'ఈ చిత్రం భారతీయ విలువలకు నిదర్శనం'
ఇండోర్: 'హమ్ ఆప్ కే హై కౌన్' చిత్రం.. భారతీయ కుటుంబాల విలువలకు నిదర్శనమని ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ అన్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ నటించిన హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై 21 ఏళ్ల పూర్తికావస్తోంది.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోర్ వచ్చిన మాధురీ మీడియాతో మాట్లాడుతూ.. '21 ఏళ్ల తర్వాత కూడా హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రం చూడటానికి సినీ అభిమానులు ఇష్టపడుతున్నందుకు సంతోషంగా ఉంది. భారతీయ కుటుంబాలలో జరిగే సంఘటనలకు ఈ చిత్రం వాస్తవ రూపం. అందుకే అభిమానులు ఇష్టపడుతున్నారు' అని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మహిళలు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నారని చెప్పారు.