికిపైగా సినిమాలున్నాయి. మహేశ్‌బాబు ‘ఆగడు’ సినిమాలో కీలకపాత్రను శ్రీహరితోనే చేయించాలనుకున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పుడా పాత్రకు సాయికుమార్‌ను ఎంచుకున్నట్లు వినికిడి. హిందీలో శ్రీహరి చేసిన ‘రాంబో రాజ్‌కుమార్’ గత వారమే విడుదలైంది. తెలుగులో ఆయన నటించిన వీకెండ్ లవ్, జాబిల్లి కోసం ఆకాశమల్లె, శివకేశవ్, పోలీస్ గేమ్, యుద్ధం, రఫ్ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో దాదాపుగా శ్రీహరి వర్క్ పూర్తయిపోవడంతో ఆయా దర్శక నిర్మాతలకు పెద్ద టెన్షన్ లేనట్టే. ‘వీకెండ్ లవ్’ దర్శకుడు గవర నాగు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో శ్రీహరిదే కీలకపాత్ర. ఒకే ఒక్క సన్నివేశం మినహా ఆయన వెర్షన్ చిత్రీకరణ అంతా పూర్తయింది. షూటింగ్ సమయంలోనే ఆయన వాయిస్ కరెక్ట్‌గా రికార్డ్ కావడంతో దాన్నే సినిమాలో ఉపయోగిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట మిమిక్రీ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్లో మేనేజ్ చేయాలనుకుంటున్నాం’’అని చెప్పారు. శ్రీహరి నటించిన ఆఖరి చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ అని దర్శక, నిర్మాతలు రాజ్ నరేంద్ర, గుగ్గిళ్ల శివప్రసాద్ వెల్లడించారు. ‘‘శ్రీహరి పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. ఆయన ప్రోత్సాహంతోనే మేమీ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలిగాం. ఈ క్రిస్మస్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని వారు తెలిపారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పిల్లా... నువ్వు లేని జీవితం’లో శ్రీహరిదే మెయిన్‌రోల్. శ్రీహరి మృతి చెందే సమయానికి ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. దాంతో జగపతిబాబుతో ఆ పాత్ర మొత్తం రీషూట్ చేస్తున్నారు. ఒక్క ‘ఇంటింటా అన్నమయ్య’ మినహా ఏవీఎస్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా విడుదలైపోయాయి. కొత్త కమిట్మెంట్స్ కొన్ని ఉన్నా కూడా ఏవీ ఇంకా షూటింగ్‌కి వెళ్లకపోవడంతో పెద్ద ఇబ్బంది లేదు. ధర్మవరపుది కూడా అదే పరిస్థితి. దాదాపుగా ఆయన సినిమాల వర్కులన్నీ పూర్తయిపోయాయి. ప్రేమా గీమా జాన్తానహీ, హమ్ తుమ్ చిత్రాల్లో ఆయన వర్క్ మొత్తం పూర్తయింది. కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదాయన. చివరిగా చెప్పేదేంటంటే... సినిమా అనేది కథా కథనాలు, స్టార్ వ్యాల్యూతోపాటు లక్‌తో కూడా కూడుకున్న వ్యవహారం. కేవలం సినిమా జయాపజయాలే నిర్మాత భవితవ్యాన్ని నిర్దేశించవు. ఆరంభం నుంచీ చివరి వరకూ.. నిర్మాణంలో ఉండే ప్రతిరోజూ నిర్మాత భవిష్యత్తుకి కీలకమే. ప్రస్తుతం సినిమాల్లోని ప్రతి చిన్న విషయాన్నీ ప్రేక్షకులు సునిశితంగా చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు సంభవించే ఆర్టిస్టుల మరణాలు ఉన్నట్టుండి కథలో మార్పులకు కారణమవుతున్నాయి. చనిపోయిన నటుడు డబ్బింగ్ చెప్పడం పూర్తి కాకపోయినా ఇక్కడ ఇబ్బందే. మిమిక్రీ ఆర్టిస్టులను సంప్రదించాల్సిన పరిస్థితి. చివరకు సినిమా దెబ్బతినడానికి అదే కారణం కూడా కావచ్చు. చిన్న నిర్మాతలకు ఇది నిజంగా శరాఘాతమే. ఎంత పెద్ద నిర్మాత అయినా రీషూట్ కి వెళ్లడమనేది ఆర్థికంగా పెనుభారమే! కానీ అనుకోకుండా జరిగే ఈ హఠాత్పరిణామాలను ఎవరూ ఆపలేరు కదా. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ... ఈ మూడునెలల్లో సంభవించిన పరిణామాలు ఇకముందు ఎన్నడూ తెలుగు సినిమాకు ఎదురు కాకూడదని కోరుకుందాం. ‘పిల్లా... నువ్వులేని జీవితం’ సినిమాకు శ్రీహరి పాత్ర వెన్నెముక లాంటిది. ఆయన వెర్షన్ 80 శాతం పూర్తయింది. ఈ లోగా ఘోరం జరిగిపోయింది. ఆయన చేసినన్నాళ్లూ ఎంత బాగా సహకరించారో. ఆయన పాల్గొన్న ఆఖరి తెలుగు సినిమా షూటింగ్ మాదే. ఆర్ఎఫ్సీలో యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నాం. ఆయన కారు డ్రైవ్ చేస్తూ, వేరే కారుని గుద్దేయాలి. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. శ్రీహరికి పెద్ద ప్రమాదమే జరిగిందనుకున్నాం. కంగారుగా పరిగెత్తుకెళ్లి ‘అన్నా... ఏం కాలేదుగా...’ అంటే ‘ముందు షాట్ బాగా వచ్చిందా లేదా చెప్పు’ అనడిగారు. అదీ ఆయన డెడికేషన్. ఇప్పుడా పాత్రను జగపతిబాబుతో రీషూట్ చేస్తున్నాం’’ -రవికుమార్ చౌదరి, దర్శకుడు -
ఏవీఎస్ మరణం తీరని లోటు: బాపు
నటుడు, దర్శకుడు ఏవీఎస్ తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ దర్శకుడు బాపు గుర్తు చేసుకున్నారు. తనకు ఏవీఎస్ ను ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ పరిచయం చేశారు అని అన్నారు. ఆసమయంలో జర్నలిస్టుగా పనిచేస్తూ.. దూరదర్శన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని ఏవీఎస్ ను శ్రీకాంత్ పరిచయం చేశాడని బాపు తెలిపారు. ఎలాంటి శ్రమ లేకుండానే ఇతరులను నవ్వించడం ఏవీఎస్ ప్రత్యేకత అని బాపు అన్నారు. అద్బుతమైన టాలెంట్, మిమిక్రీ నైపుణ్యం కల ఏవీఎస్ ను ఇష్టపడటానికి ఎంతో సమయం పట్టలేదు అని అన్నారు. తాను దర్శకత్వం వహించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంలో నత్తి ఉన్న మేనేజర్ గా నటించిన ఏవీఎస్ కు నంది అవార్డు కూడా వచ్చిందన్నారు. ఏవీఎస్ ఆకస్మిక మరణం పరిశ్రమ తీరని లోటు అని బాపు అన్నారు. శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో ఎన్టీఆర్ తో నటించారని.. ఆ చిత్రం ఆలస్యం కావడంతో ముందు మిస్టర్ పెళ్లాం విడుదలైందని బాపు తెలిపారు. కాలేయ వ్యాధితో బాధపడుతూ ఏవీఎస్ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
ఏవీఎస్‌కు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు ఏవీ సుబ్రహ్మణ్యం(ఏవీఎస్)కు అభిమానులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడి పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో ఏవీఎస్ కుమారుడు ప్రదీప్ కర్మకాండ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం ఏవీఎస్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 9 గంటలకు ఏవీఎస్ పార్థివదేహాన్ని మణికొండలోని ఆయన ఇంటి నుంచి ప్రజల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఏవీఎస్ మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఆయన భార్య ఆశ, కుమార్తె ప్రశాంతి, కుమారుడు ప్రదీప్, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అంతకుముందు సినీ నటులు కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి ఏవీఎస్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఫిల్మ్ చాంబర్ నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకూ జరిగిన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పాల్గొన్నారు. ఏవీఎస్ అమర్ రహే! అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఫిల్మ్ చాంబర్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఏవీఎస్ భౌతికకాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏవీఎస్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మురళీమోహన్, దాసరినారాయణరావు, డి. రామానాయుడు, సీపీఐ కార్యదర్శి నారాయణ, మండలి బుద్ధప్రసాద్, ఎం. వెంకయ్యనాయుడు, రఘుబాబు, నాగబాబు, అల్లు అరవింద్, బ్రహ్మానందం, కృష్ణ, విజయనిర్మల, వెంకటేష్, బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సాయికుమార్, విజయ్‌చందర్, అశోక్‌కుమార్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జయసుధ, నన్నపనేని రాజకుమారి, శివాజీరాజా, శివకృష్ణ, దాసరి అరుణ్‌కుమార్, పరుచూరి గోపాలకృష్ణ, జమున, గద్దర్, ఆర్.నారాయణమూర్తి, నరేష్, కృష్ణుడు, తదితర ప్రముఖులు ఉన్నారు. ఏవీఎస్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటనీరు పెట్టుకున్నారు. -
ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తి
-
ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుంట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు అభిమానుల సందర్శనార్థం ఏవీఎస్ భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉంచారు. పలువురు రాజకీయ నేతలు, నటీ నటులు ఏవీఎస్‌కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
ఫిల్మ్ ఛాంబర్లో ఏవీఎస్ భౌతికకాయం
హైదరాబాద్ : అభిమానుల సందర్శనార్థం ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. సినీనటులు కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి .... తదితరులు ఏవీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఏవీఎస్‌కు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో నిన్న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఏవీఎస్ తన స్వగృహంలో రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు. -
ఏవీఎస్ ఇకలేరు
తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర ఇన్ఫెక్షన్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. వయసు 56 సంవత్సరాలు. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్న ఏవీఎస్‌కు భార్య ఆశ, కుమారుడు ప్రదీప్, కూతురు ప్రశాంతి ఉన్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏవీఎస్‌ను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ మణికొండ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో గల దేవులపల్లి అపార్ట్మెంట్లో ఆయన స్వగృహానికి తరలించారు. ఏవీఎస్ రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయనకు 2008లో కాలేయం పాడైపోగా.. అప్పట్లో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఏవీఎస్ కుమార్తె శ్రీప్రశాంతి ఆయనకు లివర్‌ను దానం చేశారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఐదేళ ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే నటనే ప్రాణంగా బతుకుతున్న ఏవీఎస్ వేళకు మందులు వేసుకోకపోవడం, సమయానికి వైద్యుడిని సంప్రదించకపోవడం వంటి కారణాలతో కాలేయంలో ఇటీవల మళ్లీ ఇన్ఫెక్షన్ వ చ్చింది. మళ్లీ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ.. ఇన్ఫెక్షన్ తగ్గకపోగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడింది. మూత్రపిండాలు కూడా పాడైపోవడంతో డయాలసిస్ చేస్తున్నారు. ఏవీఎస్‌కు మళ్లీ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని, కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని, ఇక తాము ఏమీ చేయలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక తనను చూసేందుకు వచ్చిన వారితో ఏవీఎస్ మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆయన కన్నుమూశారు. ప్రముఖుల నివాళులు: పాత్రికేయుడు, హాస్యనటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడిగా బహుముఖ ప్రతిభాశాలి అయిన ఏవీఎస్ మరణంతో మణికొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనను చివరిసారిగా పరామర్శించిన వారిలో సినీ ప్రముఖులు మురళీమోహన్‌తో పాటు శివకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, జయలలిత, అశోక్‌కుమార్, మహర్షి ఉన్నారు. ఏవీఎస్ మరణం విషయం తెలుసుకుని సినీనటులు సాయికుమార్, ఆలి, ఉత్తేజ్ లు నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఏవీఎస్ మృతికి కిరణ్, బాబు, చిరంజీవి విచారం ఏవీఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఏవీఎస్ ఉత్తమ నటుడని, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏవీఎస్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవీఎస్ మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటని కేంద్ర మంత్రి చిరంజీవి సంతాపం వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రి డీకే అరుణ ఏవీఎస్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. జర్నలిస్టుల ఉద్యమంలో ఏవీఎస్ ఎనలేని కృషి చేశారని స్మరించుకున్నారు. పాత్రికేయుల హక్కుల కోసం ఆయన పోరాటం చేశారని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిడి సోమయ్యలు సంతాపం తెలిపారు. కళా రంగానికి తీరని లోటు: జగన్ సంతాపం హాస్యనటుడు ఏవీఎస్ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఏవీఎస్ మరణం కళా, సాంస్కృతిక రంగాలకు తీరనిలోటన్నారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్ సినీరంగంలో స్థిరపడి, తన నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారని కీర్తించారు. ఏవీఎస్ మృతి సినిమా రంగానికి తీరని లోటంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆ నవ్వుకు నూరేళ్లు
తెనాలిటౌన్/రూరల్, న్యూస్‌లైన్ పత్రికా రంగం నుంచి సినీ పరిశ్రమలో ప్రవేశించి, అక్కడ ఎదిగిన హాస్యనటుడు ఏవీఎస్. అతి స్వల్పకాలంలో తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఏవీఎస్ నిర్మాతగా, దర్శకునిగా ఎదగాలని తపనపడ్డారు. దర్శకత్వంలో పరిణితి సాధిం చక ముందే అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూయడం జిల్లా కళాకారులను, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వెయ్యి సినిమాల మైలురాయి అందుకుంటారని, దర్శకునిగా గొప్ప విజయాలు సాధిస్తారని అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, పరిస్థితి విషమించి కన్నుమూయడంతో ఆయన స్వస్థలం తెనాలిలో విషాదఛాయలు నెలకొన్నాయి. తెనాలిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం(ఏవీఎస్) అతికొద్దికాలంలోనే ఉన్నత శిఖరాలను అందుకున్న గొప్పనటుడు. ఇక్కడి వీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశారు. ఆ కళాశాల లెక్చరర్ నఫీజుద్దిన్ రాసిన నాటకాల్లో ఏవీఎస్ నటిస్తుండేవారు. రసమయి సంస్థను రూపొందించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరుతెచ్చుకున్నారు. లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమ, కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలు, సన్మానాలు నిర్వహిస్తుండేవారు. శారద కళాపీఠం, నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించారు. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ శ్రీనాథ సార్వభౌమ సినిమాలో బాపు, రమణలు ఏవీఎస్‌కు మంచి అవకాశం కల్పించారు. చిత్ర విచిత్రమైన మ్యానరిజాలతో ప్రేక్షకుల్ని నవ్వించడం, సెంటిమెంట్‌తో కంట తడిపెట్టించడం ఆయనకే సొంతం. ‘తుత్తి’ మ్యానరిజం చేసినా, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’, శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఏవీఎస్‌కు 1980లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు, భార్య ఆశాకిరణ్మయి. తెనాలిలో స్టేజి కార్యక్రమాల్లో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరారు. ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దాదాపు 450 సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరుసంపాదించారు. నిర్మాతగా అంకుల్, దర్శకునిగా సూపర్ హీరోస్, కోతిమూకలు సినిమాలు తీశారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు. ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యం ఉండేదని, నటుడు కమలహాసన్, కమేడియన్ నగేష్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవీఎస్ చెపుతుండేవారు. పుట్టినగడ్డ ఆంధ్రాప్యారిస్ తెనాలికి సేవ చేయాలని ఎప్పుడూ తపనపడుతుండేవారు. ఇక్కడ ఏషియన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. వివేక విద్యాసంస్థల డెరైక్టర్ రావిపాటి వీరనారాయణ సహకారంతో గ్లోబల్ హాస్పటల్ సౌజన్యంతో రెండు సార్లు తెనాలిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తెనాలిని సాంస్కృతిక రాజధానిగా గుర్తించాలని కోరుతుండేవారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. -
ఏవీఎస్ మృతికి ప్రముఖుల సంతాపం
హాస్య నటుడు ఏవీఎస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో సాయి కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, ఉత్తేజ్, ఆలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. సినీ జీవితంలో తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నఏవీఎస్ ఇక లేకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రేక్షకులకు ఆయన హాస్యం ఎంతో తుత్తి!
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అన్నట్లుగా... ‘తుత్తి తీరా’ అదే... తృప్తి తీరా నవ్వించి, నవ్వించి కన్నీళ్లు తెప్పించిన ఏవీఎస్... ఇప్పుడు ఒక్కసారిగా ఏడిపించేశారు. కానరాని లోకాలకు తరలివెళ్లి... హాస్యప్రియులందరినీ దుఖఃసాగరంలో ముంచేశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన... శుక్రవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాక, తెలుగువారందరినీ దిగ్భ్రాంతికి లోను చేశారు. అది 1993వ సంవత్సరం. బాపు, రాజేంద్రప్రసాద్‌ల ‘మిస్టర్ పెళ్లాం’ సినిమా విడుదలైంది. ‘పెళ్లి పుస్తకం’ కాంబినేషన్ కదా... ఆటోమేటిగ్గా క్రేజ్ ఉంటుంది. పైగా బాపుగారి సినిమా. అందుకే... ఏదో ఉంటుందని జనాల ఆశ. ఆ నమ్మకంతోనే థియేటర్లు నిండాయి. సినిమా సాఫీగా సాగిపోతోంది. మొగుడూపెళ్లాల గిల్లి కజ్జాలు, పిల్లకాయల అల్లరి చేష్టలు, ముళ్లపూడి మార్క్ పం(మం)చి డైలాగ్స్... ఓవరాల్‌గా సరదాగానే సాగిపోతోంది సినిమా. కానీ ఎక్కడో ఏదో వెలితి. అప్పుడొచ్చింది ఓ కేరక్టర్. ‘ఎవరీ కొత్తతనూ... బాపు గీచిన జెంటిల్మెన్ బొమ్మలా ఉన్నాడే’ అనుకున్నారంతా. వారి అభిప్రాయం తారుమారవ్వడానికి క్షణం పట్టలేదు. చిత్రమైన నత్తితో... ‘నాకు అదో తుత్తి’ అన్నాడంతే. థియేటర్ నవ్వుల్తో ఘొల్లుమంది. సినిమా ‘హిట్’ అన్నారంతా. ‘తుత్తి సుబ్రమణ్యం’... అప్పట్లో ప్రతి తెలుగు లోగిలిలో వినిపించిన పేరు. ‘నిజంగా తనకు నత్తేమో’ అనుకున్నవారు కోకొల్లలు. కాలక్రమంలో ఆ తుత్తి సుబ్రమణ్యమే... ఏవీఎస్‌గా తెలుగు తెరపై ఓ కొత్త కామెడీ శకానికి నాంది పలుకుతాడని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. ఆ మాటకొస్తే... ‘మిస్టర్ పెళ్లాం’లో తాను పోషించిన ‘గోపాల్’ పాత్ర... రెండు దశాబ్దాల తన సినీ ప్రస్థానానికి నాందిగా నిలుస్తుందని బహుశా ఏవీఎస్ కూడా అనుకొని ఉండరు. నిజానికి ‘మిస్టర్ పెళ్లాం’ కంటే ముందే తెలుగు సినిమాకు ఏవీఎస్ పరిచయం. జంధ్యాల ‘ముద్దమందారం’ సినిమాలో ఓ బడ్డీ కొట్టు యజమానిగా కనిపిస్తారాయన. ఏవీఎస్ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రమణ్యం. సద్భ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్నప్పట్నుంచీ ఏవీఎస్‌కి కళలపై మమకారం. తెనాలిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ‘లలిత కళాసమైఖ్య’లో సభ్యునిగా కొనసాగారు ఏవీఎస్. ఆ తర్వాత ఆయనే సొంతంగా ‘రసమయి’ అనే సంస్థను స్థాపించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంఘిక నాటకాలు కూడా వేసేవారు. సినిమా హాళ్లలో వ్యాపార ప్రకటనలు, స్లయిడ్స్ కూడా చేయించేవారు. తర్వాత కొన్నాళ్లు ఒంగోలులో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికా విలేకరిగా పనిచేశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘నవ్వితే నవ్వండి’ అనే కార్యక్రమం ఏవీఎస్ కెరీర్‌ని మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ కార్యక్రమంలో ఏవీఎస్ నటన నచ్చి... ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ సినిమాలో అవకాశం ఇచ్చారు బాపు. కెరీర్ ప్రారంభంలోనే మహానటుడు ఎన్టీఆర్‌తో తెరను పంచుకునే అవకాశం రావడంతో పులకించి పోయారు ఏవీఎస్. అయితే... ఆ సినిమా ప్రారంభం కాస్త లేట్ అవ్వడంతో... ‘మిస్టర్ పెళ్లాం’లో ‘గోపాల్’ పాత్ర ఇచ్చారు బాపు. ఆ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు ఏవీఎస్. 90ల్లో స్టార్ డెరైక్టర్లుగా వెలిగిన ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిల ప్రతి సినిమాలో ఏవీఎస్ ఉండాల్సిందే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శుభలగ్నం’(1994) ఏవీఎస్‌కి సెకండ్ బ్రేక్. ‘బాగున్నారా? మీ ఇంట్లో గోడ ఉందా? దానిమీద బల్లి ఉందా? మంచానికి నల్లి ఉందా?’ అంటూ ఆయన పోషించిన పశ్నాపత్రం పాత్ర ప్రేక్షకుల పొట్టల్ని చెక్కలు చేసింది. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ‘రంగు పడుద్ది’ అని ఏవీఎస్ చెప్పిన డైలాగు తెలుగునాట యమ పాపులార్. అలాగే ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ఆమె, ఆయనకిద్దరు, ఇంట్లో ఇల్లాలు-వంటిట్లో ప్రియురాలు... ఇలా పలు చిత్రాల్లో చక్కని కామెడీని పండించారు ఏవీఎస్. దాదాపు 500 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఏవీఎస్ పౌరాణిక పాత్రలు కూడా పోషించారు. ‘అన్నమయ్య’ చిత్రంలో నారదుడిగా తక్కువ నిడివి ఉన్న పాత్ర చేశారాయన. ఆ పాత్రే ‘భాగవతం’లాంటి గొప్ప ధారావాహికలో నారదునిగా నటించే అవకాశాన్ని ఆయనకు తెచ్చిపెట్టింది. తన గాడ్‌ఫాదర్ బాపునే ఈ ధారావాహికకు దర్శకుడు కావడం విశేషం. ఈ సీరియల్లో నారదునిగా ఏవీఎస్ నటన ప్రశంసలందుకుంది. ‘శ్రీకృష్ణార్జున విజయం’లో శకునిగా నటించిన ఏవీఎస్ చిత్రగుప్తునిగా కూడా కొన్ని సినిమాల్లో మెప్పించారు ఏవీఎస్‌కు ‘డెరైక్షన్’ అంటే ఇష్టం. ఆయన దర్శకత్వంలో సూపర్‌హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, రూమ్మేట్స్, కోతిమూక చిత్రాలు విడుదలయ్యాయి. అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం గాను చిత్రాలకు నిర్మాత కూడా ఏవీఎస్సే. కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న క్రమంలో నిర్మాణం, దర్శకత్వం వైపు దృష్టి సారించి... అవి సరిగ్గా ఆడకపోవడంతో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నారాయన. మణిశర్మను ‘సూపర్‌హీరోస్’ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం(మా)కి మూడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఏవీఎస్ రచయిత కూడా. ‘ఉత్తినే’ పేరుమీద ఆయన రాసిన వ్యాస సంకలనం పలువురి ప్రశంసలందుకుంది. ‘నేను నవ్వను...’ అని భీష్మించుకొచి1 కూర్చున్న వాడ్ని సైతం... పగలబడి నవ్వించేంత ప్రతిభాశాలి, బహుముఖ ప్రజ్ఞాశాలీ ఏవీఎస్. ఆయన పేరు వినగానే.. ప్రేక్షకుల పెదవులు ఆటోమేటిగ్గా విచ్చుకుంటాయి. అసలు పేరు ‘ఆమంచి’ వెంకట సుబ్రమణ్యం అయినా.. అందరితో ‘మామంచి’ వెంకట సుబ్రమణ్యం అనిపించుకున్న ఏవీఎస్‌కి నవ్వించడం ఓ ‘తుత్తి’. అందుకే తృప్తి తీరా ప్రేక్షకుల్ని నవ్వించారు. ఇప్పుడు దూరమై అందరినీ ఏడిపిస్తున్నారు. -
ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ ఇకలేరు
-
హాస్య నటుడు ఏవీఎస్ ఇకలేరు
ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు.ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారుశుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, 'ఇంద్ర', 'కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు.సూపర్ హీరోస్, అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మేట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
సోషల్ మీడియాలో ఏవీఎస్ మృతికి స్పందించిన ప్రముఖులు, అభిమానులు
ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం (ఏవీఎస్) శుక్రవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమ ప్రముఖ హాస్యనటుడిని కోల్పోయిందని ఆవేదన సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో వ్యక్తం చేశారు. Lost a good human being and wonderful actor Sri AVS. Shocking news. Praying god to give strength for his family. — Mohan Babu M (@themohanbabu) November 8, 2013 RIP AVS Gaaru ..Great comedian. — Gopichand Malineni (@megopichand) November 8, 2013 Journalist, Actor, Producer and Director 'AVS' Garu is no more. May his Soul Rest in Peace... pic.twitter.com/17dqCh1SjA — Maheshbabu Fan Club (@MaheshBabu_FC) November 8, 2013 Actor AVS is no more.. — Jalapathy Gudelli (@JalapathyG) November 8, 2013 Who can forget the dialogue ``adho thutthi ``. #RIPAVS garu — Kishore Varma (@varma240) November 8, 2013 Very sad to know about your demise sir, can never forget you & your roles.. Rest in peace AVS Garu.. — Deepak Reddy (@Deepuzoomout) November 8, 2013 Deep condolences to AVS garu's family. His daughter did everything she cud to save her father.. God give you strength to withstand the loss. — Prashanth Bhat (@prashanthbhat) November 8, 2013 Amanchi Venkata Subrahmanyam (AVS) gaaru Passed Away #Tollywood lost another Finest artist — mani (@ManiRangu) November 8, 2013 HeartbreAking news of AVS garu's passing. May his soul rest in peace.much strength to his family. — Lakshmi Manchu (@LakshmiManchu) November 8, 2013 My co actor my family friend Avs garu no more RIP:-( — ganesh bandla (@ganeshbandla) November 8, 2013 Telugu actor AVS garu is no more. Sweet man. He used to speak very passionately about cinema. Gone too soon. RIP sir. — Siddharth (@Actor_Siddharth) November 8, 2013 Another loss to tfi :( AVS garu! Rip !! — Navdeep (@pnavdeep26) November 8, 2013 Shocked to hear the news that Avs garu passed away. One of the best comedians of our time. May his soul rest in peace. — siva koratala (@sivakoratala) November 8, 2013 RIP AVS Garu... Strength to the family — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 8, 2013 " Adho thupthi " "Rangu padithi " "Haarathi Gai Konave " AVS gaaru is One of the finest comedian TFI has got, can't digest his loss — Trivikram Dialogues (@TrivikramFans) November 8, 2013 Omg one more shocking news for Tollywood -- well known comedian and director SrI AVS Gaaru no more ---RIP http://t.co/uqTA8iCPbB — RAGHU KUNCHE (@kuncheraghu) November 8, 2013 AVS is no more!! :( RIP sir — Mahesh S Koneru (@smkoneru) November 8, 2013 Telugu Actor/Producer/Director AVS is no more. He introduced Mani Sharma, one of the finest music directors of TFI. RIP AVS garu. — T.H.A.R.U.N (@Tharun_Yeluguri) November 8, 2013 Tamil comedian actor #chittibabu and Telugu comedian actor #avs ... what a sad day :( :( #RIP great loss to industry — 1 (@urstrulyMahe5h) November 8, 2013 Very saddened to hear bout the death of AVS garu. Was a grt comedian n a grt guy. May his soul R.I.P.. Deepest condolences to his family... — Varun Sandesh (@iamvarunsandesh) November 8, 2013 Very Sad to know abt the death of AVS. One of the great comedians to have donned TFI. & made Thuththi a household word with Mr.Pellam R.I.P — Vijay Saradhi (@vjeedigunta) November 8, 2013Rest In Peace AVS garu...We all will miss u sir :'( pic.twitter.com/UeeFl6O5vZ— RJV (@RJV4U) November 8, 2013 -
ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ ఇకలేరు
ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏవీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏవీఎస్ కు గత కొద్దిరోజులుగా గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిలో మార్పులేకపోగా.. మరింత క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఈ మధ్యాహ్నం ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. గతంలో ఏవీఎస్ కు కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తగా ఆయన కుమార్తె కాలేయ దానం చేశారు. దాంతో కొద్ది రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమంగా మారండంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. తుత్తి అనే పదం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం లాంటి ప్రముఖ హస్య నటులతో సమానంగా ఏవీఎస్ రాణించారు. ఆయన నటించిన తొలి చిత్రం 'మిస్టర్ పెళ్లాం' లో ఉత్తమ ప్రదర్శనకు నంది అవార్డు లభించింది. హస్య నటుడే కాక, దర్శకుడిగా పనిచేశారు. శుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, 'ఇంద్ర', 'కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు. సూపర్ హీరోస్, అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మేట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పాత్రికేయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్, ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఆయన తన కలానికి పదును పెడుతూనే ఉన్నారు. తరచు దినపత్రికలలో ఆయన పేరు కనిపిస్తుంటుంది. ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమ ప్రముఖ హాస్యనటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
'ఏవీఎస్ బాగానే ఉన్నారు.. మాట్లాడుతున్నారు'
నటుడు ఏవీఎస్ అనారోగ్యానికి గురైనా.. బాగానే ఉన్నారు అని శుక్రవారం సాయంత్రం మీడియాతో మురళీ మోహన్ అన్నారు. ఏవీఎస్ మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఆయనపై టెలివిజన్ లో వస్తున్న వార్తలన్ని అవాస్తవాలు అని అన్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారు అని అన్నారు. గ్లోబల్ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు ఏవీఎస్ ను మణికొండలోని ఆయన కుమారుడి నివాసానికి తీసుకువెళ్లారు. ఏవీఎస్ ను చిత్ర రంగ పరిశ్రమ కు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఏవీఎస్ త్వరలోనే కోలుకుంటారు అని సహచర నటులు విశ్వాసం వ్యక్తం చేశారు. -
నటుడు ఏవీఎస్ ఆరోగ్యం విషమం
-
నటుడు ఏవీఎస్ కు అస్వస్థత
ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం(ఏవీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్దికాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతంలో ఏవీఎస్ కు కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. ఏవీఎస్ కు ఆయన కూతురు కాలేయ దానం చేశారు. దాంతో ఆయన ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించడంతో గ్లోబల్ ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ఏవీఎస్ ను ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో తుత్తి అనే పదం ద్వారా 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ 400 పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు, ఆలీ, బ్రహ్మనందం లాంటి ప్రముఖ హస్య నటులతో సమానంగా ఏవీఎస్ రాణించారు. శుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, ఇంద్ర, కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు. సూపర్ హీరోస్, అంకుల్, ఓర్ని ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మెట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
నటుడు ఎవిఎస్ కు తీవ్ర అస్వస్థత