విజేతలు అపూర్వ, శ్రీనివాస్ | apoorva, srinivas got state ranking carrom titles | Sakshi
Sakshi News home page

విజేతలు అపూర్వ, శ్రీనివాస్

Published Sun, Jan 1 2017 10:31 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

విజేతలు అపూర్వ, శ్రీనివాస్

విజేతలు అపూర్వ, శ్రీనివాస్

స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్  


 
సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, ఇందిరాంబ స్మారక క్యారమ్ చెస్ టోర్నమెంట్‌లో అపూర్వ, శ్రీనివాస్ సత్తా చాటారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్‌‌ట్స అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ చాంపియన్ అపూర్వ విజేతగా నిలవగా... పురుషుల విభాగంలో శ్రీనివాస్ సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అపూర్వ (ఎల్‌ఐసీ) 20-11, 25-9తో సవితా దేవి (పోస్టల్)పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన గేమ్‌లో జి. మాధవి 23-15, 15-13తో బి. సునీతా దేవిపై గెలిచింది.
 
 మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీనివాస్ 5-21, 25-16, 15-1తో మూడో సీడ్ మొహమ్మద్ అహ్మద్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో మొహమ్మద్ అహ్మద్ 18-9, 15-25, 20-10తో దినేశ్ బాబుపై, కె. శ్రీనివాస్ 2-25, 22-14, 25-16తో ఎస్. ఆదిత్యపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. డబుల్స్ విభాగంలో కె. శ్రీనివాస్-బాసిల్ ఫిలిప్స్ జంట 24-25, 17-24, 25-15తో వి. శ్రీనివాస రెడ్డి-ఎస్. ఆదిత్య జోడీని ఓడించి టైటిల్‌ను కై వసం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement