బిగ్‌బాస్‌ షోలో లవ్‌, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు! Bigg Boss Kannada fame Chandan Shetty and Niveditha Gowda have filed for mutual divorce at a Bengaluru court. Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల బంధానికి స్వస్తి.. బిగ్‌బాస్‌ జంట విడాకులు!

Published Fri, Jun 7 2024 6:02 PM | Last Updated on Fri, Jun 21 2024 2:01 PM

Niveditha Gowda Chandan Shetty Going to Divorce?

బిగ్‌బాస్‌ షోలో చూపించే లవ్‌ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదంటూ కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ చందన్‌ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. హనీమూన్‌కు నెదర్లాండ్‌కు వెళ్లి వచ్చారు.

ట్విస్ట్‌ ఇచ్చిన జంట
సోషల్‌ మీడియాలోనూ తరచూ జంటగా ఉన్న పిక్స్‌ షేర్‌ చేస్తూ ఉండేవారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలకాలకం కలిసుంటారనుకున్న అభిమానులకు వీరు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారట! బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేశారని ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఇంతవరకు చందన్‌, నివేదిత గౌడ స్పందించనేలేదు.

బిగ్‌బాస్‌ షోలో..
కాగా చందన్‌ శెట్టి రైల్వే చిల్డ్రన్‌, జోష్‌లే, పొగరు, చూ మంతర్‌ వంటి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సొంతంగా పాటలు కూడా వదిలేవాడు. కన్నడ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో విజేతగా నిలిచాడు. ఇదే సీజన్‌లో నివేదిత కూడా పార్టిసిపేట్‌ చేసింది. మొదట ఫ్రెండ్సయిన వీరు తర్వాత రిలేషన్‌లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్‌ సినిమా ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement