పవన్ నిరసన: ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత | Pawan Kalyan Protest At Film Chamber | Sakshi
Sakshi News home page

పవన్ నిరసన: ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత

Published Fri, Apr 20 2018 12:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

ఫిల్మ్‌ ఛాంబర్‌లో పవన్‌ కల్యాణ్‌.. మెగా ఫ్యామిలీ, కొందరు సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్‌కు మద్ధతు తెలపటానికి వచ్చిన ఫ్యాన్స్‌ ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. మరోవైపు పవన్‌ ఫ్యాన్స్‌ ‘ఎల్లో మీడియా డౌన్‌ డౌన్‌.. లోకేశ్‌ పప్పు నినాదాలతో’ ఆ ప్రాంతమంతా హోరెత్తించారు.

సినీ ప్రముఖులంతా ఒక్కోక్కరుగా పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు ఛాంబర్‌కు చేరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతోపాటు దర్శకుడు వీవీ వినాయక్‌, జీవి, రమేశ్‌ మెహర్‌, మా సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో మెగాస్టార్‌ చిరంజీవి కూడా రావొచ్చని సంకేతాలు అందుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌కు సినీ రంగం బాసటగా నిలుస్తోంది. పూరీ జగన్నాథ్‌ ఇప్పటికే ట్వీట్‌ చేయగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు స్పందించారు. వర్మను ఓ వేస్ట్‌ ఫెలో అంటూ అభివర్ణించిన ఆయన.. మెగా ఫ్యామిలీకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement