'ఈ చిత్రం భారతీయ విలువలకు నిదర్శనం' | 'Hum Aapke...' true to Indian family values: Madhuri Dixit | Sakshi
Sakshi News home page

'ఈ చిత్రం భారతీయ విలువలకు నిదర్శనం'

Published Fri, Aug 7 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

'ఈ చిత్రం భారతీయ విలువలకు నిదర్శనం'

'ఈ చిత్రం భారతీయ విలువలకు నిదర్శనం'

ఇండోర్: 'హమ్ ఆప్ కే హై కౌన్' చిత్రం.. భారతీయ కుటుంబాల విలువలకు నిదర్శనమని ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ అన్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు.  సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ నటించిన హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై 21 ఏళ్ల పూర్తికావస్తోంది.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోర్ వచ్చిన మాధురీ మీడియాతో మాట్లాడుతూ.. '21 ఏళ్ల తర్వాత కూడా హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రం చూడటానికి సినీ అభిమానులు ఇష్టపడుతున్నందుకు సంతోషంగా ఉంది. భారతీయ కుటుంబాలలో జరిగే సంఘటనలకు ఈ చిత్రం వాస్తవ రూపం. అందుకే అభిమానులు ఇష్టపడుతున్నారు' అని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మహిళలు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement