మట్టిలో మాణిక్యం పూర్ణ | Officially honored to purna | Sakshi
Sakshi News home page

మట్టిలో మాణిక్యం పూర్ణ

Published Mon, Jun 16 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

మట్టిలో మాణిక్యం పూర్ణ

మట్టిలో మాణిక్యం పూర్ణ

 గ్రామీణ గిరిజన కుటుంబంలో పుట్టి.. గురుకుల పాఠశాలలో చదివి.. ఎవరికీ అందనంత ఎత్తున్న ఎవరెస్టును ఎక్కింది. జిల్లా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. అసాధ్యాన్ని సైతం.. నిండైన ఆత్మవిశ్వాసంతో సుసాధ్యం చేసింది మన ఇందూరు బిడ్డ మాలావత్ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి వచ్చిన పూర్ణకు జిల్లా ఘనస్వాగతం పలికింది.   
                                                               
పాకాల(సిరికొండ):  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ మట్టిలో మాణిక్యమని తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ రిక్క లింబాద్రి అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అనంతరం పూర్ణ తొలిసారిగా స్వగ్రామమైన పాకాలకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో లింబాద్రి మాట్లాడారు. ఒక సాధారణ గిరిజన బాలిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆణిముత్యం గా నిలిచిందన్నారు.

పూర్ణ, ఆనంద్‌లను ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక చేసి పంపిస్తున్నప్పు డు ఎంతోమంది ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఏవేవో అన్నారని, వారికేమైనా జరిగితే పంజాగుట్ట చౌరస్తాలో నన్ను ఉరి తీస్తారని మాట్లాడారని ప్రవీణ్‌కుమార్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. అనంతరం సన్మాన గ్రహీత పూర్ణ మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణ కోసం ప్రయాణం ప్రారంభించిన రోజు మా శిక్ష కులు ఎవరెస్ట్ అధిరోహణ ఎంత కఠినతరమైందో మా తల్లిదండ్రులకు వివరించారన్నారు.
 
అప్పుడు మా నాన్న కష్టపడితేనే కదా సార్ ఫలితం వచ్చేది అని చెప్పగానే నాకెంతో ఆనందం వేసిందని పూర్ణ గుర్తు చేశారు. డెత్ జోన్‌లో రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఎక్కుతున్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాల వెలుగును ఎంతో ఆస్వాదించానన్నారు. మా గ్రామం పాకాల పేరును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని పూర్ణ తెలిపారు. ఐపీఎస్ ఆర్.ప్రవీణ్‌కుమార్, శిక్షకులు శేఖర్‌బాబు, పరమేష్‌కుమార్, వేణుగోపాలచారికి ఈసందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, పూర్ణ తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సన్మానం
పూర్ణను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా స న్మానించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ. సాయిలు పూర్ణకు శాలువా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం పూర్ణతోపాటు ఆమె తల్లిదండ్రులకు సన్మానం చేసి నూతన వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో యూని యన్ నాయకులు గంగాదాసు, పాకాల నర్సిం లు, జిల్లా బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షుడు శశాంక్ తదితరులు ఉన్నారు.
 
అధికారికంగా పూర్ణకు సత్కారం నిజామాబాద్ ఎంపీ కె. కవిత
కలెక్టరేట్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశ ఖ్యాతిని మరింత పెంచిన మాలావత్ పూర్ణను త్వరలో అధికారికంగా సన్మానించనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె తన స్వగృహంలో మాట్లాడారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతిచిన్న వయస్సులో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా అధిరోహించిన పూర్ణను అభినందిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. పూర్ణను త్వరలో జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సన్మానిస్తామని వివరించారు.
 
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
సిరికొండ మండలం పాకాల గ్రామంలో భార త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్ణ ఆవిష్కరించారు. జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణ విగ్రహాన్ని వితరణగా అందించారు. గ్రామాని కి చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు గద్దె నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలయ్య, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ నర్సయ్య, పాల్గొన్నారు.
 
 భీమ్‌గల్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకెక్కిన జిల్లా వాసి మాలావత్ పూర్ణను ఆదివారం భీమ్‌గల్ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ శర్మన్ ఆధ్వర్యంలో సన్మానించారు. పూర్ణ స్వగ్రామమైన పాకాలకు వచ్చిన పూర్ణకు శాలువా పూల మాలలు వేసి మెమెంటోతో సన్మానించారు. ఆమె వెంట టీఆర్‌ఎస్ నాయకులు శర్మన్ నాయక్, రాజేశ్వర్, లింబాద్రి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement