యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి కొద్దిరోజుల క్రితమే ఘనంగా జరిగింది. అయితే, తాజాగా తన ముద్దుల కూతురి పెళ్లి వేడుక వీడియోను అభిమానుల కోసం ఆయన షేర్ చేశాడు. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న వీరి ప్రేమ వివాహం జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలో చాలామంది ప్రముఖులు పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు.
అర్జున్ షేర్ చేసిన వీడియోలో ఐశ్వర్య- ఉమాపతిల పెళ్లి వేడుకను చూడొచ్చు. వీణా శ్రీవాణి అందించిన చక్కని సంగీతంతో వీడియో ప్రారంభమౌతుంది. పెళ్లి పీటలపై ఐశ్వర్యను చూసుకున్న అర్జున్ చాలా మురిసిపోతాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు వీడియోలో చాలానే ఉన్నాయి.
మా ముద్దుల కూతురు ఐశ్వర్య తనకు నచ్చిన, మా ప్రియమైన ఉమాపతిని వివాహం చేసుకున్నప్పుడు మేము అనుభవించిన ఆనందం మాటల్లో చెప్పలేము. తన పెళ్లి ఎన్నో మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. వారిద్దరూ కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టడం చూస్తుంటే మా హృదయాలు గర్వంతో నిండిపోయాయి. 'జీవితకాలం పాటు మీ ప్రేమకు తోడు ఆనందం కూడా జతకూడాలని వేల కోట్ల ఆశీర్వాదాలు అందిస్తున్నాము. మీరు పంచుకునే ప్రేమలాగే మీ ప్రయాణం కూడా అందంగా ఉండాలి. ఎప్పటికీ మేము మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాము.' అని అర్జున్ ఎమోషనల్‌గా ఒక పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment