jayammu niscayammura
-
హీరోలానే కనిపించాడు
‘‘శ్రీనివాస్‌రెడ్డి నాకు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చూపించాడు. చిత్రంలో రెండున్నర గంటలు అతను నాకు హీరోలానే కనిపించాడు’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి హీరోగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు అనిల్ రావిపూడి, కొరటాల శివ ప్రచార చిత్రాలను రిలీజ్ చేశారు. ‘‘ఇటీవల ఇంత మంచి చిత్రం చూడలేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించవచ్చో ఈ చిత్రంతో అర్థమైంది. మా అన్నయ్యగారి అబ్బాయి రవిచంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించాడని లేటుగా తెలిసింది’’ అని కొరటాల అన్నారు. ‘‘ఈ వారంలో ఆడియో, ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు శివరాజ్ కనుమూరి. హీరో శ్రీనివాస్‌రెడ్డి, చిత్ర సమర్పకులు ఏవీఎస్ రాజు, నిర్మాతలు నీలం కృష్ణారెడ్డి, సతీశ్ కనుమూరి పాల్గొన్నారు. -
‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీ స్టిల్స్
-
ఓ శాంపిల్ చూస్తారేంటి?
‘‘నా పేరు అడపా ప్రసాద్. కాకినాడ మున్సిపల్ ఆఫీసులో సీనియర్ సూపరింటెండెంట్ని. కమిషనర్ తర్వాత నేనే. అదేంటో... నా చుట్టూ ఉన్నోళ్లంతా ఆనందంగా ఉంటే నాకు ఆనందమండి. ఓ శాంపిల్ చూస్తారేంటి?’’ అంటున్నారు హాస్య నటుడు కృష్ణభగవాన్. ‘గీతాంజలి’ చిత్రం తర్వాత శ్రీనివాస్‌రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. పూర్ణ హీరోయిన్. అడపా ప్రసాద్‌గా కృష్ణభగవాన్ నవ్వించనున్నారు. శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శివరాజ్ మాట్లాడుతూ- ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పల్లెవాసన, తెలుగుదనం ఉండే చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో మా సినిమా ఒకటిగా నిలుస్తుంది. ఈ నెల 13న పాటలు, 25న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.