హీరోతో ప్రేమలో అర్జున్‌ సర్జా కూతురు.. త్వరలోనే నిశ్చితార్థం! | Arjun Sarja Daughter Aishwarya Getting Ready To Tie The Knot with This Hero | Sakshi
Sakshi News home page

Aishwarya Arjun: ప్రముఖ నటుడి తనయుడితో ప్రేమలో మునిగి తేలుతున్న హీరోయిన్‌.. యాక్షన్‌ కింగ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

Published Tue, Oct 24 2023 6:55 PM | Last Updated on Wed, Oct 25 2023 8:55 AM

Arjun Sarja Daughter Aishwarya Getting Ready To Tie The Knot with This Hero - Sakshi

అర్జున్‌ సర్జా.. సౌత్‌ ఇండస్ట్రీలో అనేక భాషల్లో నటించి యాక్షన్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఏళ్లపాటు హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఈయనకు డైరెక్షన్‌లోనూ అనుభవం ఉంది. అర్జున్‌ సర్జాకు ఇద్దరు కూతుర్లు. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన హిట్‌ మాత్రం తన ఖాతాలో పడలేదు.

కూతురి కోసం నటుడి విశ్వ ప్రయత్నాలు
కూతురి కోసం అర్జున్‌ డైరెక్టర్‌గా మారి సొల్లితరవా సినిమా తీశాడు. ఇది కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. దీంతో మరోసారి తన కూతురిని హీరోయిన్‌గా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్నడ స్టార్‌ ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటిస్తోంది. ఇకపోతే ఐశ్వర్య చాలాకాలంగా ప్రముఖ నటుడి తనయుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. లెజెండరీ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతితో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది.

ఉమాపతి కూడా హీరోయే!
వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారని, త్వలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి! ఇకపోతే ఉమాపతి కూడా కోలీవుడ్‌లో హీరోగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్‌ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. 

చదవండి: నన్ను చూసి ఈమె హీరోయినేంటి? అని ఓ లుక్కిచ్చారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement