
‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలవుతుంది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) సినిమాలోని ‘గోల్డెన్ స్పారో...’ పాట. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.
ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
‘గోల్డెన్ స్పారో... నా గుండెలో యారో... నువ్వు లేని లైఫు ఫుల్ శారో..,’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో పవీశ్, అనిఖాలతో పాటు హీరోయిన్ ప్రియాంకా మోహనన్(Priyanka Mohan) డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అశ్విన్ సత్య–సుదీష్ శశికుమార్–సుభాషిణి ఆలపించారు. ఈ సిని మాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment