Madhuri Dixit Apartment Rent: Madhuri Dixit, Shriram Nene Apartment Rent Rs 12.5 Lakh A Month In Mumbai - Sakshi
Sakshi News home page

Madhuri Dixit: త్వరలో కొత్త ఇంట్లోకి మాధురీ దీక్షిత్‌, అద్దె ఎన్ని లక్షలో తెలుసా?

Published Wed, Mar 23 2022 8:21 AM | Last Updated on Wed, Mar 23 2022 9:38 AM

Madhuri Dixit And Shriram Nene Rent Apartment For Rs 12 5 Lakh A Month In Mumbai - Sakshi

బాలీవుడ్‌ జంట మాధురీ దీక్షిత్‌, శ్రీరామ్‌ నేనే త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. ముంబైలోని పోష్‌ ఏరియా అయిన వొర్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగబోతున్నారు. సకల హంగులతో విలాసవంతంగా ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించేందుకు వారు నెలకు రూ.12.5 లక్షలు అద్దె కట్టనున్నట్లు సమాచారం.

ఈ సెలబ్రిటీ కపుల్‌ ఉండబోయే ఇంటిని నిర్మించిన డిజైనర్‌ అపూర్వ ష్రాఫ్‌ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్థులో మాధుదీ దంపతుల ఫ్లాట్‌ ఉందని పేర్కొన్నారు. వారు దీనికి ఎలాంటి మార్పులు చేయాలనుకోకుండా యధాతథంగా ఉంచాలనుకుంటున్నారని తెలిపారు. అంతేకాదు, ఆ ఫ్లాట్‌కు సంబంధించిన ఫోటోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మాధురి సినిమాల విషయానికి వస్తే ఆమె చివరి సారిగా 'ది ఫేమ్‌ గేమ్‌' వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇందులో సంజయ్‌ కపూర్‌ మానవ్‌ కౌల్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను దర్శకులు బెజోయ్‌ నంబియార్‌, కరిష్మా హోలీ తెరకెక్కించారు. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement