కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి నేటి(మంగళవారం)లో వంద రోజులు పూర్తైంది. లాక్‌డౌన్‌వేళ సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ లాన్‌డౌన్‌లో తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మాధురీ తన భర్త శ్రీరాం మాధవ్ నేనేతో దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. (ప్రేయసిని పెళ్లాడిన నటుడు..)
‘నేటి(జూన్30)కి సెల్ఫ్ క్వారంటైన్‌కి పరిమితమై వంద రోజులు పూర్తైంది. ఈ వంద రోజుల్లో నా భర్త శ్రీరాం మాధవ్ నేనే కేశాలంకరణపై అనేక ప్రయోగాలు చేశాను. అదే విధంగా లాక్‌డౌన్ నుంచి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఇతరులపై ఆధారపడకుండా నాకు కావల్సిన చిన్న చిన్న ఉత్పత్తులను సొంతంగా తయారు చేయటం ఎలానో తెలుసుకున్నాను’ అని మాధురీ కామెంట్ జతచేశారు. (బిహార్ బాలికపై 'ఆత్మనిర్భర్' చిత్రం)
దీని కంటే ముందు మాధురీ భర్త శ్రీరాం తన కొత్త హెయిర్ స్టైల్‌తో ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.‘హాట్సాఫ్ నా కొత్త హెయిర్ స్టైలిస్ట్. కృతజ్ఞతలు హనీ!’అని కామెంట్ జతచేశారు. లాక్‌డౌన్ రోజుల్లో మాధురీ తన పాత ఫొటోలను, ఇటివల తన తల్లి పుట్టిన రోజుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment