సాక్షి, హైదరాబాద్: చందన్ సహాని (220 బంతుల్లో 283; 33 ఫోర్లు, 15 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు విక్రమ్ నాయక్ (351 బంతుల్లో 185; 21 ఫోర్లు) భారీ శతకం బాదడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎంపీ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవర్‌గ్రీన్ జట్టు 123 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ కోల్ట్స్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొహుల్ భూమిక్ (50; 11 ఫోర్లు), వైష్ణవ్ రెడ్డి (56; 11 ఫోర్లు), మొహమ్మద్ అసదుద్దీన్ (49; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రస్తుతం నిఖిలేశ్ సురేంద్రన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు), అభినవ్ తేజ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఎవర్‌గ్రీన్ బౌలర్లలో సుఖైన్ జైన్ 2 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 391/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఎవర్‌గ్రీన్ జట్టు చందన్ చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. 155 పరుగులతో రెండో రోజు మైదానంలోకి వచ్చిన చందన్ బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజు అతను 12 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 128 పరుగులు చేయడం విశేషం. అతనికి మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విక్రమ్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 441 బంతుల్లో 430 పరుగులు జోడించారు. అనంతరం చందన్, విక్రమ్, ప్రణీత్ రెడ్డి (0), శ్యామ్ (6) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో రిత్విక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: ఎస్‌సీఆర్‌సీఏ: 364 (ఎమ్. సురేశ్ 57, బి. సుధాకర్ 38; సాకేత్ సాయిరామ్ 6/117), జై హనుమాన్: 119/6 (రోహిత్ రాయుడు 30, ఎస్‌కే ఖమ్రుద్దీన్ 3/15).
ఇన్‌కంట్యాక్స్: 556 (షాదాబ్ తుంబి 188, విదాత్ 3/92, భగత్ వర్మ 3/137), దయానంద్ సీసీ: 228/6 (అన్షుల్ లాల్ 100, చైతన్య కృష్ణ 104).
బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 232; (సంతోష్ గౌడ్ 31 బ్యాటింగ్), ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 320 (రొనాల్డ్ రాయ్ రోడ్రిగ్స్ 92, టి. రవితేజ 60, నీరజ్ బిష్త్ 36; గన్ను సధన్ 5/114, తేజోధర్ 3/64); బీడీఎల్ రెండో ఇన్నింగ్స్: 98/4.
ఎస్‌బీఐ: 342, ఈఎంసీసీ: 244 (మిఖిల్ జైస్వాల్ 39, షేక్ సోహైల్ 83, అంకిత్ అగర్వాల్ 30, అజయ్ దేవ్ గౌడ్ 37 నాటౌట్; అశ్విన్ యాదవ్ 5/34, ఆకాశ్ భండారి 3/82).
గ్రూప్ బి: ఏఓసీ: 436 (ఇర్ఫాన్ ఖాన్ 31, ఆశిష్ 5/111); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 116 (రాహుల్ చహర్ 4/24); ఏఓసీ రెండో ఇన్నింగ్స్: 75/4.
ఎన్స్‌కాన్స్: 393 (అస్కారి 104, అజహరుద్దీన్ 32), కాంటినెంటల్ సీసీ: 139/3 (అనిరుధ్ సింగ్ 67 బ్యాటింగ్).
జెమిని ఫ్రెండ్స్: 429 ( కౌషిక్ యాదవ్ 118, రచనేశ్ యాదవ్ 88, మల్లికార్జున్ 4/74, మీర్ ఒమర్ ఖాన్ 3/113), ఇండియా సిమెంట్స్: 115/8 (రోహాన్ 30).
Comments
Please login to add a commentAdd a comment