సాక్షి, హైదరాబాద్: అహ్మద్ ఖాద్రీ (5/31), ఆకాశ్ భండారి (4/24) విజృంభించడంతో ఎస్‌బీహెచ్ జట్టు ఇన్నింగ్స్ 180 పరుగుల తేడాతో హైదరాబాద్ బాట్లింగ్‌పై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలిరోజు ఆటలో బాట్లింగ్ తొలి ఇన్నింగ్‌సలో 110 పరుగులకే కుప్పకూలింది. ఎస్‌బీహెచ్ తొలి ఇన్నింగ్‌సలో 7 వికెట్లకు 357 పరుగులు చేసింది.
అహ్మద్ ఖాద్రీ 33, పవన్ కుమార్ 34 పరుగులు చేశారు. షేక్ సలీమ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఎస్‌బీహెచ్‌కు 247 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. గురువారం రెండో రోజు ఆటలో బాట్లింగ్ రెండో ఇన్నింగ్‌సలో 67 పరుగులకే కు ప్పకూలింది. జయరామ్ రెడ్డి (32) మినహా ఇం కెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్‌స: 204, ఎన్‌సకాన్‌స తొలి ఇన్నింగ్స్: 195, ఆంధ్రాబ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 191, ఎన్‌సకాన్స్ రెండో ఇన్నింగ్స్: 118 (అరుణ్ దేవా 59; కనిష్క్ నాయుడు 4/64, అమోల్ షిండే 3/33); ఆంధ్రాబ్యాంక్ గెలుపు.
రెండో రోజు ఆటలో...
ఇన్‌కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స్: 467 (వంశీవర్ధన్ రెడ్డి 177; తేజ 4/89, సాకేత్ సారుురామ్ 3/134), జై హనుమాన్ తొలి ఇన్నింగ్‌స: 141/6 (రోహిత్ రాయుడు 31; హిమాన్షు జోషి 4/60).
స్పోర్టింగ్ తొలి ఇన్నింగ్స్: 143/9 డిక్లేర్డ్, చార్మినార్ సీసీ తొలి ఇన్నింగ్‌స: 317/10 (శుభం శర్మ 77, అనికేత్ రెడ్డి 77, మొహమ్మద్ 46), స్పోర్టింగ్ రెండో ఇన్నింగ్‌స:73/7 (సిరాజ్ 4/22).
డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 375 (మిలింద్ 123, రవితేజ 60; శ్రీచరణ్ 6/126), ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్‌స: 190/4 (లోహిత్ 65, శ్రీకాంత్ 60; మిలింద్ 3/44).
ఎస్‌బీహెచ్‌కు ఇన్నింగ్స్ విజయం
Published Fri, Sep 9 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement
Advertisement