
కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్నదే నిజమైంది. ఆ హీరోహీరోయిన్ ఒకటయ్యారు. పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)
ఎవరా జోడీ?
కర్ణాటకకు చెందిన అర్జున్ సర్జా.. సొంత భాషలో కంటే తెలుగు, తమిళంలోనే బాగా పాపులర్ అయ్యాడు. జెంటిల్‌మేన్, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రీసెంట్‌గా 'లియో'లో హరోల్డ్ దాస్ అనే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇతడి కూతురు ఐశ్వర్య అర్జున్.. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. ఈమె నిశ్చితార్థమే ఇప్పుడు జరిగింది.
తమిళంలో కామెడీ తరహా పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కొడుకు ఉమాపతి.. హీరోగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇతడితోనే అర్జున్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్ జరిగింది. చెన్నైలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబరులోనే పెళ్లి కూడా ఉండొచ్చని అంటున్నారు. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ 'మ్యాడ్' సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
Comments
Please login to add a commentAdd a comment