
అవును! మళ్లీ వచ్చాడు...!
ఆ ఇద్దరికీ అప్పుడే పెళ్లయ్యింది. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తుం టారు. కానీ ఇంతలో ఓ అలజడి. భర్త ఊరెళ్లగానే ఒంటరిగా ఉన్న ఆమెపై రూపం లేని ఓ మనిషి దాడి చేస్తుంటాడు. చిత్రహింసలు పెడుతుంటాడు. ఆ మనిషితో పోరాడింది. చివరకు ఆ బెడద వదిలిందనుకునే లోపే మళ్లీ ఆ వ్యక్తి వచ్చాడు. అప్పుడేం జరిగిందన్నది తెలియాలంటే ‘అవును 2’ చిత్రం చూడాలంటున్నారు దర్శక, నిర్మాతలు. పూర్ణ, హర్షవర్ధన్ రాణే జంటగా సురేశ్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవిబాబు దర్శకుడు.
ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన డి. సురేశ్ బాబు తమ ఈ తాజా ప్రయత్నం గురించి మాట్లాడుతూ-‘‘గతంలో మేము నిర్మించిన ‘అవును’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సీక్వెల్ అంతకు మించి బాగుంటుంది. ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సంగీతం: శేఖర్ చంద్ర.