'ఏవీఎస్ బాగానే ఉన్నారు.. మాట్లాడుతున్నారు'
నటుడు ఏవీఎస్ అనారోగ్యానికి గురైనా.. బాగానే ఉన్నారు అని శుక్రవారం సాయంత్రం మీడియాతో మురళీ మోహన్ అన్నారు. ఏవీఎస్ మాట్లాడుతున్నారు అని తెలిపారు. ఆయనపై టెలివిజన్ లో వస్తున్న వార్తలన్ని అవాస్తవాలు అని అన్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారు అని అన్నారు.
గ్లోబల్ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు ఏవీఎస్ ను మణికొండలోని ఆయన కుమారుడి నివాసానికి తీసుకువెళ్లారు. ఏవీఎస్ ను చిత్ర రంగ పరిశ్రమ కు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఏవీఎస్ త్వరలోనే కోలుకుంటారు అని సహచర నటులు విశ్వాసం వ్యక్తం చేశారు.