యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్, లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి జూన్ 10న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరుకుటుంబాలు సహా దగ్గరి బంధుమిత్రులు సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం (జూన్ 14న) చెన్నై లీలా ప్యాలెస్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బీజేపీి అధ్యక్షులు అన్నామలై, స్నేహ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
చదవండి: చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్..
Comments
Please login to add a commentAdd a comment