
బిజినెస్‌లోనూ వారు స్టార్లే...
బాలీవుడ్ సెలబ్రిటీలు కేవలం గ్లామర్ ఫీల్డ్‌కే పరిమితం కాకుండా ఇతర వ్యాపార రంగాల్లో స్మార్ట్ ఇన్వెస్టర్లుగా కూడా రాణిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని హృతిక్ రోషన్ దాకా.. మాధురీ దీక్షిత్ నుంచి మలైకా ఆరోరా దాకా కొంగొత్త వెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ఈ మధ్యలో సెలబ్రిటీలు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ల సమాహారం ఇది. విజయాలతో మంచి జోష్ మీద ఉన్న స్టార్ అజయ్ దేవ్‌గణ్ కొన్నాళ్ల క్రితం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ టికెట్‌ప్లీజ్‌డాట్‌కామ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. వివిధ నగరాల్లోని థియేటర్లలో సినిమా టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
దర్శకుడు శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కలిసి క్యూకీ పేరుతో సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్‌ను ప్రారంభించారు. మరోవైపు, హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే, తారలు మలైకా అరోరా.. బిపాసా బసు.. ఫ్యాషన్స్‌ని విక్రయించే ది లేబుల్ కార్ప్‌లో భాగంగా ఉన్నారు. అటు శిల్పా శెట్టి .. రియల్టీ రంగంలోనూ ఇన్వెస్ట్ చేస్తోంది. భర్తతో కలిసి గ్రూప్‌హోమ్‌బయ్యర్స్ పేరిట వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.