అవును... హౌస్‌ వైఫ్‌నే! | rakshasi movie set to release next month | Sakshi
Sakshi News home page

అవును... హౌస్‌ వైఫ్‌నే!

Published Mon, May 29 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

అవును... హౌస్‌ వైఫ్‌నే!

అవును... హౌస్‌ వైఫ్‌నే!

హారర్‌ థ్రిల్లర్స్‌ ‘అవును, అవును–2’లతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక పూర్ణ. ఆమె లీడ్‌ రోల్‌ చేసిన తాజా హారర్‌ ఫిల్మ్‌ ‘రాక్షసి’. పన్నా రాయల్‌ దర్శకత్వంలో అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్, టోనీ జన్ను నిర్మించిన ఈ సినిమాలో సీనియర్‌ నటి గీతాంజలి, అభిమన్యు సింగ్, అభినవ్‌ సర్దార్‌ ముఖ్యతారలు.

యాజమాన్య స్వరపరిచిన పాటల సీడీలను హీరో శ్రీకాంత్‌ విడుదల చేసి, తొలి సీడీని రాజకీయ నాయకుడు తులసిరెడ్డికి అందజేశారు. ‘‘కామెడీ, సస్పెన్స్, ఎమోషన్స్, హారర్‌... అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. ‘అవును’లో హౌస్‌ వైఫ్‌గా నటించిన నేను, ఇందులోనూ హౌస్‌ వైఫ్‌ క్యారెక్టర్‌ చేశా. మరి, రాక్షసి ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌’’ అన్నారు పూర్ణ. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement