మన హీరో ‘పూర్ణ’
► నేడు సినిమా విడుదల
► ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థుల బయోపిక్
► స్వేరోస్‌కమిటీ అభినందన
ఆదిలాబాద్: అతిపిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లపై వస్తున్న బయోపిక్ సినిమాలో ఆదిలాబాద్ వాసి మనోజ్ హీరోగా నటిస్తున్నాడు. ‘పూర్ణ’ అనే టైటిల్‌తో బాలీవుడ్ డైరెక్టర్ రాహుల్‌బోస్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 31న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మనోజ్ ఆనంద్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్‌లో మనోజ్‌ను స్వేరోస్ కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుంకరి రమేశ్, ప్రధాన కార్యదర్శి ఊశన్న, సభ్యులు పొచ్చన్న, కుశల్, అడెల్లు, రాజ్‌కుమార్ అభినందించా రు. నిజామాబాద్‌కు చెందిన పూర్ణమాలవత్, ఖమ్మంకు చెందిన ఆనంద్‌లు 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరం అధిరోహించి గు రుకులాల పేరు నిలబెట్టారు. వారిపై తీస్తున్న సినిమాలో ఆనంద్ క్యారెక్టర్‌లో నటిస్తున్న మనోజ్‌కుమార్ సైతం గురుకులాల్లో చదివాడు. పూర్ణ క్యారెక్టర్‌లో హైదరాబాద్‌కు చెంది న ఆదితి ఇందల్ నటిస్తోంది. పూర్ణ సినిమా కోసం వంద మందిని ఎంపిక చేయగా అందులో చివరికి వరంగల్‌లో ఇంటర్మీడియెట్ చదువుతున్న మనోజ్‌ను అవకాశం దక్కింది.