జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు! | actor purna about decissions on life | Sakshi
Sakshi News home page

జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు!

Published Sun, Dec 4 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు!

జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు!

బహుభాషా నాయకీమణుల్లో పూర్ణ ఒకరు. ఈ నటిలో మంచి నృత్యకారిణి కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నటి కంటే నర్తకినే పూర్ణను డామినేట్ చేస్తుందట. ఈ విషయాన్ని తనే ఒక వేదికపై స్వయంగా చెప్పారు. కథానాయకిగా ఒక స్థారుుకి చేరుకోలేకపోవడానికి ఇదీ ఒక కారణం కావచ్చు. అందుకే అప్పుడప్పుడూ కోలీవుడ్‌లో నాయకిగా మెరుస్తుంటారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నారుు. ఈ నేపథ్యంలో పూర్ణ తన మనసులోని భావాలను వెల్లడించారు. నటిగా తనది జయాపజయాల పయనం అని చెప్పారు. అపజయాలు వెంటాడుతున్నప్పుడు నటనకు స్వస్తి పలికి నృత్యంపైనే దృష్టి సారించాలన్న భావనకు వచ్చానని, అలా చేసి ఉంటే ఇప్పుడు కొన్ని మంచి అవకాశాలను కోల్పోయేదాన్నని అన్నారు.

జీవితంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోరాదని, అలాంటివి భవిష్యత్‌లో బాధకు గురిచేస్తాయని అన్నారు. తన వెనుక తన కుటుంబ అండ ఎల్ల ప్పుడూ ఉందన్నారు. తాను ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని పునఃపరిశీలన చేసుకోవాలని వారు సూచిస్తారన్నారు. అది చేయకపోతే తాను చాలా కోల్పోయేదాన్నని పేర్కొన్నారు. ప్రస్తుతం సవరకత్తి చిత్రంలో చాలా మంచి పాత్రను పోషిస్తున్నానని, అదే విధంగా చతురంగవేటై్ట-2 చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తున్నానని తెలిపారు. ఇక తెలుగులోనూ ఒక చిత్రం చేస్తున్నట్లు పూర్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement