ఓ శాంపిల్ చూస్తారేంటి? | Comedian Srinivasa Reddy is playing the lead role in a film called Jayammu Nischayammura. | Sakshi
Sakshi News home page

ఓ శాంపిల్ చూస్తారేంటి?

Published Wed, Nov 9 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

ఓ శాంపిల్ చూస్తారేంటి?

ఓ శాంపిల్ చూస్తారేంటి?

‘‘నా పేరు అడపా ప్రసాద్. కాకినాడ మున్సిపల్ ఆఫీసులో సీనియర్ సూపరింటెండెంట్‌ని. కమిషనర్ తర్వాత నేనే. అదేంటో... నా చుట్టూ ఉన్నోళ్లంతా ఆనందంగా ఉంటే నాకు ఆనందమండి. ఓ శాంపిల్ చూస్తారేంటి?’’ అంటున్నారు హాస్య నటుడు కృష్ణభగవాన్. ‘గీతాంజలి’ చిత్రం తర్వాత శ్రీనివాస్‌రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. పూర్ణ హీరోయిన్.

అడపా ప్రసాద్‌గా కృష్ణభగవాన్ నవ్వించనున్నారు. శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శివరాజ్ మాట్లాడుతూ- ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పల్లెవాసన, తెలుగుదనం ఉండే చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో మా సినిమా ఒకటిగా నిలుస్తుంది. ఈ నెల 13న పాటలు, 25న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement