సౌత్‌తోపాటు నార్త్ మొత్తం అన్ని భాషల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో 38 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు నటుడు అర్జున్ సార్జా. ఆయన తనయ ఐశ్వర్య అర్జున్ ఐదేళ్ల క్రితమే సినిమాల్లోకి అడుగుపెట్టినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. దీంతో ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే హాట్ టాపిక్ ‘కాస్టింగ్ కౌచ్’ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ స్పందించారు.
‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే. ప్రతీ ఫీల్డ్‌లోనూ అది ఉంది. ఇండస్ట్రీపై చాలా మందికి చెడు అభిప్రాయం ఉండొచ్చు. కానీ, మంచి చెడుల ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడూ ఎవరూ అడ్డుకోరు. చెడు రూట్‌లో వెళ్తే అది వాళ్ల దురదృష్టం. ఏదో జరుగుతుందని నా కూతురిని సినిమాల్లోకి రానీయకుండా నేను అడ్డుకోవాలా? అలాగైతే మిగతా వాళ్ల సంగతి ఏంటి? వాళ్లూ వాళ్ల కూతుళ్లను రానిస్తున్నారు కదా. స్టార్లు కూడా అందుకు మినహాయింపు కాదు. నేను ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా ఉన్నా. అలాంటప్పుడు అన్నీ తెలిసి నేనెందుకు భయపడాలి. నా కూతురిని నేనెందుకు అడ్డుకోవాలి’ అని యాక్షన్ కింగ్ కుండబద్ధలు కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment