నిర్మాతగా మాధురీ దీక్షిత్..
దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరను వెలిగించిన మాధురీ దీక్షిత్ త్వరలోనే సినీ నిర్మాతగా మారనుంది. హీరోయిన్‌గా తెరమరుగైన తర్వాత ఆన్‌లైన్ డ్యాన్స్ అకాడమీ నిర్వహిస్తున్న మాధురీ తాజాగా సినీ నిర్మాణంపై దృష్టి సారించింది. త్వరలోనే సినీ నిర్మాణం ప్రారంభిస్తానని మీడియాకు వెల్లడించిన ఆమె, ఎలాంటి సినిమాలు నిర్మించనున్నారనే ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు. ప్రస్తుతం ఆమో స్క్రిప్టుల పరిశీలనలో బిజీబిజీగా గడుపుతోందని సమాచారం.