
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఐశ్వర్య తెలిపారు. ఇక ఐశ్వర్య అర్జున్ 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. (24 గంటల్లో 40 వేల పాజిటివ్ కేసులు)
నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో తను హోం క్వారంటైన్‌కు పరిమితమైనట్లు తెలిపారు. ఇక కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్త ఉండాలన్నారు. అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు త్వరలో అందరితో పంచుకుంటానని ఆమె తెలిపారు. (తెలుగు పాఠాలు)
Comments
Please login to add a commentAdd a comment