
సీరియల్ బ్యూటీ నివేదిత పంకజ్ రెండో పెళ్లి చేసుకుంది. బుల్లితెర నటుడు సురేందర్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడింది. 'కలకాలం నీ వెంటే ఉంటాను, ఎల్లప్పుడూ నీ చేయి వదలను, ఐ లవ్ యూ..' అంటూ సురేందర్ మరోసారి తన ప్రేమను వ్యక్తం చేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబైన నివేదిత పెళ్లి మండపైనే ఏడ్చేసింది. చెన్నైలో శుక్రవారం (ఫిబ్రవరి 23న) ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు.. ఈ కొత్త దంపతులు కలకాలం పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో నివేదిత నటుడు ఎస్‌ఎస్ ఆర్యన్‌ను పెళ్లాడింది. కానీ వీరి బంధం ఎంతోకాలం నిలవలేదు.
కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆర్యన్ బుల్లితెర నటి శ్రీతిక సనీష్‌ను పెళ్లి చేసుకున్నాడు. నివేదితక కూడా ఆ బాధలో నుంచి బయటకు వచ్చి కొత్త తోడును వెతుక్కుంది. సురేందర్‌ను పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
చదవండి: అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టం.. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో..
Comments
Please login to add a commentAdd a comment