పాఠాలు నేర్పిన గురువు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కానీ అభిమాని పేరు చెప్పగానే కదల్లేని స్థితిలో ఉన్న ఆయన కళ్లలో ఒక మెరుపు. అది చూసిన కాంగ్రెస్ లీడర్ సజరిత లైఫ్‌లాంగ్.. ఎలాగే ఆ శిష్యుడిని గురువు ముందు హాజరుపర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం అలాగైనా ఆయన ఆరోగ్య పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నారు.
క్షీణిస్తున్న ఆరోగ్యం
ఆ శిష్యుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ గురువు ఎరిక్ డిసౌజ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ విషయాన్ని డిసౌజ సోదరి సజరిత లైఫ్‌లాంగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'నా సోదరుడు ఎరిక్ డిసౌజ హెల్త్ కండీషన్ దిగజారుతోంది. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ప్లీజ్ షారూఖ్.. ఒక్కసారి ఆయనను చూడటానికి రా.. క్షణాలు గడిచేకొద్దీ తనకేం జరుగుతుందోనని భయంగా ఉంది. ముంబై నుంచి గోవా రావడానికి పెద్దగా సమయం కూడా పట్టదు.
కొన్ని నిమిషాలు చాలు
ఒక అరగంటలో వచ్చేయొచ్చు. కేవలం కొన్ని నిమిషాల సమయం తన కోసం కేటాయించు. ఇప్పుడాయనకు మీరే ప్రపంచం. మీ రాక వల్ల తను కోలుకునే అవకాశం ఉంది. లేదంటే తన కళ్లముందు కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి లభించి శాంతి చేకూరవచ్చు. చివరిసారిగా అడుగుతున్నాను.. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాను' అని అభ్యర్థించారు. షారూఖ్‌కు, ఎరిక్ డిసౌజకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ పాత వీడియోను సైతం షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు షారూఖ్.. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన గురువును చూసేందుకు వెళ్లాలని కోరుతున్నారు.
This feels like my final plea, my last attempt to reach out to @iamsrk to humbly request his presence by the side of Brother Eric S D'Souza. Each day, Brother 's health weakens, his condition worsening with every passing moment. Mumbai, just an hour away by flight, holds the… pic.twitter.com/9HaCjp5gLv
— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 14, 2024
— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 15, 2024
చదవండి: 'మహారాజ'.. విజయ్ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి
Comments
Please login to add a commentAdd a comment