ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్. ద రెబల్ కిడ్‌గా పాపులర్. కామిక్ వీడియోస్, లైఫ్ స్టయిల్, ట్రావెల్ వ్లోగ్స్‌కి ప్రసిద్ధి. టిక్‌టాక్‌లో లిప్ సింక్ వీడియోస్‌తో సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేసింది. మన దేశంలో టిక్‌టాక్ బ్యాన్ అవడంతో ఇన్‌స్టాలో కామిక్ వీడియోస్‌కి స్విచ్ ఓవర్ అయింది. ముంబైలో పుట్టి పెరిగింది. మణిపాల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసింది. కొన్నాళ్లు డెల్‌లో పని చేసింది.
వెబ్‌స్టార్‌గా నేమ్ అండ్ ఫేమ్ రావడంతో వెబ్ దునియానే ఫుల్‌టైమ్ వర్క్ ప్లాట్‌ఫామ్‌గా మలచుకుంది. యాక్టింగ్ ఫీల్డ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది.. 'Who is your gynac' అనే సిరీస్‌తో! ‘నా చుట్టూ ఉన్నవాళ్లను నవ్వించడం నాకు సరదా! అదే నా స్కిల్ అని లేట్‌గా అర్థమైంది. దాన్నే కెరీర్‌గా మార్చుకున్నాను. నిజానికి నేనో స్టోరీ టెల్లర్‌ని’ అంటుంది అపూర్వ ముఖీజా.
Comments
Please login to add a commentAdd a comment