మాధురీ దీక్షిత్తో ఇదే చివరిసారి | 'Gulaab Gang' was my last chance to work with Madhuri Dixit : Juhi Chawla | Sakshi
Sakshi News home page

మాధురీ దీక్షిత్తో ఇదే చివరిసారి

Published Tue, Jan 14 2014 4:43 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

మాధురీ దీక్షిత్తో ఇదే చివరిసారి

మాధురీ దీక్షిత్తో ఇదే చివరిసారి

అందాల భామలు మాధురీ దీక్షిత్, జూహిచావ్లా 1990ల్లో బాలీవుడ్ను ఊపేశారు. ఓ దశలో వీరిద్దరూ నెంబర్ వన్ స్థానం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. కాగా  రేసులో మాధురీనే దూసుకెళ్లారు. అయితే, అప్పట్లో మాధురీ, జూహి ఇద్దరూ కలసి తెరను పంచుకోలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చాక తొలిసారిగా కలిసి నటించడం విశేషం. 'గులాబ్ గ్యాంగ్' చిత్రంలో ఈ భామలు అభిమానులను అలరించనున్నారు. అయితే భవిష్యత్లో తామిద్దరూ కలసి మళ్లీ నటించే అవకాశం వస్తుందని భావించడం లేదని జుహి అన్నారు.

'మాధురితో కలసి నటించే చివరి చిత్రం (గులాబ్ గ్యాంగ్) ఇదే కావచ్చు. మరో అవకాశం వస్తుందని అనుకోవడం లేదు. ఇలాంటి స్క్రిప్ట్, పాత్రలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అప్పడు అంకితభావంతో నటించగలం. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులతో మేమూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం' అని జుహి చెప్పారు. గతంలో మాధురితో కలసి నటించే అవకాశం వచ్చినా అప్పట్లో ఉన్న పోటీ దృష్య్టా అంగీకరించలేదని గతాన్ని గుర్తుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement