Blue Wale game
-
బ్లూవేల్ పోయె పబ్జి వచ్చె
నగరంలోని విద్యారణ్యపురకు చెందిన ఒక అబ్బాయి తరగతిలో ఎప్పుడూ మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేవాడు. కానీ ఇటీవల తరచూ స్కూల్‌కు వెళ్లడం లేదు. మార్కులు తగ్గిపోయాయి. తల్లిదండ్రులతోనూ మాట్లాడడం లేదు. నిరంతరం మొబైల్లో, కంప్యూటర్లో పబ్జి గేమ్ ఆడడమే. మరో 15 ఏళ్ల అబ్బాయి రాత్రి 2–3 గంటలవరకు పబ్జి ఆడడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేచి ఆలస్యంగా స్కూల్‌కు వెళుతున్నాడు. గంటల తరబడి మొబైల్లో పబ్జి గేమ్ ఆడుతూ ప్రపంచాన్ని మరచిపోతున్నాడు. గత్యంతరం లేని తల్లిదండ్రులు నిమ్హాన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాక్షి బెంగళూరు/ యశవంతపుర: ప్రాణాంతక బ్లూ వేల్ గేమ్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో పబ్జి అనే కొత్త గేమ్ వచ్చిపడింది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బాలలు, కుర్రకారు ఈ ఆటకు బానిసలుగా మారారు. తిండితిప్పలు వదిలేసి మరీఈ గేమ్‌కు అంటుకుపోతూ మానసికంగా దెబ్బతింటున్నారు. విద్యార్థులు విపరీతంగా ఆడడం వల్ల నిద్రలేమీ, స్కూల్‌కు గైర్హాజరు, హింసాత్మక ప్రవృత్తి పెరగడం వంటి మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ దూసుకుపోతోంది. మూడునెలల్లో 120 కేసులు ఈ కొత్త ఆన్లైన్ గేమ్‌కు బానిసలవుతున్న వారిలో బెంగళూరు ప్రముఖ స్థానం ఉంది. పబ్జి గేమ్ వ ల్ల మానసకి రుగ్మతలకు గురై ఇటీవల చాలా మం ది నిమ్హాన్స్కు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. గడిచిన మూడు నెలల నుంచి ఇప్పటివరకు నిమ్హాన్స్లోని సర్వీసెస్ ఫర్ హెల్తీ యూ జ్ ఆఫ్ టెక్నాలజీ (షట్)కు 120 కేసులు వచ్చినట్లు తెలిపారు. చాలా మంది ఈ గేమ్ ఆడిన తర్వాత జీవితంపై ఆసక్తి లేకపోవడం, నిద్ర లేమీ, చదువులో వెనుకబడిపోవడం తదితర మానసిక సమస్యలకు చికిత్స కోసం వస్తున్నారని పేర్కొన్నారు. జీవితాన్ని కోల్పోతున్నారు ‘దేశంలో 8 నెలల క్రితం ఈ గేమ్ యాప్ ప్రారంభించారు. తొలి మూడు నెలల్లో నెలకు మూడు లేదా ఐదు కేసులు మాత్రమే వస్తుండేవి. కానీ ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి కేసుల సంఖ్య పెరగడం గమనించాం. ఇప్పుడు నెలకు సగటున 40 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయి. ఈ గేమ్ ప్రతిఒక్కరి జీవితాన్ని కబళిస్తోంది. రోజుకు 8 నుంచి 10 గంటలు ఆడడం వల్ల జీవితంలో అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. గేమ్‌కు అలవాటైన పిల్లలను ఫోన్‌కు దూరం చేస్తే చాలా కోపంగా, హింసాత్మకంగా మారిపోతున్నారు. తల్లిదండ్రులతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆస్పత్రికి వస్తున్న రోగులు తమ తల్లిదండ్రుల మీదే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి గేమ్స్ బారినపడకుండా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. అసహజ వైఖరి, ప్రవర్తన కనిపిస్తే వెంటనే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాలి’ – డాక్టర్ మనోజ్ శర్మ, శ్రీధర్, సైకియాట్రిస్టులు యుద్ధం చెయ్యడం, చంపడమే ఈ గేమ్ ఇది ఒక యుద్ధానికి సంబంధించిన గేమ్. 100 మందితో ఈ గేమ్ ప్రారంభమవుతుంది. విమానం నుంచి 100 మంది ఒక ద్వీపంలోకి దిగుతారు. యుద్ధ రంగంలోకి అడుగిడి భారీ తుపాకులు, ఆయుధాలతో గేమ్‌లో ఉన్న ప్రత్యర్థులను చంపుకుంటూ వెళుతుంటారు. బైకులు, కార్లు, బోట్లు ఉపయోగించుకుని ద్వీపంలో తిరుగుతూ దాడులు చేస్తారు. అలా చంపుకుంటూ వెళ్లి చివరికి ఆ నూరు మందిలో ప్రాణాలతో మిగిలే వారే విజేతలుగా నిలుస్తారు. -
బ్లూవేల్ చాలెంజ్
బ్లూ వేల్ చాలెంజ్ .. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండుంటే ఈ ఆట గురించి వినుంటారు. సీరియస్ రిస్కులతో కూడుకున్న ఈ గేమ్‌లో చాలామంది హానికి గురయ్యారు. 50 రోజుల పాటు సాగే ఈ చాలెంజ్‌లో చివరి వరకూ వెళ్లే ఆటగాళ్లను సూసైడ్ చేసుకొమ్మని ప్రేరేపించే భయంకరమైన గేమ్ అది. ఇప్పుడు ఆ ఆట ఆధారంగా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘అవును’ ఫేమ్ పూర్ణ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు రంగనాథన్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రంగనాథన్ మాట్లాడుతూ – ‘‘ఇప్పటి జనరేషన్ పిల్లలందరి వద్ద స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దీని వల్లే ఇలాంటి భయంకరమైన గేమ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. రీసెంట్గా పాపులర్ అయిన గేమ్ ‘బ్లూవేల్ చాలెంజ్’. ఈ గేమ్ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నాం. క్రిమినల్స్ ఎవరో చూపించలేం కానీ తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తగా ఉండాలో మా చిత్రం ద్వారా చూపించదలిచాం’’ అని పేర్కొన్నారు. -
కలబుర్గిలో బాలుడు ఆత్మహత్య
సాక్షి బెంగళూరు: కలబుర్గిలో సమర్థ్ (12) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మహాలక్ష్మి లేఔట్లో ఉంటున్న సమర్థ్ ఒక ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్దికాలంగా చదువును నిర్లక్ష్యం చేస్తూ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లు.. బాగా చదువు అని తల్లిదండ్రులు మందలిస్తున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడి, మందలింపుతో తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. చుట్టుపక్కల వారు సమర్థ్ వీడియో గేములు ఎక్కువగా ఆడుతాడని, బ్లూవేల్ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు. ఏఎస్పీ లోకేశ్ స్పందిస్తూ బాలుని మరణానికి బ్లూవేల్ గేమ్ కారణం కాదన్నారు. తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. -
మోమో..వామ్మో!
బ్లూవేల్ చాలెంజ్.. గతేడాది పలు దేశాలను వణికించిన ఈ ఆన్లైన్ గేమ్.. వందలాది మంది యువత ప్రాణాలను బలిగొంది. మన దేశంలోనూ పలువురు ఈ గేమ్ వల్లే తమ ప్రాణాలను తీసుకున్నారని చెబుతారు.. ప్రస్తుతానికి బ్లూవేల్ భయం లేదు.. అంతా బాగానే ఉంది అని అంటున్నారు.. నిజంగానే అంతా బాగానే ఉందా.. మరి ఈ ‘మోమో’ ఏంటి? అర్జెంటీనాలోని ఓ బాలిక ఆత్మహత్యకు దీనికి లింకేంటి? పలు దేశాల్లో మొదలైనఆ కలవరానికి కారణమేంటి? ఏమిటీ మోమో.. ఏమిటా వికృత అవతారం.. మోమో.. ఫేస్‌బుక్‌లోని ఓ గ్రూప్‌లో మొదలై.. ప్రస్తుతం వాట్సాప్‌లో చాప కింద నీరుగా విస్తరిస్తున్న ఓ ఆన్లైన్ గేమ్. దీని అవతార్‌గా ఓ వికృత ముఖాన్ని వాడారు. వాస్తవానికి ఇదో బొమ్మతాలూకు ముఖం. దీన్ని జపాన్‌కు చెందిన మిదోరీ హయాషీ అనే ఆమె తయారుచేశారు. అయితే.. ఆమెకు ఈ గేమ్‌కు ఎలాంటి సంబంధం లేదట. రష్యాలో మొదలైన బ్లూవేల్ చాలెంజ్లాగానే ఇది కూడా డెత్ గేమ్ అని అర్జెంటీనా, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా తదితర దేశాల పోలీసులు అనుమానిస్తున్నారు. కారణమేంటి? గత ఆదివారం అర్జెంటీనాలో 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తమ ఇంటి పెరడులోని చెట్టుకు ఉరివేసుకుంది. పోలీసులు సమీపంలో పడి ఉన్న ఆమె ఫోన్‌ను హ్యాక్ చేయగా.. ఈ మోమో చాలెంజ్ గురించి బయటపడింది. ఈ గేమ్ మొదలై.. కొన్ని వారాలైందని.. సదరు బాలిక కూడా ఈ గేమ్‌లోని చాలెంజ్‌లను పూర్తి చేస్తూ వచ్చిందని భావిస్తున్నారు. పైగా ఆ బాలిక తన చివరి క్షణాలను వీడియో తీసింది. గేమ్‌లో చేసిన చాలెంజ్‌లో భాగంగానే ఈ వీడియోను తీసి పోస్ట్ చేయాలని ఆమె భావించి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీడియోలో ఆమె హావభావాలను పరిశీలిస్తే.. ఇందుకు ఆమెను ఎవరో ప్రేరేపించినట్లు స్పష్టమవుతుందని అంటున్నారు. వాట్సాప్‌లో మోమో చాలెంజ్‌లో భాగంగా ‘ఓ 18 ఏళ్ల అజ్ఞాత యువకుడి’తో సంభాషణలు జరిపిందని.. చనిపోయే ముందు కూడా మెసేజ్‌లు పంపిందని పోలీసులు చెప్పారు. గతంలో ఆమె తీసిన వీడియోలను ఆమె స్నేహితులు కూడా చూశారట. దీంతో వారు ‘మోమో చాలెంజ్’ బారిన పడకుండా ఉండేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆ అజ్ఞాత యువకుడి కోసం గాలింపు మొదలైంది. ఎవరు చేస్తున్నారు? అసలు ఈ మోమో అన్నది ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.. దీని వెనక ఎవరున్నారన్న వివరాలు ఇప్పటికీ తెలియలేదు. దీని వెనకున్నవారు ఎక్కువగా టీనేజ్ యువతీయువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. గేమ్‌లో ముందుగా.. మోమోను కాంటాక్ట్ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్ ఇచ్చి.. మెసేజ్ పంపుతూ చాట్ చేయాలంటూ చాలెంజ్ విసురుతారు. మనం పంపితే.. భయానక చిత్రాలు.. హింసాత్మక సందేశాలు వస్తాయి. పలు పనులు పూర్తి చేయాలంటూ వరుసగా సవాళ్లు వస్తాయి. స్వీయ హాని చేసుకునేలా ఇవి ప్రోత్సహిస్తుంటాయి. చాలెంజ్ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు కూడా వస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటివరకూ ఇలాంటి మెసేజ్‌లు ఓ ఏడు నంబర్ల నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అవి జపాన్, లాటిన్ అమెరికా దేశాలకు చెందినవని తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కొత్త గేమ్ మరో బ్లూవేల్ తరహా దారుణాలకు దారి తీస్తుందని భయపడుతున్నారు. పిల్లలు.. పేరెంట్స్ చేయండిలా.. ఇప్పటికే ఆయా దేశాల్లో పిల్లలు, వారి తల్లిదండ్రుల సందేహాలను తీర్చడానికి హెల్ప్లైన్లు పెట్టారు. కొత్త నంబర్లకు సందేశాలు పంపొద్దని.. ఏదైనా నచ్చకపోతే.. ధైర్యంగా నో అని చెప్పాలని హితబోధ చేస్తున్నారు. మిగతావాళ్లు చేస్తున్నారని.. ఆ బాటలో వెళ్లడం సరికాదంటున్నారు. తేడా అనిపిస్తే.. తల్లిదండ్రులకు చెప్పాలని.. దాయడం సరికాదంటున్నారు. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. వారు సోషల్ మీడియాలో ఏమి అప్లోడ్ చేస్తున్నారు.. ఎవరితో సంభాషణలు జరుపుతున్నారన్న విషయాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. బిజీలో పడి.. పిల్లలు చెబుతున్నదాన్ని అశ్రద్ధ చేయవద్దని అంటున్నారు. విదేశాల్లో పరిస్థితి ఇలా ఉంది.. ఒకవేళ మన దగ్గరే మోమో అంటూ ఎవరైనా మెసేజ్ పంపితే.. నో అని గట్టిగా చెప్పాలి.. తొలి దశలోనే తుంచేయాలి.. -
బ్లూవేల్ గేమ్..ఓ మృత్యు క్రీడ