ర‌ష్మిక మంద‌న్న‌కు షాకిచ్చిన ఆ హిరోయిన్ | Priyanka Arul Replaced Rashmikamandanna in Surya Movie | Sakshi
Sakshi News home page

ర‌ష్మిక మంద‌న్న‌కు షాకిచ్చిన ఆ హిరోయిన్

Published Thu, Jan 21 2021 3:19 PM | Last Updated on Thu, Jan 21 2021 5:04 PM

Priyanka Arul Replaced Rashmikamandanna in Surya Movie - Sakshi

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్న‌కు ఓ అప్‌క‌మింగ్ హీరోయిన్ పెద్ద షాకే ఇచ్చింది. ఇంత‌కీ ర‌ష్మిక మంద‌న్న‌కు అంత‌పెద్ద షాకిచ్చిన హీరోయిన్ ఎవ‌రు? అని అనుకుంటున్నారా!. తను ఎవరో కాదండి నాని హీరోగా న‌టించిన గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన‌ ‌ప్రియాంక అరుల్ మోహ‌న్. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ శ‌ర్వానంద్ శ్రీకారం సినిమాలో నటిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒకరైన సూర్యకు అటు తమిళ పరిశ్రమతో పాటుగా ఇటు తెలుగులోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు.(చదవండి: డ్రగ్స్‌ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్)

'ఆకాశం నీ హద్దురా' తర్వాత దర్శకుడు పాండిరాజ్‌తో కలిసి సూర్య నటించబోయే సినిమాలో ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా ర‌ష్మిక మంద‌న్నను అనుకున్నప్పటికీ భారీ రెమ్యున‌రేష‌న్ కార‌ణంగా ర‌ష్మికను తీసుకోవడానికి నిర్మాత‌లు వెనుక‌డుగు వేశారు. దింతో ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ మోహ‌న్‌ను తీసుకున్నార‌ట. దీనిలో డీ ఇమ్మాన్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ప్రస్తుతం సూర్య ఓటీటీలో విడుద‌లైన ‘ఆకాశం నీ హద్దురా’ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement