'మహారాజ' సినిమాతో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హాఫ్ సెంచరీ కొట్టాడు. తన కెరీర్‌లోని 50వ సినిమా అయిన మహారాజకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కూతురు జ్యోతిగా సాచన నమిదాస్ అనే అమ్మాయి నటించింది.
చివర్లో నేను..
అయితే ఈ సినిమా కోసం సెలక్ట్ చేసినప్పుడు తనను తీసుకోవద్దని సేతుపతి సూచించాడట. తాజాగా ఈ విషయాన్ని సాచన బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. చాలామంది ఆడిషన్‌కు వచ్చారు. స్క్రీన్ టెస్ట్ సహా అంతా అయిపోయేసరికి చివర్లో నేను, మరో అమ్మాయి మిగిలాం. విజయ్ సేతుపతిగారు నన్ను వద్దని సూచించారు. మరో అమ్మాయిని తీసుకోమని సలహా ఇచ్చారు.
నన్ను వద్దన్నారు
కానీ దర్శకుడు నితిలన్ సర్ మాత్రం నేను చేస్తేనే బాగుంటుందని చెప్పి సినిమాలో తీసుకున్నారు. షూటింగ్ మొదలైన వారం రోజులకే నన్ను తీసుకుని మంచి పని చేశారని విజయ్ సేతుపతి తండ్రి డైరెక్టర్‌ను మెచ్చుకున్నారు. చాలామంది నేను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు నా వయసు 18 ఏళ్లు అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సేతుపతి సైతం సాచన నటనను మెచ్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఒక చిత్రం చేస్తున్నాడు.
చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment