దసరా స్పెషల్స్ | Dasara Specials... | Sakshi
Sakshi News home page

దసరా స్పెషల్స్

Published Tue, Oct 20 2015 11:51 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దసరా స్పెషల్స్ - Sakshi

దసరా స్పెషల్స్

పూర్ణాలు
కావలసినవి: మినప్పప్పు - ఒక కప్పు, బియ్యం - రెండు కప్పులు, పచ్చి శనగపప్పు- ఒక కప్పు, తరిగిన బెల్లం  - ఒక కప్పు, పంచదార- ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నెయ్యి - రెండు టీ స్పూన్లు, నూనె - సరిపడినంత.
తయారీ:  బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా నానబెట్టాలి మూడు గంటల తరువాత రెండింటినీ కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి  రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. దోసెల పిండిలాగా మెత్తగా రావాలి కాని అంత పలుచగా ఉండకూడదు  గారెల పిండికంటే కొంచెం లూజుగా ఉండేటట్లు చూడాలి  రుబ్బిన తరువాత ఈ మిశ్రమం ఒక రాత్రంతా నానాలి  పూర్ణాలు చేయడానికి ముందు రోజు నుంచే ప్రిపరేషన్ మొదలవ్వాల్సి ఉంటుంది  

శనగపప్పును కడిగి పది నిమిషాల సేపు నానిన తర్వాత ప్రెషర్ కుకర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి  ఉడికిన పప్పులో ఉన్న నీటిని వడపోయాలి  శగనపప్పులో బెల్లం పొడి, పంచదార వేసి చిన్న మంట మీద ఉడికించాలి  బెల్లం, పంచదార ముందు కరిగి నీరవుతాయి. అవి తిరిగి దగ్గరయ్యే వరకు అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉడికించాలి  కొద్దిసేపటికి శనగపప్పు, బెల్లం, పంచదార అన్నీ కలిసిపోయి ముద్దయిన తరువాత దించేయాలి
* దించిన తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి  నూనె మరిగిన తరువాత ఒక్కొక్క ఉండను ముందురోజు రుబ్బి సిద్ధంగా ఉంచిన మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి
* పూర్ణాల తయారీలో నైపుణ్యం ఇక్కడే ఉంటుంది  లడ్డూ నలగకుండా మినప్పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి  ఇలా వేసేటప్పుడు మినప్పిండి మిశ్రమం అన్ని వైపులా సమంగా పట్టాలంటే మూడువేళ్లతో వేయాలి  ఇలా చేస్తే పూర్ణం గుండ్రంగా, చూడడానికి అందంగా ఉంటుంది  నూనెలో అన్ని వైపులా సమంగా వేగేటట్లు తిప్పుతూ దోరగా వేగిన తరువాత తీసుకోవాలి  వేడి వేడిగా నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి.
 
సగ్గుబియ్యం లడ్డూలు
కావలసినవి: సగ్గుబియ్యం - 1 కప్పు, నెయ్యి - 1 కప్పు, పంచదార - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీస్పూన్, జీడిపప్పు, బాదంపప్పు  - 10.
తయారీ:  పాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసి సగ్గుబియ్యం వేసి దోరగా వేయించుకోవాలి  చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి  పంచదార, యాలకులు కలిపి మెత్తగా పొడి చేసుకుని సగ్గుబియ్యం పొడిలో వేయాలి  ఇందులో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదంపప్పు కలపాలి  అంతా కలిసిన తర్వాత నెయ్యి కరిగించి వేసి కలిపి ఉండలు కట్టుకోవాలి  చల్లారిన తర్వాత గట్టిపడతాయి.
 
బ్రెడ్ జామూన్స్
కావలసినవి: బ్రెడ్ పొడి - 2 కప్పులు, బెల్లం తురుము - 1/2 కప్పు, యాలకుల పొడి - 1/4 టీ స్పూన్, కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు, నెయ్యి - 3 టీ స్పూన్లు.
తయారీ:  ఎండిన బ్రెడ్ లేదా రస్కులను పొడి చేసుకోవాలి  పాన్‌లో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు పోసి కరిగించి వడకట్టుకోవాలి  మరో పాన్ వేడి చేసి ఈ బెల్లం నీరు పోసి మరిగించాలి  పాకం కాస్త ముదురుతున్నప్పుడు బ్రెడ్ పొడి, యాలకులపొడి, వేసి కలుపుతూ నిదానంగా ఉడికించాలి  మొత్తం బ్రెడ్, బెల్లం ఉడికి దగ్గర పడ్డాక నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి దించి చల్లారనివ్వాలి  మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు (గుండ్రంగా లేదా కోలగా) చేసుకుని ఎండు కొబ్బరి పొడిలో రోల్ చేసి ఆరనివ్వాలి.
 
కార్న్‌ఫ్లోర్ / బొంబాయి హల్వా
కావలసినవి: కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు, పంచదార - 3 కప్పులు, నీళ్లు - 4 కప్పులు, నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10, బాదంపప్పు - 8,ఫుడ్ కలర్ - 1/4 టీ స్పూన్.
తయారీ:  ఒక పళ్లానికి లోపలంతా నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి  పాన్‌లో చెంచాడు నెయ్యి వేసి వేడిచేసి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేయించి పెట్టుకోవాలి  ఒక గిన్నెలో పంచదార, కలర్, కార్న్‌ఫ్లోర్, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి  పాన్ వేడి చేసి ఈ మిశ్రమం వేసి కలుపుతూ ఉడికించాలి  అది చిక్కబడుతున్నప్పుడు మిగిలిన నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి  ముందు తెల్లగా చిక్కగా ఉన్నా తర్వాత మెల్లిగా పారదర్శకంగా మారుతుంది అప్పుడు వేయించిన బాదం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా పరచాలి  చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి  ఇందులో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కలర్స్ వేసుకోవచ్చు  కార్న్‌ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు.
 
 
కోకోనట్ బర్ఫీ
కావలసినవి: ఎండు కొబ్బరి తురుము - 250 గ్రా., కండెన్స్‌డ్ మిల్క్ - 250 మి.లీ., పంచదార - 150 గ్రా.,వెన్న - 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - 1/2 టీ స్పూన్, నచ్చిన ఫుడ్ కలర్ - 3 లేదా 4 చుక్కలు
తయారీ:  నలుచదరంగా ఉండే కేక్ టిన్ను లేదా అంచు ఉన్న వెడల్పాటి గిన్నె లేదా ప్లేట్ లోపలివైపు పలుచగా వెన్న రాసి పెట్టుకోవాలి  పాన్‌లో కొబ్బరి తురుము, కండెన్స్‌డ్ మిల్క్, పంచదార కలిపి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి  మొత్తం మిశ్రమం ఉడికి చిక్కబడుతున్నప్పుడు ఫుడ్ కలర్ వేసి కలిపి దగ్గరపడ్డాక వెన్న, ఎసెన్స్ వేసి కలిపి అంచులు వదులుతుండగా దింపి వెన్న రాసిన గిన్నెలో వేసి సమానంగా సర్దాలి  చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి  దీనిని రెండు మూడు రంగుల్లో కూడా చేసుకోవచ్చు.
 
 
ఆరెంజ్ రవ్వ కేసరి
కావలసినవి: బొంబాయి రవ్వ - 2 కప్పులు, తాజా నారింజ రసం - 1 కప్పు, పంచదార - 125 గ్రా., నెయ్యి - 100 గ్రా, యాలకుల పొడి - 1 టీ స్పూన్, జీడిపప్పు - 10, కిస్మిస్ - 20, ఎల్లో ఫుడ్ కలర్ - చిటికెడు.
తయారీ:  సగం నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించి పెట్టుకోవాలి  నాలుగు కప్పుల నీళ్లు మరిగించి అందులో పంచదార, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలపాలి  తర్వాత వేయించిన రవ్వ మెల్లిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి  రవ్వ ఉడికిన తర్వాత మిగిలిన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, తాజా నారింజ రసం వేసి కలుపుతూ ఉండాలి  పూర్తిగా ఉడికి చిక్కబడ్డాక తీసి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా వత్తుకుని చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి  కావాలంటే కొద్దిగా ఆరెంజ్ ఎసెన్స్ వేసుకోవచ్చు.
 
1. మటన్ పప్పు
కావలసినవి: మాంసం - 250 గ్రా., ఉడికించిన కందిపప్పు - 200 గ్రా., ఉల్లిపాయలు - 2, కరివేపాకు - 1 రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్స్, పసుపు - 1/2 టేబుల్ స్పూన్, కారం పొడి - 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె - 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్, చింతపండు పులుసు - 1/2 కప్పు.

తయారీ:  పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి  తరువాత కడిగి శుభ్రం చేసుకున్న మాంసం ముక్కలు, కారం పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి  నీరంతా ఇగిరిపోయాక రెండు కప్పుల నీళ్లు పోసి మాంసం మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి  చింతపండు పులుసు వేసి మరో ఐదు నిమిషాల తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి, గరం మసాలా పొడి కలిపి, కొత్తిమీర చల్లి వడ్డించాలి.
 
 
2. చికెన్-సెనగపప్పు కూర
కావలసినవి: చికెన్ - 500 గ్రా., సెనగపప్పు - 100 గ్రా. ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్, పసుపు - 1/4 టీ స్పూన్, కారం పొడి - 1/2 టీ స్పూన్, ధనియాల పొడి - 1 టీ స్పూన్స్, గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్, కరివేపాకు - 2 రెబ్బలు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - 5 టీ స్పూన్లు.

తయారీ:  సెనగపప్పు కడిగి నీళ్లు పోసి గంటసేపు నాననివ్వాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి జల్లెట్లో వేసి పెట్టుకోవాలి  పాన్ లేదా కుక్కర్లో నూనె వేసి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి  ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేయాలి  ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి  ముక్కలలో నీరంతా ఇగిరిపోయి వేగిన తర్వాత సెనగపప్పు వేసి మసాలాలు అన్ని కలిసేవరకు వేయించాలి  తర్వాత ఇందులో కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి  ముక్కలు, పప్పు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి  సెనగపప్పు మెత్తబడకుండా బద్దలుగానే ఉండనివ్వాలి. దీనికి పచ్చిపులుసు సరైన జోడు.
 
 
3. ఖీమా ముట్టీల (ఉండల) కూర
కావలసినవి: మటన్ ఖీమా - 250 గ్రా., ఉల్లిపాయలు - 1, పచ్చిమిరపకాయలు - 2, టమోటాలు - 3, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు, కొబ్బరి పొడి - 100 గ్రా., పసుపు - 1/2 టీ స్పూన్, కారం పొడి - 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి - 1 టీ స్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర - 1/4 కప్పు, కరివేపాకు - 1 రెమ్మ, నూనె - 3 టీ స్పూన్లు.
 
తయారీ:  ఉల్లిపాయలు, టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి  ఖీమా శుభ్రంగా కడిగి నీరు పిండేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి  ఇందులో సగం పసుపు, కారం, గరం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి రోట్లో గాని, గ్రైండర్‌లో గాని వేసి రుబ్బుకోవాలి  ఎక్కువ మెత్తగా చేయకూడదు. పిండిలా అవుతుంది  గ్రైండర్‌లో వేస్తే నిమిషం పాటు తిప్పి తీసేయాలి  రోట్లో అయితే మంచిది. మొత్తం మసాలా కలిసి ఒక్కతీరుగా అయ్యేవరకు రుబ్బుకోవాలి  చేతికి నూనె అద్దుకుంటూ ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి  కావాలంటే వెడల్పుగా కూడా చేసుకోవచ్చు  వెడల్పాటి పాన్‌లో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
 
ఉల్లిపాయలు వేగకపోతే బావుండదు అల్లం, వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం పొడి, కరివేపాకు వేసి మరికొంత సేపు వేయించి ఖీమా ఉండలు, తగినంత ఉప్పు వేసి విరిగిపోకుండా మెల్లిగా కలిపి మూత పెట్టాలి  నీరంతా ఇగిరిపోయాక సన్నగా తరిగిన టమోటాలు వేసి కాస్త వేయించి, కొబ్బరిపొడి, అరకప్పు నీరు పోసి చిన్న మంటపై నూనె తేలేవరకు ఉండికించాలి  ఎక్కువగా కలిపితే ఉండలు విరిగిపోతాయి  చివరలో గరం మసాలా, కొత్తిమీరవేసి కలిపి దింపేయాలి      ఈ ఖీమా ఉండలు విడిగా నూనెలో వేయించి కూరలో వేయొచ్చు లేదా పచ్చి ఉండలను కూరలోనే వేయించొచ్చు.
 
4. మసాలా కోడికూర
కావలసినవి: కోడి మాంసం - 1 కేజీ, ఉల్లిపాయలు - 2, టమోటాలు - 2, పచ్చిమిర్చి - 4, అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు, పసుపు - 1/4 టీ స్పూన్, ధనియాల పొడి -2 టీ స్పూన్లు, పసుపు - 1/4 టీస్పూన్, కారం పొడి - 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్, కొబ్బరి పొడి - 3 టేబుల్ స్పూన్లు, పెరుగు - 1 కప్పు / 100 మి.లీ., జీడిపప్పు పొడి లేదా ముద్ద - 3 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా, నూనె - 4 టేబుల్ స్పూన్లు.
 
తయారీ:  చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి జల్లెట్లో వేసి ఉంచుకోవాలి  మందంగా ఉండే బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి  ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం పొడి, ధనియాలు పొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి మగ్గిన తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి నిదానంగా ఉడికించాలి  జీడిపప్పు ముద్ద, పెరుగు కొబ్బరి పొడి కలిపి పెట్టుకోవాలి  చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమం, కొత్తిమీర వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించి గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement