హేయ్.. హాయ్.. అయామ్ విల్.. | hey.. hai.. iam will.. | Sakshi
Sakshi News home page

హేయ్.. హాయ్.. అయామ్ విల్..

Published Wed, Dec 31 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

హేయ్.. హాయ్.. అయామ్ విల్..

హేయ్.. హాయ్.. అయామ్ విల్..

నయా సాల్.. నయా జోష్.. నయా హోప్స్
Do not seek to follow in the footsteps of the men of old.. seek what they sought.. అన్న జపాన్ కవి బషో మాటను పాటించాలనుకుంటోంది ఈతరం!. తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటోంది. ఆ సృజనకు 2015ను వేదికగా మలచుకుంటోంది. ప్రియాంక, నివేదిత, సూర్య, వీళ్ల రంగాలు వేరు. ఆశయాలు కొత్తవి. సాధించాలన్న తపన మెండు.. అదే స్ఫూర్తితో వాళ్ల వాళ్ల రంగాల్లో ‘హేయ్. హాయ్, ఐయామ్ విల్’ అంటూ నయాసాల్‌లో యువోత్సాహంతో ముందుకు సాగుతున్న వారి ‘న్యూ’ స్టోరీస్ ఇవి..
 - సరస్వతి రమ/ కళ
 
హేయ్..
ప్రియాంక ఏలె. కళా ప్రపంచంలో సుపరిచితమైన పేరు! తండ్రి లక్ష్మణ్ ఏలె నుంచి వారసత్వంగా అబ్బిన చిత్రకళకు తన రంగులద్దే ప్రయత్నం చేస్తున్న యువ కళాకారిణి. ఈ నెల 3న ‘జ్ఛిడ. జిజీ, జ్చీఝ ఠీజీ’ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో షో ప్రారంభించనున్నారు. పెర్ఫార్మెన్స్, వీడియో ఇన్‌స్టలేషన్, చిత్రాలు.. ఇదీ ‘హేయ్.. హాయ్.. ఐయామ్ విల్’ సంపూర్ణ రూపం!. మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రీదాకాలే తనకు స్ఫూర్తి అని చెప్పే ప్రియాంక.. చిత్రకారిణిగా తన ప్రయాణాన్ని రెండు రకాలుగా విభజిస్తారు. ‘అన్వేషి’ వాళ్ల ‘విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా’ పుస్తకం చదవడానికి ముందు, చదివిన తర్వాత అని!. పుస్తకం చదివాకే స్త్రీ సమస్యలపై ఫోకస్ స్టార్ట్ చేశారు ప్రియాంక.
 
హాయ్..
సాధారణంగా ఏ షోకైనా ఒక పదంతోనే శీర్షిక ఉంటుంది. కానీ ప్రియాంక ‘హేయ్.. హాయ్.. ఐయామ్ విల్’.. అంటూ మూడు పదాలతో శీర్షిక పెట్టి తన ప్రత్యేకతను చూపించాలనుకున్నారు. పేరుతోనే ఆ తరాన్ని, ఈ తరాన్ని షోకి దగ్గర చేయాలని ఆమె ఉద్దేశం. స్త్రీ, ప్రకృతి.. పురుషుడు.. ఈ షో కాన్సెప్ట్! నిజానికి ఈ షోలో తన పెయింటింగ్స్ కన్నా వీడియో ఇన్‌స్టలేషన్, పెర్ఫార్మెన్స్‌కే ప్రాధాన్యమివ్వాలనుకుంటున్నారామె. ఇక డ్రాయింగ్స్.. అవి వాటంతటవే మాట్లాడుతాయి.

ద్వాపరయుగంలోని ద్రౌపది నుంచి కలియుగంలోని నిర్భయ వరకు.. ఆయా కాలాలకు చెందిన అయిదుగురు మహిళలు.. వాళ్లను సమాజం చూసిన తీరును గీతల్లో.. కదిలే బొమ్మల్లో.. కదలని బొమ్మల్లో (మెనిక్వీన్) ఒకేసారి ప్రదర్శించనున్నారు. పెర్ఫార్మెన్స్.. ఒక్కో క్యారెక్టర్ తనను పరిచయం చేసుకునే వాయిస్‌ఓవర్‌తో మొదలవుతుంది. కుంచెతో గీసిన చిత్రాల్లో ప్రకృతి.. కదిలే బొమ్మల్లో స్త్రీ..కదలని బొమ్మతో సమాజం వైఖరి.. ‘హేయ్, హాయ్, ఐయామ్ విల్’లో ఆర్ట్ లవర్స్‌ను ఆకట్టుకోనున్నాయి!.
 
అయామ్ విల్..
ఆర్ట్ షో విత్ పెర్ఫార్మెన్స్ అనేది కచ్చితంగా హైదరాబాద్‌కు కొత్తే. బయటి దేశాల్లో ఆర్టిస్టులు చాలా బోల్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తారు. మన దగ్గర ఇంకా ఆ కల్చర్ లేదు. హైదరాబాద్‌లాంటి చోటైతే మరీ కష్టం. మెనిక్వీన్‌తో పెర్ఫార్మెన్స్ చేస్తానంటే క్యురేటర్స్ కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. నిస్సందేహంగా ఇదో సాహసమే.

ఇకపై నా ప్రతి షోలోనూ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్‌లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. కూచిపూడి, భరతనాట్యం, గిటార్, వయోలిన్ నేర్చుకున్నాను. మోడలింగ్ చేసేదాన్ని. ఈ ఎక్స్‌పీరియన్సే ఇప్పుడీ షోలో పెర్ఫార్మెన్స్‌కి ఉత్సాహాన్నిస్తోంది. నా ఈ ఆలోచనకి ప్రోత్సాహమిచ్చి నన్ను ముందుకు నడిపిస్తోంది మాత్రం నాన్నే. ఆర్టిస్ట్‌గా నేను డిఫరెంట్ పాత్‌ని ఏర్పరచుకోవాలనే నా తపనకూ ఆయనే స్ఫూర్తి!.
- ప్రియాంక ఏలె
 
హేయ్..
రెడ్ ఎఫ్‌ఎం ఆర్‌జే సూర్య... సిటీలో వన్ ఆఫ్ ద యంగ్ ఆర్‌జే. వీకెండ్స్‌లో సండే-ఫండేతో ఏడాదిగా అలరిస్తున్న సూర్య ఈ మధ్యే వీజేగా మారాడు. తన ఆర్జేయింగ్‌కు మిమిక్రీ జోడించి వారం వారం నవ్వించే సూర్య న్యూ ఇయర్‌తో తన పంథాలో కొత్త మార్పులు చేయనున్నాడు.
 
హాయ్..
తనకొచ్చిన మిమిక్రీతో చిన్నా చితకా షోలు చేస్తూ.. వచ్చిన డబ్బులతో చదువుసాగించాడు. ఆంధ్రా యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్‌లో మిమిక్రీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అనుకోకుండా రెడ్ ఎఫ్‌ఎం ఆడిషన్స్‌లో పాల్గొని తన గళంతో మెప్పించాడు.  రేడియోలో ఎలా మాట్లాడుతారో తెలియని ఇతగాడు తనకొచ్చిన మిమిక్రీకి స్పాంటేనిటీ మిక్స్ చేసి సక్సెస్ కొట్టాడు. కామ్‌గా ఎంకామ్ చదువుకుంటూనే ఆర్జేగా అదరగొడుతున్నాడు.
 
అయామ్ విల్..
ఈ తరం అనుకున్నది సాధించగలదు. అయితే వాళ్ల ముందున్న అవకాశాలను, టెక్నాలజీని.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసిన రీతిలో వాళ్లకు చెప్తాను. ఇంత వరకూ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేసిన నా షోస్ ద్వారా, ఇలాంటి మెసేజ్ నా ఫన్ స్టైల్‌లోనే అందించాలనుకుంటున్నాను. అలాగే ఈ ఏడాది, ఆర్‌జే, వీజేయింగ్‌తో పాటు ఆడియో లాంచ్‌లు, ఈవెంట్స్ ద్వారా కూడా వీలైనంత ఎక్కువగా ఎంటర్‌టైన్ చెయ్యాలనుకుంటున్నాను. యాక్టర్ కావాలనే నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నా.
- సూర్య
 
 
 హేయ్..
 నివేదిత.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి ఉన్న రీడింగ్ హాబీ ఆమెకో కొత్త ఐడియానిచ్చింది. దాంతో ఆమె జీవితమే మారిపోయింది. క్యాంపస్ సెలక్షన్‌లో వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకొని రాయిటర్స్‌లో జర్నలిస్ట్‌గా చేరి తర్వాత పబ్లిషర్ అయ్యారు.
 
హాయ్
ఈ నెల 10, 11 తేదీల్లో రెండురోజుల రైటర్స్ కార్నివాల్ నిర్వహించబోతున్నారు నివేదిత. దీనికి హైదారబాద్‌లోని రసన, జ్యోత్స్న ఫనాజి లాంటి రచయితలే కాక ముంబై నుంచి రొషల్ పోత్కర్‌లాంటి పదిమంది ప్రముఖ రచయితలు హాజరవుతున్నారు. రచనా వ్యాసంగంలోని అన్ని అంశాలపై ఇందులో చర్చ ఉంటుంది. చిల్డ్రన్ ఆథర్స్, చిల్డ్రన్ కోసం ఒకరోజు కేటాయించారు.
 
అయామ్ విల్

‘లుంబినీ పార్క్‌లో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు నేను నా స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాను. బేసిగ్గా హైదరాబాద్ లవర్‌ని. నేనెంతగానో ప్రేమించే హైదరాబాద్‌కైన ఆ గాయం చూశాక చాలా కలత చెందాను. చదివే అలవాటు, ఆ గాయం.. నేను బ్లాగ్ రాసేలా ప్రేరేపించాయి. అందుకే ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ఉద్యోగాన్నీ కాదనుకున్నాను. మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ డిప్లమా చేసి రాయటర్స్‌లో చేరాను.

అమ్మ ప్రోత్సాహంతో పబ్లిషర్‌నయ్యాను. డాలర్ నా డ్రీమ్ కాదు.. నేనుంటున్న ప్రదేశం గొప్పదనాన్ని చాటడమే నా ఎయిమ్. ఏ ప్రాంతానికైనా ఆ ప్రాంతం లిటరేచర్ కన్నా గొప్ప సంపద ఇంకేమీ ఉండదు. అందుకే పబ్లిష్ చేస్తున్నాను. చిన్నపిల్లల సాహిత్యం, చిల్డ్రన్ ఆథర్స్, ఇప్పటి వరకు వెలుగులోకి రాని రైటర్స్‌కి ఒక డయాస్ ఇవ్వడమే మా నివాసిని పబ్లిషర్స్ లక్ష్యం.
- నివేదిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement