అనుమతి లేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝలిపించారు. మంగళవారం హిమాయత్‌నగర్ డిప్యూటీ డీఈఓ సురేష్‌కుమార్ అంబర్‌పేటలోని గ్లోబల్ కీ స్టోన్, డీడీ కాలనీలో ఉన్న నారాయణ టెక్నో స్కూల్‌ను సీజ్ చేశారు. ఓయూ విద్యార్థి జేఏసీ నగర అధ్యక్షుడు శ్రీకాంత్‌తో పాటు పలువురు విద్యార్థి నాయకుల ఫిర్యాదు మేరకు ఈ స్కూల్‌ను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించానని ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ తెలిపారు.
పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని విద్యార్థులకు అడ్మిషన్‌లు ఇవ్వాలని ఆయన సూచించారు. గ్లోబల్ కీ స్టోన్ స్కూలు కనీస అనుమతి కోసం దరఖాస్తు చేయలేదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సూర్య, హర్షత్, షాహిద్, శ్రీశైలం, సాయి తదితరులు ఉన్నారు.
నిబంధనలు పాటించని పాఠశాలలు సీజ్
Published Tue, Apr 26 2016 7:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement