నేడు ఫిల్మ్ చాంబర్‌లో తెలంగాణ సంబరాలు | Today, celebrating the film chamber | Sakshi
Sakshi News home page

నేడు ఫిల్మ్ చాంబర్‌లో తెలంగాణ సంబరాలు

Published Sat, Jun 7 2014 12:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Today, celebrating the film chamber

వెంగళరావునగర్, న్యూస్‌లైన్: తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్, సినీ దర్శకుల సం ఘం, సినీ నిర్మాతల మండలి, కార్మికుల సమా ఖ్య సంయుక్త సౌజన్యంతో శనివారం ఫిలింనగర్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో తెలంగాణ సంబరాలను నిర్వహించనున్నట్టు ఫోరం కన్వీనర్ నాగబాల సురేశ్‌కుమార్ తెలిపారు.

వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న తెలంగాణ టీవీ డెవలప్‌మెంట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబరాల విశేషాలను వివరించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బాబూమోహన్, రసమయి బాలకిషన్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ లోగోను తయారు చేసిన లక్ష్మణ్ ఏలేను ఘనంగా సత్కరిస్తామన్నారు.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నాటికలు, పద్యాలు, పాటలు, భజనలు, తెలంగాణ ధూంధాం తదితర కార్యక్రమాలను భారీ ఎత్తు న నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ కళాకారులు, టెక్నీషియన్లు పెద్ద ఎత్తున ఈ వేడుకలకు హాజరుకావాలని కోరారు. విలేకరు ల సమావేశంలో ఫోరం కన్వీనర్లు యాటా సత్యనారాయణ, టీవీ చౌదరి, డి.రామకృష్ణ, వైభవ్ సూర్య, రాజేంద్రరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement