కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇం‍ట్రెస్టింగ్ కామెంట్స్ | Actor Arjun Sarja Reacts On Daughter Aishwarya Umapathy Wedding, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Arjun: అలా నా కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగిపోయింది

Jun 17 2024 8:24 AM | Updated on Jun 17 2024 10:39 AM

Arjun Sarja Respond On Daughter Aishwarya Umapathy Wedding

యాక్షన్ కింగ్ అర్జున్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా ఇతడి కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది. తమిళ నటుడు తంబిరామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కారు. సంగీత్, పెళ్లి, రిసెప్షన్‌ పూర్తయిన తర్వాత వీళ్లంతా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ 'లవ్ మీ')

'తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం. ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేశారు. అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్‌గా పోటీ చేశాడు. అప్పుడే తన నాకు నచ్చేశాడు. ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలని అడిగింది. దీంతో అది ప్రేమ వ్యవహారం అని ఊహించా. ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో నేను షాకయ్యా. ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో నేను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడుకున్నాం. అలా ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి జరిగిపోయింది' అని అర్జున్ చెప్పుకొచ్చారు.

పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారనే ప్రశ్నకు బదులిచ్చిన అర్జున్.. తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న ఆమెకు.. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం కూడా తెలుసని అర్జున్ పేర్కొన్నాడు. 

(ఇదీ చదవండి: దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement