బాలీవుడ్‌లో కాలియా, షాహెన్‌షా వంటి చిత్రాలను రూపొందించిన నటుడు,దర్శకుడు అయిన టిన్ను ఆనంద్, 1989లో మాధురీ దీక్షిత్- అమితాబ్ బచ్చన్‌ల కాంబినేషన్‌లో 'శనఖత్' అనే చిత్రాన్ని తెరకెక్కించాలని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయయడంతో పాటు ఐదురోజులు షూట్ చేసి సినిమాను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన కారణాలను సుమారు మూడు దశాబ్ధాల తర్వాత దర్శకుడు టిన్ను ఆనంద్ ఇలా తెలిపాడు.
(ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్)
'సినిమాకు చెందిన ఒక సన్నివేశం ఇలా ఉంటుంది. ఒక గ్యారేజ్‌లో అమితాబ్‌ను విలన్లు గొలుసులతో కట్టిపడేస్తారు. ఆ సమయంలో మాధురిని రక్షించడానికి ఆమితాబ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఆ గూండాలచే దెబ్బలు తిని హీరోయిన్‌ను రక్షిస్తాడు. అలాంటి సమయంలో హీరోకు అన్నివిదాలుగా హీరోయిన్ దగ్గర కావాలనేది సీన్. సినిమాలోని కీలకమైన ఈ సన్నివేశాల్లో హీరోయిన్‌ను లోదుస్తులు చూపించాలనుకున్నా. దానికి మాధురి దీక్షిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌లో 'జవాన్' నిషేధం.. ఎందుకో తెలుసా?)
అందుకు నచ్చిన దుస్తువులను తెచ్చుకోవచ్చని కూడా ఆమెకు చెప్పాను. దీంతో మాధురి కూడా ఓకే అన్నారు. తీరా షూటింగ్ సమయానికి ఇలా లోదుస్తులతో నటించడం ఇష్టం లేదని చెప్పింది. ఆప్పుడు ఆమెతో గొడవ జరిగింది. ఈ సీన్ చేయకుంటే ఈ సినిమా నుంచి వెళ్లిపోండని చెప్పడంతో ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా ఆ సినిమా ప్రారంభం అయిన ఐదురోజులకే ఆగిపోయింది.' అని టిన్ను ఆనంద్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన గ్లింప్స్ ఆయన డైలాగ్‌లతోనే ప్రారంభం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment