సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఉప్పర కులస్తులను ధమాకా సినిమా దర్శకుడు త్రినాథరావు ప్రీ రలీజ్ ఈవెంట్‌లో అవమానించారని వెంటనే తమ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు.
దర్శకుడు త్రినాథ్‌రావు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సగర ఉప్పర సంఘం ప్రతినిధులు
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అంటూ హేళన చేశారని ఆరోపించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సాగర్, కోశాధికారి రామస్వామి, ఫిలింనగర్ అధ్యక్షుడు మధుసాగర్, ప్రధాన కార్యదర్శి నాగేష్ సాగర్, డి.రాంచందర్, చెన్నయ్య, సీతారాములు, వెంకటస్వామి, మూసాపేట్ సగర సంఘం అధ్యక్షుడు లోకేష్ సాగర్, రామకృష్ణ సాగర్, అంజయ్య నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, బి.శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment