walked out
-
మరో వివాదంలో ఇరుక్కున్న విశ్వక్ సేన్.. ఫిల్మ్ చాంబర్లో కంప్లైంట్?
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతున్నాడు. రీసెంట్గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా పూర్తిచేశారు. ఇలాంటి సమయంలో విశ్వక్సేన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన అర్జున్ సర్జా విశ్వక్ సేన్ మీద ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళుతుందన్నది చూడాల్సి ఉంది. -
అన్న ఎర్రబెల్లి నేతృత్వంలో వాకౌట్
రేవంత్‌రెడ్డి సరదా వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘అన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో వాకౌట్ చేస్తున్నాం’ అంటూ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులను ఆశ్చర్యానికి గురిచేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు అంశంపై టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య.. మరికొందరు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వస్తున్న సందర్భంగా ఎర్రబెల్లి అసెంబ్లీ లాబీల్లో వారికి ఎదురయ్యారు. విలేకరులతో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దగ్గరకు రేవంత్‌రెడ్డి వచ్చి ‘అన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలోనే వాకౌట్ చేస్తున్నాం. ఎర్రబెల్లి మాకన్నా ముందుగానే సభనుంచి బయటకు వచ్చారు. ఆయన బాటలోనే మేము బయటకు వచ్చాం. దొరల నాయకత్వాన్ని కాదనే పరిస్థితి ఇప్పుడుందా’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి ఎర్రబెల్లి సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉండిపోయారు. -
బీబీఎంపీ విభజన అనివార్యం
- విపక్షాల వాకౌట్ మధ్య సభ అమోదం సాక్షి, బెంగళూరు : బీజేపీ, జేడీఎస్ నాయకుల వాకౌట్ మధ్య బీబీఎంపీ విభజనకు సంబంధించి రూపొందించిన ‘కర్ణాటక నగర పాలికె విభజన-15’ ముసాయిదా బిల్లుకు శాసనసభలో మంగళవారం అంగీకారం లభించింది. బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయించాలనే ఉద్దేశంతోనే పదేపదే ప్రభుత్వం ‘విభజన’ మంత్రం జపిస్తోందని ఈ సందర్భంగా విపక్షనాయకులు ఆరోపించారు. శాసనమండలిలో తిరస్కరణకు గురైన ముసాయిదా బిల్లును న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తిరిగి శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సమయంలో విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ... ఈ ముసాయిదా అంగీకారం కోసమే గతనెల మూడు రోజుల పాటు ప్రత్యేక శాసనసభా సమావేశాలు జరిగాయన్నారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కారణంతో ముసాయిదా బిల్లుకు శాసనసభలో అంగీకారం లభించినా పరిషత్‌లో సదరు ముసాయిదా బిల్లు విషయంలో అధికార పార్టీకు భంగపాటు ఎదురైందన్నారు. మండలి అధ్యక్షుడి సూచన మేరకు ఏర్పాటైన సెలక్ట్ కమిటీలోని పదమూడు మంది సభ్యుల్లో ఏడుగురు సభ్యులు ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, కేవలం ఆరుగురు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారన్నారు. అయినా తిరిగి శాసనసభలో ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పదేపదే ముసాయిదా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టి విలువైన సభాసమయాన్ని వ్యర్థం చేస్తోందని విమర్శించారు. మొదట ఎన్నికలు నిర్వహించి అటుపై బీబీఎంపీను ఐదు కాదు... 50 భాగాలుగా విభజించినా తమకు అభ్యంతరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో బీజేపీకు చెందిన మరో సీనియర్ నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ...‘పాలనా సౌలభ్యం కోసమే అధికార పార్టీ పాలికెను విభజించాలనుకుంటే ఈ ప్రక్రియను ఏడాది ముందుగానే చేసి ఉండవచ్చుకదా?. హై కోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సూచించినా... ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామన్న భయంతోనే ప్రభుత్వం పదేపదే విభజన మంత్రం జపిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికార విపక్షాల విమర్శల మధ్యనే ముసాయిదా బిల్లు పై ఓటింగ్ పెట్టడానికి సమాయత్తమయ్యారు. దీంతో బీజేపీ, జేడీఎస్ శాసనసభలోని వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. అయితే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ముసాయిదా బిల్లుకు తమ మద్దతు తెలిపారు. మూజువాణి ఓటుతో ముసాయిదా బిల్లు పాస్అయినట్లు స్పీకర్ ప్రకటిస్తున్న సమయంలోనే విపక్షాలు శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇదిలా ఉండగా శాసనసభలో రెండోసారి ముసాయిదా బిల్లు అంగీకారం పొందినందువల్ల మరోసారి పరిషత్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా గవర్నర్ అనుమతి కోసం బిల్లు రాజ్‌భవన్‌కు వెళ్లనుంది. అక్కడ అనుమతి లభించిన వెంటనే బీబీఎంపీ విభజన జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించనుంది.ృబహత్ బెంగళూరు మహానగర పాలికె లేనప్పుడు దానికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నుంచి అనుమతి తీసుకుని ఎన్నికలను వాయిదా వేయించాలనే ఉద్దేశంతో ముసాయిదా బిల్లును రూపొందించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ప్రగతిపై ప్రచారం!
సాక్షి, చెన్నై: కార్పొరేషన్ సంక్షేమ పథకాలు, రాష్ర్ట ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బస్టాపుల్ని వేదికగా చేసుకుని ప్రచార బోర్డుల ఏర్పాటుకు చెన్నై కార్పొరేషన్ పాలక మండలి నిర్ణయించింది. స్వైన్‌ఫ్లూ అదుపులో ఉందంటూ మేయర్ సైదైదురై స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. చెన్నై మహానగర కార్పొరేషన్ పాలక మండలి సమావేశం శుక్రవారం రిప్పన్ బిల్డింగ్‌లో జరిగింది. మేయర్ సైదైదురై స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిషనర్ విక్రమ్ కపూర్, డెప్యూటీ మేయర్ బెంజమిన్‌లు నేతృత్వం వహించారు. సభ ఆరంభం కాగానే, శ్రీరంగం ఉప ఎన్నికల గెలుపు భజనను అందుకున్నారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపునకు అభినందనలు తెలియజేస్తూ , తమ అమ్మ జయలలితను పొగడ్తలతో ముంచెత్తారు. ఇందుకు గాను ప్రత్యేక తీర్మానం కూడా చేశారు. అనంతరం నగరంలో దోమల మోత, స్వైన్ ఫ్లూ నివారణ చర్యలను వివరిస్తూ మేయర్ సైదైదురై స్వామి ప్రసంగించారు. నగరంలో 77 కేసులు నమోదయ్యాయని, 37 మంది సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారని వివరించారు. మిగిలిన వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. ఒకరు మాత్రం మరణించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కట్టడిలో ఉందని, ప్రజల్లో నెలకొన్న ఆందోళనల్ని తొలగించే విధంగా అవగాహన కార్యక్రమాలు వేగవంతం చేసి, ఆ జ్వరం కట్టడికి కార్పొరేషన్ విస్తృత చర్యలు తీసుకుందని డప్పులు వాయించుకుంటూ వ్యాఖ్యలు చేశారు. దోమల్ని పూర్తిగా అదుపు చేశామని, స్వైన్ ఫ్లూ ఇక లేనట్టే అన్నట్టుగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రతి పక్ష నేత డీఎంకే సభ్యుడు సుభాష్‌చంద్ర బోస్ తీవ్ర ఆక్షేపనల్ని వ్యక్తం చేశారు. డీఎంకే వాకౌట్: ప్రతి పక్షనేత సుభాష్ చంద్రబోస్‌తో పాటుగా డీఎంకే సభ్యులు జోషఫ్ శ్యాముల్, కాళి ముత్తు, తదితరులు మేయర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. అన్నీ తప్పుడు సమాచారాలు ఇస్తున్నారని, ఆయన వ్యాఖ్యల్లో ఒక్క నిజం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, ఇస్తే కార్పొరేషన్ వ్యవహరించిన తీరును ఆధారాలతో సహా ముందు ఉంచుతామని హెచ్చరించారు. వారి హెచ్చరికల్ని, నినాదాల్ని మేయర్ ఖాతరు చేయకుండా, తన ప్రసంగాన్ని ముందుకు సాగించారు. ఆగ్రహించిన డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభలో కార్పొరేషన్ నేతృత్వంలో చేపట్టనున్న అనేక అభివృద్ధికార్యక్రమాల్ని వివరిస్తూ పలు తీర్మానాలను మేయర్ సైదైదురై స్వామి ప్రవేశ పెట్టారు. ఓ సభ్యుడు వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, కార్పొరేషన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, రాష్ర్ట ప్రభుత్వ ప్రగతి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని మేయర్ ప్రకటించారు. -
కార్పొరేషన్లో ‘కోడిగుడ్డు’
ఓడిన పార్టీలంటే గెలిచిన పార్టీలకు ఎప్పుడూ చులకనేనని అన్నాడీఎంకే నిరూపించింది. ఓటమి చవిచూసిన పార్టీలకు కార్పొరేషన్ సాక్షిగా కోడిగుడ్డు చూపించి వాగ్యుద్ధానికి తెరదీసింది. చెన్నై కార్పొరేషన్లో శుక్రవారం జరిగిన సమావేశం గందరగోళం, వాకౌట్ల నడుమ రసాభాసగా సాగింది. - ప్రతిపక్ష ఓటమిపై అన్నాడీఎంకే కౌన్సిలర్ ఎద్దేవా - డీఎంకే, కాంగ్రెస్‌సభ్యుల వాకౌట్ - నగరంలో 15 రోడ్ల విస్తరణ - మరో 200 అమ్మ క్యాంటీన్లు చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల వేడి చల్లారినా పార్టీల మధ్య వైషమ్యాల సెగలు మాత్రం సమసిపోలేదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఒంటి చేత్తో 37 లోక్‌సభ సీట్లు మూటగట్టుకుంది. విధిలేక ఒంటరిపోరుకు దిగిన కాంగ్రెస్ గెలుపు మాట అటుంచి డిపాజిట్టును కోల్పోయింది. ఇక అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎం కే 35 స్థానాల్లో (మిత్రపక్షం 5) పోటీచేసి దారుణ పరాభవానికి గురైంది. గెలుపోటములపై రాష్ట్ర పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్న తరుణంలో ఎన్నికల తరువాత తొలి సమావేశం శుక్రవారం జరిగింది. మేయర్ సైదై దొరస్వామి సమావేశానికి అధ్యక్షత వహించగా, తొలి అంశంగా అన్నాడీఎంకే అధినేత్రికి ధన్యవాదాలు చెప్పే తీర్మానా న్ని ప్రతిపాదించారు. ఇందుకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. కార్పొరేషన్ సమావేశం ప్రజా సమస్యలను చర్చించేందుకే గానీ ప్రశంసలు కురిపించేందుకు కాదని ప్రతిపక్ష నేత సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. నగరంలో విద్యుత్ కోత, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అనేక సమస్యలుండగా, అభినందన తీర్మానం ఏమిటని అడ్డుతగిలారు. ఇంతలో అన్నాడీఎంకే మహిళా కౌన్సిలర్ వేలాంగణి కుర్చీ నుంచి లేచి డీఎంకే, కాంగ్రెస్‌ల ఓటమికి చిహ్నంగా కోడిగుడ్డును చూపారు. ఎన్నికల సమయంలో తరచూ 144 సెక్షన్ అమలుచేయడం వల్లే అన్నాడీఎంకే గెలుపు సాధ్యమరుందని వారు ఎద్దేవా చేశారు. అయినా అధికార పార్టీ సభ్యుల విమర్శలు కొనసాగించడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాల వారు వాకౌట్ చేశారు. మరికొద్ది సేపటికి వారంతా సమావేశం హాలులోకి ప్రవే శించగా ఆమె మళ్లీ కోడిగుడ్డును ప్రదర్శించారు. అయితే రెండోసారి ఆమె చేతి నుంచి కోడిగుడ్డు జారిపడి పగిలిపోవడంతో సభ్యులంతా నవ్వుకున్నారు. మరో 200 అమ్మ క్యాంటీన్లు: నగరంలో మరో 200 అమ్మ క్యాంటీన్లను తెరవనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. నగరంలో మొత్తం వెయ్యి క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యంకాగా తొలివిడతగా నగరంలోని అన్ని వార్డుల్లో 200 క్యాంటీన్లు ప్రారంభమైనట్లు మేయర్ తెలిపారు. దశలవారీగా 1000 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో ఇరుకుగా ఉన్న 15 రోడ్లను విస్తరించనున్నట్లు చెప్పారు. రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయని పేర్కొన్నారు. కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆళ్వారుపేటలోని సంక్రాంతి హోటల్‌కు సీలువేసినట్లు ప్రకటించారు. ఇంటికోసం దరఖాస్తు చేసుకుని హోటల్ నిర్మాణం చేపట్టినందుకే ఈ చర్యతీసుకున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేషన్ దుకాణాలకు లెసైన్సు పొంది సబ్‌లీజు ఇస్తే మంజూరైన లీజును రద్దుచేస్తామని మేయర్ హెచ్చరించారు.