
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య ఇంటికి కోడలిగా వెళ్లనుంది. తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేయనుంది.

ఆప్యాయంగా ముద్దాడిన తండ్రి
ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకోగా తాజాగా హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దాడాడు. కాగా ఇది లవ్ మ్యారేజ్.. ఐశ్వర్య- ఉమాపతి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా గతేడాదే వారు పచ్చజెండా ఊపారు. అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిపారు.

కెరీర్..
సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.

Comments
Please login to add a commentAdd a comment