Ravibabu
-
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
-
మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు పూర్తి
-
సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మెచ్చుకున్నారు. గిరిజనులపై సీఎం వైఎస్ జగన్‌కి ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఏపీ ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించేందుకు పార్లమెంట్ సమావేశాల తర్వాత ఏపీకి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించగా.. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని కేంద్ర మంత్రి అర్జున్ ముండా చెప్పారని రవిబాబు మీడియాతో చెప్పారు. ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని, గిరిజన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, గిరిజన ఆరోగ్యం, విద్య, నిరుద్యోగ నిర్మూలన వంటి కార్యక్రమాలను రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,31,420 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసిందని, గిరిజన ఉప ప్రణాళిక కింద 2020–21కి రూ.5,177 కోట్లు కేటాయించిందని, విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పాడేరులో వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాల, ప్రతి ఐటీడీఏ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర సంస్థలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి వివరించినట్టు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, పునరావాస చర్యలనూ కేంద్ర మంత్రికి వివరించినట్లు రవిబాబు వెల్లడించారు. -
నన్ను కొట్టాడు సార్... !.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు
జూలూరుపాడు: ‘ఆడుకుంటుం టే నన్ను అనవసరంగా కొట్టా డు సార్’అంటూ ఓపదేళ్ల బాలు డు ధైర్యంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లోని న్యూకాలనీకి చెందిన కాశిమళ్ల రవిబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన 14ఏళ్ల కుర్రాడు అతని తలపై కొట్టాడు. దీంతో రవిబాబు ఏడుస్తూ నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో తానే నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చానని బాలుడు తెలిపాడు. అనంతరం హోంగార్డును పంపించి బాలుడిని కొట్టిన కుర్రాడికి సర్దిచెప్పారు. (చదవండి: చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే ఉద్యోగం కాదా? ) -
అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్‌కో డీఈ రవిబాబు అవినీతి బాగోతం
-
అదుగో సినిమా ట్రైలర్ రిలీజ్
-
దసరాకి అదుగో
రవిబాబు నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో ఓ పందిపిల్ల కీలక పాత్రలో నటించడం విశేషం. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్లో రవిబాబు నిర్మించిన ఈ సినిమా దసరాకి రానుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘కుటుంబ ప్రేక్షకులు, పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తి స్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపించబోతున్నాం. అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ కాన్సెప్ట్ కావడంతో అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నాం. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా మిగిలిన భాషల్లో ‘బంటి’ పేరుతో విడుదలవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా సెలవుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. అభిషేక్ వర్మ, నభా, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: పశ్రాంత్ ఆర్. విహార్, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి. -
‘అదుగో’ రిలీజ్ అవుతోంది!
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను రూపొందిస్తున్నారు రవిబాబు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు ఫైనల్‌గా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. -
రవిబాబు పందిపిల్లతో ఫిట్నెస్
-
అదుగో : పందిపిల్లతో ఫిట్నెస్ చాలెంజ్
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు, పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతోంది. అయితే సినిమా మీద ఆసక్తి కొనసాగించేందుకు రవిబాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూలో నిల్చోని అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా మరోసారి అదే తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫిట్నెస్ చాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సందర్భాన్ని తన సినిమా ప్రచారానికి వినియోగించుకున్న రవిబాబు. బంటీ(పందిపిల్ల)తో కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. పందిపిల్లను వీపుపై ఎక్కించుకుని పుల్అప్స్ చేశారు. ‘ బంటి ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయగలుగుతోందని, మరి మీరు ఎందుకు చేయర’ని ప్రశ్నించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఒప్పందానికి తలొగ్గలేదని..కేసులు.. రౌడీషీట్లు
సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు..కానీ ఏకంగా సివిల్ తాగాదాలే సృష్టించడం..కేసులు పెట్టించడం..ఆనక చర్చల పేరుతో బెదిరింపులకు,ఒత్తిళ్లకు పాల్పడటం.. వినకపోతే రౌడీషీట్లుతెరవడం.. జైలు పాల్జేయడం..ఇదీ ఆ పోలీసు అధికారి స్టైల్.. ఇటువంటి దందాలతో కోట్లు దండుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య..ఆ అధికారి మరెవరో కాదు.. రాష్ట్రవ్యాప్తంగాసంచలనం సృష్టించిన రౌడీషీటర్ గేదెలరాజుహత్య కేసులో ఏ1 నిందితుడిగా జైలుపాలైనఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబు!..మధురవాడ, గాజువాకల్లో ఏసీపీగా పని చేస్తున్నసమయంలో ఆయన చేసిన సెటిల్మెంట్లు, దందాలు.. ఆయన అరెస్టు అనంతరం వెలుగులోకి వస్తున్నాయి.మధురవాడ పరిధి రేవళ్లపాలేనికి చెందినపిళ్లా కుటుంబీకులను ఓ సివిల్ వివాదంలోరౌడీషీట్లతో వేధింపులకు గురిచేసిన రవిబాబు దురాగతం వెలుగులోకి వచ్చింది. వారసత్వహక్కుగా వారికి సంక్రమించిన రూ.4.5 కోట్ల విలువైన భూమిని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పగించేందుకు ఒప్పందం చేసుకొని పిళ్లా కుటుంబీకులపై ఆయన పోలీస్ పవర్ ప్రయోగించారు. సాక్షి, విశాఖపట్నం: మధురవాడ శివారు రేవళ్లపాలెం గ్రామానికి చెందిన పిళ్లా అప్పారావుకు అదే గ్రామ పరిధిలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలోని సర్వే నెం.211/1,2లలో 23.5 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ విలువ గజం రూ.40 వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి విలువ నాలుగున్నర కోట్ల పైమాటే. అప్పారావు తదనంతరం ఆ భూమి ఆయన సంతానమైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజు, శ్రీనివాసరావు, రమేష్, భారతిలకు వారసత్వ హక్కుగా సంక్రమిచింది. వీరిలో శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య వెంకటలక్ష్మికు హక్కు లభించింది. అప్పారావు భూమిని ఆనుకొని నాగోతి అప్పలసూరి అనే వ్యక్తికి 24 సెంట్ల భూమి ఉండేది. దాన్ని ఎప్పుడో ఆయన వేరొకరికి అమ్మేశాడు. అయితే అదే గ్రామానికి అతని వారసుడిగా చెప్పుకొంటున్న నాగోతి లక్ష్మణరావు అనే వ్యక్తి విజయవాడకు చెందిన నాగోతి మొగ్గయ్య సత్యనారాయణ, చలపతిరావు, తొత్తడి కనకలక్ష్మిలతో కలిసి ఈ భూమిని దస్తావేజు నెం.5053/2007తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా రిజిస్ట్రీ చేయించుకున్నట్టు రికార్డులు సృష్టించారు. పనిలో పనిగా అదే సర్వే నెంబరులో ఉన్న పిళ్లా కుటుంబీకుల భూమిని కాజేయాలనుకున్నారు. ఆ భూమి వారసుల్లో ఒకడైన పిళ్లా రమేష్‌ను లోబర్చుకొని తప్పుడు దృవపత్రాలతో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నెం.609/2009తో జనరల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ పత్రాల ఆధారంతో ఆ భూమిని హైదరాబాద్‌కు చెందిన ఎస్పి సాప్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన సాగిరెడ్డి పుల్లారెడ్డి పేరిట అమ్మేసి దస్తావేజు నెం.716/2011గా రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. పిళ్లా కుటుంబీకుల అభ్యంతరం : ఆ భూమిని సొంతం చేసుకున్న సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు.. వెంటనే రంగంలోకి దిగారు. భూమిలో ఉన్న షెడ్లను తొలగించి చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. అప్పుటికి గానీ పిళ్లా వారసులకు విషయం తెలియలేదు. తమ ప్రమేయం లేకుండా తమ సోదరుడు రమేష్ ఉమ్మడి ఆస్తిని అమ్మేసినట్లు గుర్తించారు. తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆస్తిని ఎలా కొనుగోలు చేస్తారని నిలయదీయడంతో వీరితో ఇబ్బంది తప్పదని గుర్తించిన సాప్ట్వేర్ కంపెనీ యజమాని ఆ భూమిని తనకు అమ్మిన వ్యక్తులను ఆశ్రయించారు. పిళ్లా వారసులతో కూడా హక్కు విడుదల పత్రాలపై సంతకాలు చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పట్లో మధురవాడ ఏసీపీగా పని చేస్తున్న దాసరి రవిబాబుకు ఈ వివాదం గురించి తెలిసింది. రవిబాబు రంగప్రవేశం : వెంటనే రంగంలోకి దిగిన రవిబాబు వివాదాన్ని సెటిల్ చేస్తానని సాప్ట్వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి పీఎంపాలెం సీఐ అప్పలరాజు, ఎస్సై దివాకర్లపై ఒత్తిడి తెచ్చి.. పిళ్లా వారసులపై వేధింపులు ప్రారంభించాడు. అంతేకాకుండా ఏసీపీ తరఫున దళారులుగా వ్యవహరించిన పట్నాయక్, శ్రీనులు కూడా రెచ్చిపోయారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్లలో ఒకరైన కాటుపల్లి అప్పారావుతో పీఎంపాలెంలో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసులు బనాయించారు. పిళ్లా వారసులైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజుల ఇళ్లకు చీటికిమాటికి వెళ్లి బెదిరించడం.. స్టేషన్‌కు పిలిపించి చితకబాదడం చేసేవారు. అయినా సరే సంతకాలు పెట్టేందుకు వారు అంగీకరించలేదు. లొంగకపోవడంతో కొత్త స్కెచ్ : వారసులు లొంగకపోవడం.. సాప్ట్వేర్ కంపెనీ నుంచి ఒత్తిడి పెరగడంతో రవిబాబు మరో స్కెచ్ వేశాడు. నాగోతి లక్ష్మణరావు చేయించుకున్న మొదటి రిజిస్ట్రేషన్ (దస్తావేజు. 5053 / 2007)ను 2015 ఏప్రిల్ 9న రద్దు చేయించి, మళ్లీ అదే వ్యక్తులతో విశాఖకు చెందిన కొల్లి కృష్ణచౌదరికి దస్తావేజు నెం.2487/ 2015తో జనరల్ పవర్ రిజిస్ట్రీ చేయించాడు. ఆయన ద్వారా సాప్ట్వేర్ కంపెనీకి కట్టబెట్టాలన్నది ఆయన ప్లాన్. ఈ దస్తావేజులో కనీసం సాక్షులుగానైనా సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. చివరికి భర్తలేని పిళ్లా వెంకటలక్ష్మిపై మూడు కేసులు బనాయించి జైలు పాల్జేశారు. పోతిన భారతిపై రెండు, పిళ్లా హిమాలయపై మూడు కేసులు నమోదు చేశారు. అయినా వారు బెదరలేదు. తన మాట చెల్లలేదన్న అక్కసుతో హిమాలయ, కనకరాజులపై రవిబాబు ఏకంగా రౌడీషీట్ తెరిచాడు. బదిలీ అయినా ఆగని వేధింపులు : రవిబాబు బదిలీ అయిన తర్వాత కూడా వీరిపై వేధింపులు ఆగలేదు. తన అనుచరులైన పట్నాయక్, శ్రీనుల ద్వారా రవిబాబు వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రహరీ నిర్మించిన సాప్ట్వేర్ కంపెనీ కానీ, ఆ తర్వాత రవిబాబు ప్రోద్భలంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొల్లి కృష్ణచౌదరి గానీ ఏనాడు ఈ స్థలంలో అడుగు పెట్టలేదు. కానీ పట్నాయక్ మాత్రం ఈ స్థలంలోకి చొరబడి ఏకంగా తన పేరిట విద్యుత్ మీటర్ కూడా వేయించేసేకున్నాడు. స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా మామూళ్లు ముట్టజెప్పి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ క నెక్షన్ వేయించుకున్నాడు. ఎప్పటికైనా ఈ స్థలం తమదేనన్న భావనతో తరచూ వీర్ని వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. హత్య కేసులో రవి బాబు అరెస్ట్ కావడంతో ఇప్పటికైనా తమకు విముక్తి క ల్పించాలని, తమ భూమి తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించాం హక్కు విడుదల పత్రాలపై సంతకాలు పెట్టలేదన్న అక్కసుతో నాపైన, నా సోదరుడిపైన రౌడీషీట్ తెరిచారు. చిత్రహింసలకు గురి చేశారు. ఎన్నోసార్లు రవిబాబే నేరుగా మమ్మల్ని పిలిపించి వార్నింగ్‌లు ఇచ్చేవారు. సంతకాలు చేయకపోతే అంతు చూస్తానని బెదిరించేవారు. దాంతో ఏసీపీ, సీఐ, ఎస్సైలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు కూడా చేశాం.– పిళ్లా హిమాలయ నిద్రలేని రాత్రులెన్నో గడిపాం కోట్ల విలువైన మా స్థలాన్ని కొట్టేయాలని రవిబాబు యత్నించాడు. సాప్ట్వేర్ కంపెనీ నుంచి రూ.కోటి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఎలాగైనా కాజేసి సాప్ట్వేర్ కంపెనీకి కాకపోతే మరో కంపెనీకి అమ్మేయాలని ప్రయత్నించాడు. ఆ ఒత్తిళ్లతో నిద్రలేని రాత్రులెన్నో గడిపాం. నిత్యం మానసిక క్షోభకు గురవుతున్నాం. – పిళ్లా కనకరాజు -
పీఎస్‌లో ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ లొంగుబాటు
-
ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ లొంగుబాటు
సాక్షి, విశాఖ : రౌడీ షీటర్ గేదెల రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ రవిబాబు ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అనంతరం ఆయనను విశాఖ తరలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరిగిన గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నారు. అయితే గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసును పక్కదోవ పట్టించేందుకు రవిబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి. అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, గేదెల రాజు భార్య కుమారి వివిధ పత్రికల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు ఊతమిస్తున్నాయి. కాకర పద్మలత హత్యకు గురైందని, గేదెల రాజు సహకారంతో డీఎస్పీ రవిబాబు చేయించాడని పోలీసులు ప్రకటించిన సంగతి విదితమే. అందులో తనకు రావాల్సిన సుపారీ కోసం రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు డీఎస్పీ రవిబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తనకు తెలిసిన న్యాయవాదుల నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
కవిత్వానికి సామాజిక ప్రయోజనం ముఖ్యం
విజయవాడ కల్చరల్ : కవిత్వానికి సామాజిక ప్రయోజనం ముఖ్యమని ప్రజాసాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు పేర్కొన్నారు. మల్లెతీగ, ఆం్ర«ధ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తాధ్వర్యంలో స్థానిక శిఖామణి సెంటర్లోని చండ్రరాజేశ్వరరావు గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం ఎరుకలపూడి గోపీనాధరావు రచించిన వచన కవిత జాగృతి, పద్యసంపుటి, నానీల పుస్తకం నానీల వాణి పుస్తకాలను ఆవిష్కరించారు. రవిబాబు మాట్లాడుతూ గోపీనాధరావు కవిత్వం సామాజిక సృహకలిగివుంటుందని అన్నారు. తెలుగు అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ, కవిగా గోపీనాథ రావు పూర్తిగా సఫలం అయ్యారని, ఎంచుకున్న అంశాలలో ఏమాత్రం రాజీపడలేదని వివరించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్. స.శ్రీ, సీహెచ్ బృందావనరావు, డాక్టర్ కె.ఎస్.రామారావు, కోటజ్యోతి ప్రసంగించారు. మల్లెతీగ సాహిత్యవేదిక అధ్యక్షుడు కలిమిశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. -
వెళ్ళాలని తను.. వద్దని నేను!
►చిత్రం: ‘తను - నేను’ ►తారాగణం: సంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు ►కథ - స్క్రీన్‌ప్లే - మాటలు:సాయి సుకుమార్, పి. రామ్మోహన్ ►ఆర్ట్: ఎస్. రవీందర్ ►ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్ ►సంగీతం: సన్నీ ఎం.ఆర్ ►సమర్పణ: డి. సురేశ్‌బాబు ►నిర్మాత - దర్శకుడు: పి. రామ్మోహన్ కథ చెబుతూ... కళ్ళకు కట్టించడం వేరు. కళ్ళెదుట తెరపై చూపిస్తూ, మెప్పించడం వేరు. మొదటిది రచన, కథన సామర్థ్యాలకు గీటురాయి అయితే, రెండోది తెరపై కథాకథనమనే దర్శకత్వ నైపుణ్యానికి పరీక్ష. గతంలో ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘ఉయ్యాల - జంపాల’ లాంటి విభిన్న తరహా ప్రయత్నాలను తెర పైకి తేవడంలో పేరు తెచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు పి. రామ్మోహన్ ఈసారి దర్శకుడిగా కొత్త అవతారమెత్తారు. అమెరికా డబ్బు మీద మోజు, ఆ జీవితం మీద వ్యామోహం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో ఒక రొమాంటిక్ కామెడీ అల్లారు. కథేమిటంటే... హైదరాబాద్‌లో ‘ఈస్ట్ వెస్ట్’ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ కాల్సెంటర్లో పనిచేస్తుంటాడు కిరణ్ (సంతోష్ శోభన్). పెంచిన నాయనమ్మ చనిపోతే, ఆమె ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడు. అతనికి నరేశ్ (అభిషేక్ మహర్షి) వగైరా మంచి ఫ్రెండ్స్. బెంగుళూరులో ఉంటున్న నరేశ్ ఫ్రెండ్ కీర్తి (అవికా గోర్) ఒకసారి హైదరాబాద్ వస్తుంది. ఆమెను చూసీ చూడగానే హీరో ప్రేమిస్తాడు. కొన్ని సీన్ల తరువాత ఆమె కూడా అతని ప్రేమలో పడుతుంది. కీర్తి కుటుంబానిదో కథ. తండ్రి బండిరెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు)కు అమెరికా పిచ్చి. కొడుకు, కూతురైనా బాగా చదివి, అమెరికా వెళ్ళి, డబ్బు సంపాదిస్తే, తాను పెద్ద ఇల్లు, కారు కొనుక్కోవాలనుకొనే తరహా. కొడుకేమో లవ్ మ్యారేజ్ చేసుకొని, చెక్కేస్తాడు. తండ్రి కోరికకు కట్టుబడి, ఎనిమిదో ఏటే దేవుడి మీద ఒట్టేసి మరీ ఒప్పుకున్న కూతురు కీర్తి. అమెరికా వెళ్ళాలన్నది ఆమె ధ్యేయం. హీరో అందుకు పూర్తిగా విరుద్ధం. అమెరికా అన్నా, అక్కడ సెటిలైన ఎన్నారైలన్నా కడుపు మంట. ఛస్తే అక్కడికి పోనంటాడు. అక్కడికి ‘బ్రేక్’ (అప్). సెకండాఫ్‌కి వస్తే, హీరోకూ, అమెరికా అంటే అతనికున్న అసహ్యానికీ ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్. ఏడాది వయసున్న హీరోను వదిలేసి, అతని అమ్మా నాన్న డబ్బు సంపాదన వేటలో అమెరికా వెళ్ళిపోతారు. గత 20 ఏళ్ళలో మూడే మూడుసార్లు ఇండియా వచ్చి, చూసిపోతారు. నాయనమ్మ దగ్గరే పెరిగిన హీరోకు, ఆమె చనిపోయినా రాని నాన్న అంటే సహజంగానే అసహ్యం. అందుకే, ఎవరూ లేరన్నట్లు పెరుగుతుంటాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ అమెరికా వెళ్ళడం మానేసి అయినా, హీరోనే పెళ్ళాడాలనుకుంటుంది. కానీ, వాళ్ళ పెళ్ళికి హీరోయిన్ తండ్రి అడ్డంకి అవుతాడు. అప్పుడు హీరో ఏం కోరుకున్నాడు? ఏమైంది? వినోదం నిండిన ఈ ప్రేమకథ సంతోష్ శోభన్‌కు హీరోగా తొలి సినిమా. ఆ అనుభవ రాహిత్యమేదీ కనిపించనివ్వలేదీ కొత్త కుర్రాడు. అవికా గోర్ కెరీర్ జాబితా లెక్క ఈ సినిమాతో మరో అంకె పెరిగింది. పురుషాధిక్య భావజాలం, బద్ధకం నిండిన శాడిస్టు బండిరెడ్డి సర్వేశ్వరరావు పాత్రలో హీరోయిన్ తండ్రిగా రవిబాబు ఉన్న కాసేపు హాలులో కొత్త ఉత్సాహం తెస్తారు. ఇక, హీరోయిన్ తల్లి పాత్రలో సత్యా కృష్ణన్‌ది మొగుడి ప్రవర్తనను సదా మనసులోనే తిట్టుకొనే మహిళ పాత్ర. అందుకే, భర్త చనిపోయాక ఆమెలో విషాదఛాయలేమీ లేకపోవడం సహజమనుకోవాలి. అభిషేక్ మహర్షి వినోదం పంచుతారు. ఇప్పటి వరకు నిర్మాతగా ఉన్న పి. రామ్మోహన్‌కు దర్శకుడవడంతో వంట చేయించుకొనే బాధ్యత నుంచి చేసే బాధ్యతకు మారినట్లయింది. దాని వల్ల వచ్చే పాజిటివ్‌లు, నెగటివ్‌లు కూడా సహజమే. ఆ శైలి చూస్తే - నగేశ్ కుకునూర్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల తొలినాళ్ళు, స్వతంత్ర సినీ రూపకర్తల సినిమాలు గుర్తుకొస్తాయి. అందుకే, దీన్ని పూర్తి కమర్షియల్ సినిమాగా చూడలేం. సాంకేతిక విభాగాల తీరూ అందుకు తగ్గట్లే ఉన్నాయి. సెపరేట్ కామెడీ, స్పెషల్ ఐటమ్ సాంగ్‌లు లేని ఈ ప్రేమకథలో తీసుకున్న పాయింట్ చిన్నది. 130 నిమిషాల సినిమాగా మజ్జిగ పల్చ నైంది. వరస చూస్తే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదని ఈ దర్శక, నిర్మాతల అభిప్రాయమేమో అనిపిస్తుంది. వేగంగా పరుగులు తీయకున్నా, ఫస్టాఫ్ బాగుందనిపించేలా నడిపారు. హీరో ఫ్లాష్‌బ్యాక్ కథ బయటికొచ్చి, కథలో కీలక పాయింట్ తెలిసిన తరువాత పరిస్థితి మారింది. ఒక్కముక్కలో- ఈ కథ సంసారపక్షం. కథనమే కాదు, నిర్మాణమూ అంతే. రొమాంటిక్ కామెడీలు చూసేవారి కిది ఓ.కె. అంతకు మించి అదనంగా ఏదైనా కోరుకుంటేనే చిక్కు! ►ఈ స్క్రిప్ట్ రామానాయుడు ఫిల్మ్‌స్కూల్ సాయిసుకుమార్ రాసింది. ► కేవలం 33 షూటింగ్ డేస్. ►హైదరాబాద్ పరిసరాల్లో, వికారాబాద్‌లో షూటింగ్. సెకండాఫ్‌లోని డ్యూయట్ పుణే దగ్గర లోనావాలా పరిసరాల్లో తీశారు. ► హీరో సంతోష్ శోభన్ ‘వర్షం’ చిత్ర దర్శకుడైన శోభన్ కుమారుడు. గతంలో ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో క్రికెట్ టీవ్ు కెప్టెన్ పాత్ర పోషించారు. ఇప్పుడు హీరోగా పరిచయం. - రెంటాల జయదేవ్ -
అవును! మళ్లీ వచ్చాడు...!
ఆ ఇద్దరికీ అప్పుడే పెళ్లయ్యింది. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తుం టారు. కానీ ఇంతలో ఓ అలజడి. భర్త ఊరెళ్లగానే ఒంటరిగా ఉన్న ఆమెపై రూపం లేని ఓ మనిషి దాడి చేస్తుంటాడు. చిత్రహింసలు పెడుతుంటాడు. ఆ మనిషితో పోరాడింది. చివరకు ఆ బెడద వదిలిందనుకునే లోపే మళ్లీ ఆ వ్యక్తి వచ్చాడు. అప్పుడేం జరిగిందన్నది తెలియాలంటే ‘అవును 2’ చిత్రం చూడాలంటున్నారు దర్శక, నిర్మాతలు. పూర్ణ, హర్షవర్ధన్ రాణే జంటగా సురేశ్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవిబాబు దర్శకుడు. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన డి. సురేశ్ బాబు తమ ఈ తాజా ప్రయత్నం గురించి మాట్లాడుతూ-‘‘గతంలో మేము నిర్మించిన ‘అవును’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సీక్వెల్ అంతకు మించి బాగుంటుంది. ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సంగీతం: శేఖర్ చంద్ర. -
సైకిల్‌కు మోగిన రెబెల్స్
టీడీపీకితిరుగుబాటు బెడద యలమంచిలి, పాడేరు,అరకులోయల్లో రగిలిపోతున్న శ్రేణులు బుజ్జగించినా మాట వినని సుందరపు రవిబాబుకు హ్యాండిచ్చిన చంద్రబాబు సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో సైకిల్‌కు చిక్కుముళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీని ధిక్కరించి రెబల్స్ మోగిస్తున్న గంటలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఊహించి నట్టుగానే యలమంచిలి,పాడేరు, అరకులోయల్లో రెబల్ అభ్యర్థులు పార్టీని ధిక్కరించి బరిలో నిలబడి సవాల్ విసిరారు. యలమంచిలిలో పంచకర్లకు టికెట్ ఇవ్వడంతో అలిగిన సుందరపు విజయ్ కుమార్ రెబల్‌గా నామినేషన్ వేశారు. రెండురోజుల ముందు తనకు అన్యాయం జరిగిందని ఆమరణ దీక్ష ప్రకటించిన సుందరపును గురువారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో బుజ్జగించారు. దీంతో సుందరపు దారికివచ్చినట్టేనని చంకలుగుద్దుకున్నారు. ఆయన మాత్రం బాబు బుజ్జగింపులను బేఖాతరుచేస్తూ శనివారం నామినేషన్ వేసి అసలు అభ్యర్థి పంచకర్లకు గొంతులో పచ్చివెలక్కాయపడేలా చేశారు. పాడేరు సీటును బీజేపీకి ఇచ్చి తమ గొంతుకోశారనే ఆగ్రహంతో ఉన్న ఆశావహ నేతలు రెబల్స్‌గా బరిలో నిలిచారు. మొన్నటికి మొన్న ప్రసాద్, నేడు కొట్టగుల్లి సుబ్బారావు రెబల్స్‌గా నామినేషన్ వేశారు. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అరకు టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుకు టీడీపీ చివరి నిమిషంలో హ్యేండ్ ఇచ్చింది. నామినేషన్లకు ఆఖరి రోజయిన శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రవిబాబు మూడు రోజుల క్రితం ఇచ్చిన పార్టీ బి-ఫారంతో నామినేషన్ వేశారు. అదే సమయంలో అరకు ఎమ్మెల్యే సివేరి సోమ మరో బి-ఫారంతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న రవిబాబుతోపాటు అతని వర్గీయులతో అవాక్కయ్యారు. ఆఖర్లో ఇలా అధినేత వెన్నుపోటు పొడవడాన్ని అక్కడి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈమేరకు రవిబాబు రెబల్‌గా మరో నామినేషన్ వేశారు. మరోపక్క టిక్కెట్లు దక్కని మాజీమంత్రి మణికుమారి అరకు పార్లమెంట్‌కు, గాజువాక నుంచి కోనతాతారావు రెబల్స్‌గా నామినేషన్ వేయడానికి పత్రాలు సిద్ధం చేశారు. కాని ఇంతలో పార్టీ ముఖ్యనేత నారాయణ వీరిని ఫోన్లో బుజ్జగించారు. పార్టీ పరువు బజారుకీడ్చొద్దని తాయిలాల ఎరవేశారు. దీంతోవీరు నామినేషన్ వేయకుండా ఉండిపోయారు. -
తొలియత్నం: అనుకున్నవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి!
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా బలమైంది సంకల్పం. ఒకసారి ఇది నేను చేయాలి, చేయగలను అనుకున్నప్పుడు దాని ముందు నిలబడటానికి ఇంకేదీ సాహసించదు. సంకల్పం ముందు శిఖరమంత సమస్యైనా చిన్నబోతుంది. నడుస్తున్న దారిలో ముళ్లు తొలిగి పూలు పరుచుకుంటాయి. ఆకాశంలో ఎండ తీక్షణత తగ్గి మేఘాలు ముసురుకుంటాయి. అలిసిపోయినప్పుడు నక్షత్రాలు నేలకొరిగి ముచ్చట్లాడతాయి. అందుకే మనిషికో కల ఉండాలి. అది సాధించాలన్న సంకల్పం ఉండాలి. అలా దర్శకుడవ్వాలనుకున్న ఒక యువకుడు, తన కలను రగిలించి వెండితెరపై పరిచిన తొలి రవి కిరణాల వెలుగే ఈ వారం తొలియత్నం... అతడి మాటల్లోనే... యాడ్ ఫిలింస్ సక్సెస్ అయిన తరువాత ఒకడుగు ముందుకు వేయాలనుకున్నాను. సినిమా దర్శకుడవ్వాలన్న నా కల నిజం చేసుకోవడానికి అదే సరైన సమయం అనిపించింది. ముందుగా ఒక కథ తయారుచేసుకుని, అది కొంతమంది ప్రొడ్యూజర్లకు వినిపించాను. వాళ్లు కొన్ని నెలల పాటు నన్ను వెయిటింగ్లో పెట్టారు. దానికి ఒక కాలేజ్ సెట్, పెద్ద బడ్జెట్ అవసరమవుతుంది. దాని పేరు అల్లరి.స్క్రిప్ట్ పట్టుకుని తిరిగితే పనికాదని అర్థమైంది. నేనే సొంతంగా తీయాలని ఒక చిన్నకథ కోసం ఆలోచన చేశాను. చిన్నప్పటినుంచి చూసిన హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్తో ఒక టీనేజ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ రాసుకున్నాను. ముందు కథ టైటిల్ తీసి దీనికి పెట్టాను. అలా అల్లరి మొదలైంది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి, ఆర్టిస్టులను కొత్తవాళ్లను తీసుకోవాలనుకున్నాం. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకు నరేష్ సరిపోతాడనిపించింది. తను నాకు ముందు నుంచే పరిచయం. అయితే, తనకు అప్పటికి హీరో కావాలన్న ఆలోచన లేదు. నేను అడగ్గానే తను చాలా సర్ప్రైజ్ అయ్యాడు. హీరోయిన్స్‌ను మోడల్ కో-ఆర్డినేటర్ల ద్వారా సెలక్ట్ చేసుకున్నాం. ఇందులో మా నాన్నకు పెయిర్‌గా ఉండే ఆర్టిస్ట్ కోసం కొంచెం ఇబ్బందిపడ్డాను. ఆ ఆర్టిస్టు క్యారెక్టర్ నల్లగా, కొంచెం భారీగా, కళ్లు ఎర్రగా ఉండాలని డిజైన్ చేసుకున్నాను. మరుసటిరోజు షూటింగ్ స్టార్ట్ చేయాలి. కానీ, ఎంత వెదికినా ఆర్టిస్ట్ దొరకలేదు. అంతలో మా నాన్నగారు రేపు కాకినాడ నుంచి ఒక స్టేజీ ఆర్టిస్ట్ వస్తుంది, చూడు అన్నారు. ఆ దేవుడి మీద భారం వేసి, తనకోసం చూస్తుండగా ఆటోలో దిగింది. ఆశ్చర్యం. నేను ఆ క్యారెక్టర్‌కు ఎలాంటి మనిషి కావాలనుకున్నానో తనే నా ఎదురుగా వచ్చి నిలుచున్నట్టుంది. అంతకుముందు రాత్రి ప్రయాణం వల్ల జుట్టు చెదిరి, ఎర్రటి కళ్లతో నాముందుకు వచ్చింది. వెంటనే డ్రెస్ మార్చి, కెమెరా ముందు నిలబెట్టాం. షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నీ మాయలా జరిగిపోయాయి. అనుకున్నదే తడవుగా షూట్ టైమ్‌కు వాటంతటవే అమరిపోయేవి. నా రాజీపడని తత్వానికి కావలసినవన్నీ సమకూరడం అదృష్టమే అనుకుంటా. హీరోయిన్ రూమ్‌లో ఒక మ్యాక్ కంప్యూటర్ ఉండాలి. కొనాలంటే, ఆ రోజు ఆదివారం. షెడ్యూల్‌ప్రకారం షూట్ జరగాలి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. కానీ, అక్కడ దొరకలేదు. నిరాశగా వెనుదిరగ్గానే బయట ఒక ఫ్రెండ్ కలిశాడు. ఏమిటిక్కడ అని అడిగాను. తను కొత్తగా మ్యాక్ కంప్యూటర్స్ డీలర్షిప్ తీసుకున్నానని చెప్పాడు. అదృష్టం అనుకుని, విషయం చెప్పా. తను వెంటనే ఒక సిస్టమ్ అరేంజ్ చేశాడు. మరోసారి ఒక వైట్ కార్డ్‌లెస్ ఫోన్ కావలసి వచ్చింది. ఆ రోజు ఆదివారం. ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు. రోడ్డుమీద కలిసిన ఒక ఫ్రెండ్ ఏంటంత టెన్షన్‌గా ఉన్నావని అడిగాడు. విషయం చెప్పగానే అతను హెల్ప్ చేశాడు. నేను కలర్స్ స్కీమ్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. హీరోయిన్ రూమ్‌లో మ్యాచింగ్ కలర్స్ కర్టెన్స్ కావాలి. కావల్సినవి దొరకడం లేదు. నెక్స్డే షూటింగ్. ఏం చేయాలి. అంతకుముందే మా ఫ్రెండ్ ఇంట్లో నేననుకున్న కర్టెన్స్ చూసినట్టు గుర్తు. వెంటనే పది గంటల రాత్రి వేళ స్క్రూడ్రైవర్ తీసుకుని వాళ్లింటికి బయలుదేరాను. నన్నలా చూసి మావాడు మొదట కొంచెం ఇబ్బందిపడ్డా, తనే నెమ్మదిగా ఊడదీసి ఇచ్చాడు. మళ్లీ షూటింగ్ అవగానే తీసుకెళ్లి అలాగే పెట్టేశాను. షూటింగ్ గొరిల్లా ఫిలిం మేకింగ్‌లా ఎక్కడ పడితే అక్కడ, ఎలా వీలైతే అలా చేసేశాం. ఒకరోజు పొద్దున్నే తొమ్మిదిన్నరకు ఖైరతాబాద్ జంక్షన్లో షూట్ చేయాల్సి వచ్చింది. నరేశ్ హీరోయిన్‌తో బైక్ మీద ఫ్లై ఓవర్ మీదుగా రాంగ్ రూట్లో రావాలి. అటు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ వచ్చే సమయం కూడా అదే. ఏమైనా సరే అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తిచేయాలి. అందుకోసం ఓ స్కెచ్ వేశాం. ట్రాఫిక్ రిలీజ్ అవగానే, నరేశ్ రాంగ్ రూట్లో వెళ్లాలి. ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న మా ఆర్టిస్ట్ వాళ్లకు అడ్డంగా వెళ్లి పట్టుకోవాలి. అప్పుడు మా వెహికిల్స్ వచ్చి కెమెరాను, ఆర్టిస్టులను తీసుకుని వెళ్లాలి. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అసలు అక్కడ ఉన్న నిజమైన పోలీసులకు కూడా మేం షూట్ చేసిన విషయం తెలియదు. అంతా గప్‌చుప్‌గా అయిదు నిమిషాల్లో జరిగిపోయింది. సినిమా చాలావరకు ఒక అపార్ట్మెంట్లోనే జరిగింది. మారేడ్‌పల్లిలో మాకు తెలిసినవాళ్ల అపార్ట్మెంట్లో షూటింగ్ చేశాం. పదిహేను రోజులకు కేవలం ఇరవై ఐదు వేలు తీసుకున్నారు. ఇప్పుడైతే అలా చేయలేమేమో! ఇక క్లైమాక్స్ ఒకే ఒక రోజులో షూట్ చేయాలనుకున్నాం. అందుకు కాచిగూడ రైల్వేస్టేషన్లో ఒక రైలు అద్దెకు తీసుకున్నాం. ఏమీ తినకుండా కేవలం జ్యూసులతోనే అందరం తెగ కష్టపడుతున్నాం. సాయంత్రం అయిదవగానే, రైల్వే అఫిషియల్ వచ్చి మీ టైమ్ అయిపోయింది, క్లోజ్ చేయండి అన్నాడు. ఒకే ఒక్క షాట్ బ్యాలన్స్ ఉంది అని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడికి వేరే ట్రైన్ వస్తుంది కాబట్టి, మరో ప్లాట్‌ఫామ్ మీద షూట్ చేసుకోమన్నారు. ఈ లొకేషన్‌ను, ఆ లొకేషన్‌ను ఎలా మ్యాచ్ చేయాలి అని ఆలోచనలో పడ్డాను. కెమెరా యాంగిల్స్ ద్వారా మేనేజ్ చేద్దాం అని నిర్ణయించుకునేలోపు భారీ వర్షం. ఏం చేయాలో అర్థం కాలేదు. పదిహేను నిమిషాల తరువాత వర్షం వెలిసి ఎండ వచ్చేసింది. హడావుడిగా షాట్ పూర్తిచేసేసి కారులో కూర్చోగానే, మళ్లీ వర్షం. ఇలా ఎన్నో అవాంతరాలు అధిగమించి, షూటింగ్ పూర్తిచేశాం. నా అన్ని సినిమాల్లో చాలా పద్ధతిగా జరిగిన సినిమా అల్లరి. సినిమా అంతా నా కంట్రోల్లోనే తీయగలిగాను. సినిమా స్కోప్ పాపులర్‌గా ఉన్న టైమ్‌లో బడ్జెట్ తగ్గించుకోవటానికి 35 ఎం.ఎం.లో తీయాలనుకున్నాను. మేం ఎనభై లక్షల బడ్జెట్లో సినిమా తీయాలనుకుంటే, ఎనభై నాలుగు లక్షలైంది. యాభై వేల అడుగుల్లో తీయాలనుకుంటే, యాభై వేల నాలుగు వందల అడుగుల్లో తీశాం. నలభై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తిచేయాలనుకుంటే, అలాగే జరిగింది. సినిమాటోగ్రాఫర్ నాతో పాటు యాడ్ ఫిలింస్‌లో చేశాడు కాబట్టి, నేననుకున్నట్టు ఎంటీవీ స్టైల్లో చాలా డిఫరెంట్ యాంగిల్స్‌లో తీయగలిగాం. మ్యూజిక్ డెరైక్టర్ కూడా మాతో యాడ్ ఫిలింస్‌కు పనిచేసినవాడే. అతను పదిహేను సెకన్లు, ముప్ఫై సెకన్ల ఫిలిమ్స్‌కు అలవాటుపడ్డాడు కాబట్టి, మన తరహా నాలుగైదు నిమిషాల పాటలకు, రీ-రికార్డింగ్‌కు కొంత ట్యూన్ చేయాల్సి వచ్చింది. ‘అల్లరి’ విడుదలైన తరువాత ప్రేమకథల్లో ఒక కల్ట్ ఫిలింగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత లవ్‌స్టోరీలు తీసే విధానం, చూసే విధానం కూడా మారింది. -కె.క్రాంతికుమార్‌రెడ్డి -
ఓ ఇంటివాడు కాబోతున్న టాలీవుడ్ సంగీత దర్శకుడు!
దర్శకుడు రవిబాబు చిత్రాలు నచ్చావులే, నువ్విలా, మనసారా, అనుసూయ, అమరావతి, అవును చిత్రాలకు సంగీతాన్ని అందించిన వర్ధమాన సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఓ ఇంటివాడు కాబోతున్నారు. నవంబర్ 28 తేదిన మాధురితో శేఖర చంద్ర వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 1 తేదిన ఎన్ కన్వెన్షన్ (డైమండ్) రిసెప్షన్ జరుగుతుందని శేఖర్ వెల్లడించారు. ప్రస్తుతం నిఖిల్, స్వాతి నటిస్తున్న 'కార్తీకేయ', 'వీకెండ్ లవ్', నీలకంఠ 'మాయ', సాయిరాం శంకర్ 'దిల్లున్నోడు' చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. -
అనగన గా... అలా జరిగింది
శ్రీరాజ్ బళ్లా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘అనగనగా’. ‘అలా జరిగింది’ అనేది ఉపశీర్షిక. ఎన్వీఎస్ అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి, శ్రీరాజ్ బళ్లా నిర్మాతలు. రవిబాబు, సాయిరాజ్, ప్రశాంతి, శ్రావణి ముఖ్య పాత్రధారులు. రవివర్మ బళ్ల స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన రేలంగి నరసింహారావు, ఆర్పీ పట్నాయక్, కొడాలి వెంకటేశ్వరరావు, అశోక్‌కుమార్‌లు యూనిట్‌కి శుభాకాంక్షలు అందించి, జ్ఞాపికలు అందజేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని శ్రీరాజ్ నమ్మకం వ్యక్తం చేశారు. -
దీపావళి... అన్నింటా సామాన్యుడే బలి
=తారాజువ్వల్లా పెరిగిన నిత్యావసర సరకుల ధరలు =వరద ముప్పుతో వెలగని మతాబుల్లా రైతులు =విభజన ‘చిచ్చు’బుడ్డికి అగ్గిరాజేసిన బాబు =సమైక్య ఉద్యమంలో సీమ టపాసుల్లా వైఎస్సార్సీపీ శ్రేణులు =కలియుగ నరకాసురులకు చరమగీతమెప్పుడో? మతాబుల వెలుగులతో... టపాసుల మోతలతో... దీపావళి నాటికి ఆనందోత్సాహాల్లో మునిగితేలాల్సిన జిల్లా ప్రజలు సమస్యల జడిలో ‘తడిసిన బాణసంచా’లా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సరకుల ధరలు చుక్కలనంటుతుంటే.. వర్షాలు పంటలను ముంచేస్తే.. విభజన ‘చిచ్చు’ ముల్లులా గుచ్చుకుంటుంటే.. భవిష్యత్తుపై బెంగతో అల్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో సామాన్య జనవాణి ఏవిధంగా ఉందో చూద్దామా.. టపాకాయల్లా పేలుతున్న ధరలు ‘దీపావళి పండుగొచ్చేస్తోంది నాన్నా టపాసులు కొను’ అంటూ రెండు రోజులుగా మారాం చేస్తున్న సుపుత్రుల గోల పడలేక చేతి సంచి తీసుకుని బజారుకు బయలుదేరాడు సూరిబాబు. వడివడిగా వెళుతున్న అతని వేగానికి అడ్డుకట్ట వేస్తూ ‘ఏమోయ్ సూరి ఎక్కడికి వెళుతున్నావ’ంటూ వెనుక నుంచి పలుకరించాడు రవిబాబు. ఏమీలేదు దీపావళి మందులను కొనేందుకు వెళుతున్నానంటూ బదులిచ్చాడు సూరిబాబు. అవును మా పిల్లలు కూడా ఒకటే గొడవ.. ఏం కొంటాం రా బాబూ.. దీపావళి టపాసులు కూడా కూరగాయాల ధరల్లాగ తారాజువ్వలను మించిపోయి పైపైకిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే ఇంకా 20 శాతం పైగా వాటి రేట్లు పెంచేశారాయే అంటూ రవిబాబు పెదవి విరిచాడు. మునుపటి రోజుల్లో దీపావళి వచ్చేసరికి పంట చేలు కళకళలాడుతుండేవి.. పల్లెలు, పట్నాలు సిరిసంపదలతో వెలుగుతుండేవి.. ఇప్పుడంతా సమస్యల చీకట్లే కదా అంటూ సూరిబాబు శృతి కలిపాడు. ఇంతలో వారికి తారసపడిన నాగబాబు మధ్యలో జోక్యం చేసుకుంటూ ‘ఏం చేస్తాం పాలకులు సైతం పట్టించుకోరు.. నిత్యావసర సరకుల ధరలు కూడా టపాసుల్లా పేలిపోతున్నాయి’ అన్నాడు. ‘ఇదివరకటి రోజుల్లో జేబుల్లో డబ్బులు తీసుకునిపోతే సంచుల నిండా సరకులు వచ్చేవి.. మరి ఇప్పుడో సంచుల నిండా సొమ్ము పట్టుకెళ్లినా సరకులు దోసిలి నిండట్లేదు అంతా కలికాలం’ అంటూ ముక్తాయించాడు రవిబాబు. బాబు లేఖతో విభజన బాంబు కాసేపటికి వారి సంభాషణ నిత్యావసర ధరలు, టపాసుల ధరల నుంచి సమైక్య ఉద్యమం వైపు మళ్లింది. అవునర్రా మన జిల్లాలో సమైక్య ఉద్యమం మతాబుల్లా వెలిగిపోయిందంటూ నాగబాబు చర్చను దారిమళ్లించాడు. అవునవును జిల్లాలో ఊరువాడా ఏకమై రాష్ట్రం ఒక్కటిగా ఉండాలంటూ సమైక్య ఉద్యమ కాంతుల్ని ప్రజ్వలింపజేశారు అంటూ నాగబాబు ప్రస్తావించాడు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర విభజనకు ‘చిచ్చు’బుడ్డి లాంటి ఫార్ములాను తయారుచేస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి అగ్గిపుల్ల గీసి నిప్పురాజేశాడు అంటూ సూరిబాబు ఆవేశం వెళ్లగక్కాడు. ఏమాటకు ఆ మాట అనుకోవాలి నిజానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ఆ పారీ శ్రేణులు సిసింద్రీల్లా చెలరేగి సమైక్య ఉద్యమానికి విష్ణుచక్రాన్ని అందించారని రవిబాబు గుర్తుచేశాడు. పంటపై తుపాను... పేలని టపాసుల్లా రైతులు ఏం దీపావళి కాంతులో ఏమిటో సమైక్య ఉద్యమంపైన, రైతన్న ఆశలపైన తుపానులు, వర్షాలు నీళ్లు చల్లేశాయి అంటూ నిట్టూర్చాడు నాగబాబు. దీపావళి రోజులు వస్తే పంటచేలు పసిడి కాంతులతో కళకళలాడేవి రైతుల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయేవి ఇప్పుడు వర్షాల వల్ల ఆరిపోయిన చిచ్చుబుడ్డిలా వెలవెలబోతున్నాయంటూ సూరిబాబు ఆవేదన వెలిబుచ్చాడు. విభజన నిర్ణయంతో ప్రజలకు ఇంత కష్టం వచ్చినా... వర్షాల వల్ల రైతులకు ఇంత నష్టం వచ్చినా పాలకులు మాత్రం అగ్గిరాజేసి ఆ మంటల్లో వేడుక చూస్తున్నారంటూ రవిబాబు రుసరుసలాడాడు. చూస్తాం చేస్తాం అంటూ ప్రకటనలు ఇస్తున్న జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం సిసింద్రీల్లా హడావుడి చేసి చివరికి చీదేస్తున్నారు.. అంటూ రవిబాబు ముక్తాయించాడు. అవునవును గత మూడేళ్లుగా తుపానులు, అకాల వర్షాలకు నష్టాపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.37 కోట్ల పరిహారం ఇంతవరకు పంపిణీ చేయలేదన్న సంగతి ‘సాక్షి’లో చదివానంటూ నాగబాబు శృతి కలిపాడు. సందట్లో సడేమియా... బాణసంచా షాపులోకి పోలీసులు వచ్చి దుకాణానికి అనుమతి లేదంటూ షాపు యజమానితో దబాయింపును చూసిన సూరిబాబు మరింత ఆసక్తి కనబరిచాడు. ఇంతలో గల్లాపెట్టిలోని థౌజండ్ వాలా నోటు ఇచ్చేసరికి అప్పటివరకు పెటేపికాయల్లా పేలిన పోలీసుల నోళ్లు టక్కున మూతపడ్డాయి. ఇంతలోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మీ షాపునకు అనుమతిలేదు నిన్ను మా ఆఫీసరు గారు రమ్మన్నారంటూ పిలిచారు.. వాళ్లను పక్కకు తీసుకెళ్లి చేతిలో ఫైవ్ హండ్రెడ్ వాలా నోటు పెడితే ‘రోడ్డుపైన కాకుండా కాస్త లోపలికి దుకాణం పెట్టుకో.. మా వాళ్లకు చెబుతాంలే’ అంటూ ఫైర్ సిబ్బంది చక్కా వెళ్లిపోయారు. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ఎవరికివారే వచ్చి అందినంత పుచ్చుకుని వెళ్లడం చూసిన సూరిబాబు వీళ్ల హడావుడి ఇందుకా అనుకుని మనసులోనే నవ్వుకుని ‘ఇదేంటి వీళ్లకు మామూళ్లు ఇవ్వాలా’ అంటూ షాపు యజమాని శ్రీనుని అమాయకంగా ప్రశ్నించాడు. ఏమనుకున్నావ్ బాబూ మొన్న ఒక్కో షాపునకు ఇంత మామూళ్లని రేటు పెట్టారు.. నిన్న ఏకంగా ఒక్కో డిపార్ట్మెంట్కు రూ.20 వేల నుంచి 40 వేల లెక్కన గంపగుత్తగా సమర్పించుకోవాల్సిందే.. వాటితో పాటు దీపావళి బోనస్‌గా గిఫ్ట్ ప్యాక్‌లు ఇవ్వాల్సిందే అంటూ వాపోయాడు శ్రీను. ఇదంతా ‘మామూలే’ అనుకుంటూ వెనుతిరిగాడు. ఎప్పుడో నరకాసురుడిని చంపితే ఇప్పుడు దీపావళి చేసుకుంటున్నాం.. మరి ఇప్పుడు పేట్రేగిపోయిన రాజకీయ అవకాశవాద నరకాసురులు, విభజన కోరుకునే కలియుగ నరకాసురులు.. లంచగొండి నరకాసురులు.. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే నరకాసురులు.. ఎందో మంది ఉన్నారు. వారిని ఎవరు తుదముట్టిస్తారు? అంటూ మనసులోనే మధనపడుతూ సూరిబాబు భారమైన మనస్సుతో.. తేలికైన క్రాకర్స్ సంచితో ఇంటిముఖం పట్టాడు. రానున్నకాలంలో జనమే చైతన్యవంతమై.. తారాజువ్వల్లా ఎగిసి.. ఓటు అనే విష్ణుచక్రంతో కలియుగ నరకాసురుల్ని తుదముట్టించిననాడే అచ్చమైన దీపావళి.. ఆ రోజు ఎప్పుడొస్తుందో అనుకుంటూ నిట్టూరుస్తున్న సూరిబాబును ‘నాన్నా టపాసులు తెచ్చావా’ అంటూ పిల్లల పలకరింపుతో అతని ఆలోచనలకు తెరపడింది.