division league
-
చందన్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: చందన్ సహాని (220 బంతుల్లో 283; 33 ఫోర్లు, 15 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు విక్రమ్ నాయక్ (351 బంతుల్లో 185; 21 ఫోర్లు) భారీ శతకం బాదడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎంపీ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవర్గ్రీన్ జట్టు 123 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ కోల్ట్స్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొహుల్ భూమిక్ (50; 11 ఫోర్లు), వైష్ణవ్ రెడ్డి (56; 11 ఫోర్లు), మొహమ్మద్ అసదుద్దీన్ (49; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రస్తుతం నిఖిలేశ్ సురేంద్రన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు), అభినవ్ తేజ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఎవర్గ్రీన్ బౌలర్లలో సుఖైన్ జైన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 391/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఎవర్గ్రీన్ జట్టు చందన్ చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. 155 పరుగులతో రెండో రోజు మైదానంలోకి వచ్చిన చందన్ బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజు అతను 12 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 128 పరుగులు చేయడం విశేషం. అతనికి మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విక్రమ్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 441 బంతుల్లో 430 పరుగులు జోడించారు. అనంతరం చందన్, విక్రమ్, ప్రణీత్ రెడ్డి (0), శ్యామ్ (6) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో రిత్విక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ఎస్సీఆర్సీఏ: 364 (ఎమ్. సురేశ్ 57, బి. సుధాకర్ 38; సాకేత్ సాయిరామ్ 6/117), జై హనుమాన్: 119/6 (రోహిత్ రాయుడు 30, ఎస్కే ఖమ్రుద్దీన్ 3/15). ఇన్‌కంట్యాక్స్: 556 (షాదాబ్ తుంబి 188, విదాత్ 3/92, భగత్ వర్మ 3/137), దయానంద్ సీసీ: 228/6 (అన్షుల్ లాల్ 100, చైతన్య కృష్ణ 104). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 232; (సంతోష్ గౌడ్ 31 బ్యాటింగ్), ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 320 (రొనాల్డ్ రాయ్ రోడ్రిగ్స్ 92, టి. రవితేజ 60, నీరజ్ బిష్త్ 36; గన్ను సధన్ 5/114, తేజోధర్ 3/64); బీడీఎల్ రెండో ఇన్నింగ్స్: 98/4. ఎస్బీఐ: 342, ఈఎంసీసీ: 244 (మిఖిల్ జైస్వాల్ 39, షేక్ సోహైల్ 83, అంకిత్ అగర్వాల్ 30, అజయ్ దేవ్ గౌడ్ 37 నాటౌట్; అశ్విన్ యాదవ్ 5/34, ఆకాశ్ భండారి 3/82). గ్రూప్ బి: ఏఓసీ: 436 (ఇర్ఫాన్ ఖాన్ 31, ఆశిష్ 5/111); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 116 (రాహుల్ చహర్ 4/24); ఏఓసీ రెండో ఇన్నింగ్స్: 75/4. ఎన్స్‌కాన్స్: 393 (అస్కారి 104, అజహరుద్దీన్ 32), కాంటినెంటల్ సీసీ: 139/3 (అనిరుధ్ సింగ్ 67 బ్యాటింగ్). జెమిని ఫ్రెండ్స్: 429 ( కౌషిక్ యాదవ్ 118, రచనేశ్ యాదవ్ 88, మల్లికార్జున్ 4/74, మీర్ ఒమర్ ఖాన్ 3/113), ఇండియా సిమెంట్స్: 115/8 (రోహాన్ 30). -
ఎస్‌బీహెచ్‌కు ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: అహ్మద్ ఖాద్రీ (5/31), ఆకాశ్ భండారి (4/24) విజృంభించడంతో ఎస్బీహెచ్ జట్టు ఇన్నింగ్స్ 180 పరుగుల తేడాతో హైదరాబాద్ బాట్లింగ్పై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలిరోజు ఆటలో బాట్లింగ్ తొలి ఇన్నింగ్సలో 110 పరుగులకే కుప్పకూలింది. ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్సలో 7 వికెట్లకు 357 పరుగులు చేసింది. అహ్మద్ ఖాద్రీ 33, పవన్ కుమార్ 34 పరుగులు చేశారు. షేక్ సలీమ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఎస్‌బీహెచ్‌కు 247 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. గురువారం రెండో రోజు ఆటలో బాట్లింగ్ రెండో ఇన్నింగ్సలో 67 పరుగులకే కు ప్పకూలింది. జయరామ్ రెడ్డి (32) మినహా ఇం కెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స: 204, ఎన్సకాన్స తొలి ఇన్నింగ్స్: 195, ఆంధ్రాబ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 191, ఎన్సకాన్స్ రెండో ఇన్నింగ్స్: 118 (అరుణ్ దేవా 59; కనిష్క్ నాయుడు 4/64, అమోల్ షిండే 3/33); ఆంధ్రాబ్యాంక్ గెలుపు. రెండో రోజు ఆటలో... ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స్: 467 (వంశీవర్ధన్ రెడ్డి 177; తేజ 4/89, సాకేత్ సారుురామ్ 3/134), జై హనుమాన్ తొలి ఇన్నింగ్స: 141/6 (రోహిత్ రాయుడు 31; హిమాన్షు జోషి 4/60). స్పోర్టింగ్ తొలి ఇన్నింగ్స్: 143/9 డిక్లేర్డ్, చార్మినార్ సీసీ తొలి ఇన్నింగ్స: 317/10 (శుభం శర్మ 77, అనికేత్ రెడ్డి 77, మొహమ్మద్ 46), స్పోర్టింగ్ రెండో ఇన్నింగ్స:73/7 (సిరాజ్ 4/22). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 375 (మిలింద్ 123, రవితేజ 60; శ్రీచరణ్ 6/126), ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స: 190/4 (లోహిత్ 65, శ్రీకాంత్ 60; మిలింద్ 3/44). -
అశ్వద్ రాజీవ్ 9/48
అయినా సీకే బ్లూస్‌కు తప్పని ఓటమి ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: అశ్వద్ రాజీవ్ (9/48) సంచలన బౌలింగ్‌తో రాణించినప్పటికీ... అతని జట్టు సీకే బ్లూస్ బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం చవిచూసింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ 69 పరుగుల తేడాతో సీకే బ్లూస్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ ప్యాట్రిక్స్ 246 పరుగుల వద్ద ఆలౌటైంది. సాయి వినయ్ (51), రోహిత్ యాదవ్ (44), సాహిల్ కృష్ణ (39) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సీకే బ్లూస్ 177 పరుగులకే ఆలౌటైంది. బాలకృష్ణ (51) అర్ధసెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. రోహిత్ 6, సుమిత్ 2 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆల్ సెయింట్స్: 319/8 (సాత్విక్ రెడ్డి 168, సయ్యద్ తమీమ్ 73; నీరజ్ కుమార్ 2/60, దేవేందర్ అగర్వాల్ 2/ 37); జై సింహా: 315/9 (ప్రమోద్ మహాజన్ 93, నీరజ్ 68, సాయి తేజ 52; ముజ్తజా 3/92, సాత్విక్ రెడ్డి 3/75). గ్రీన్లాండ్స్: 269/5 (సుధీంద్ర 109, పృథ్వీ రాజ్ 57, అనుజ్ యాదవ్ 51; గోపి 2/ 49); హైదరాబాద్ పాంథర్స్: 145 (ఆలౌట్) (విఘ్నేశ్ పటేల్ 26; నిఖిల్ 5/25, పృథ్వీరాజ్ 3/32). సెయింట్ ప్యాట్రిక్స్: 246 (ఆలౌట్) (సాయి వినయ్ 51, రోహిత్ యాదవ్ 44; రాజీవ్ 9/48); సీకే బ్లూస్: 177 (ఆలౌట్) (బాలకృష్ణ 57 నాటౌట్, సుశాంత్ 30; రోహిత్ యాదవ్ 6/41, సుమిత్ 2/44). వాకర్ టౌన్: 151 (ఆలౌట్) (చంటి 36, ప్రశాంత్ 29 నాటౌట్; మదన్ క్షీరసాగర్ 5/36, పవన్ వర్మ 3/49); హైదరాబాద్ పేట్రియాట్స్: 152/5 (మహేశ్ 62, విజయ్ 30; ఆశిష్ 2/23). ఎస్‌యూసీసీ: 251/9 (చరణ్ తేజ 120, యశ్వంత్ 38; ప్రభాజన్ 4/62); యునెటైడ్: 82/10 (అభయ్ స్వరూప్ 3/29). లాల్‌బహదూర్ పీజీ: 50 ( సాయి కార్తీక్ 6/5); మణికుమార్: 51/1. స్వస్తిక్ యూనియన్: 307 (అగ్రజ్ 50, వినోద్ కుమార్ 38,విజయ్ 100; ఫహీముద్దీన్ 3/52, లఖన్ 3/10); నోబెల్ సీసీ: 178 ( వినాయక్ 50, శంషుద్దీన్ 57; విజయ్ కుమర్ 5/46). టైమ్ సీసీ: 184 (సుమంత్ 44, బాబర్ 38); సత్యం కోల్ట్స్: 82 (చేతన్ 3/19, బాబర్ 5/10).