బ్లూవేల్‌ చాలెంజ్‌ | Actress Poorna turns ACP for social thriller | Sakshi
Sakshi News home page

బ్లూవేల్‌ చాలెంజ్‌

Nov 9 2018 2:55 AM | Updated on Nov 9 2018 2:55 AM

Actress Poorna turns ACP for social thriller - Sakshi

పూర్ణ

బ్లూ వేల్‌ చాలెంజ్‌ .. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండుంటే ఈ ఆట గురించి వినుంటారు. సీరియస్‌ రిస్కులతో కూడుకున్న ఈ గేమ్‌లో చాలామంది హానికి గురయ్యారు. 50 రోజుల పాటు సాగే ఈ చాలెంజ్‌లో చివరి వరకూ వెళ్లే ఆటగాళ్లను సూసైడ్‌ చేసుకొమ్మని ప్రేరేపించే భయంకరమైన గేమ్‌ అది. ఇప్పుడు ఆ ఆట ఆధారంగా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.

‘అవును’ ఫేమ్‌ పూర్ణ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు రంగనాథన్‌ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రంగనాథన్‌ మాట్లాడుతూ – ‘‘ఇప్పటి జనరేషన్‌ పిల్లలందరి వద్ద స్మార్ట్‌ ఫోన్స్‌ ఉన్నాయి. దీని వల్లే ఇలాంటి భయంకరమైన గేమ్స్‌ కూడా ఎక్కువవుతున్నాయి. రీసెంట్‌గా పాపులర్‌ అయిన గేమ్‌ ‘బ్లూవేల్‌ చాలెంజ్‌’. ఈ గేమ్‌ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నాం. క్రిమినల్స్‌ ఎవరో చూపించలేం కానీ తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తగా ఉండాలో మా చిత్రం ద్వారా చూపించదలిచాం’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement