విలన్ ను చితకబాదేసిన మాధురీ దీక్షిత్ | Madhuri Dixit makes tiring action look effortless in 'Gulaab Gang' | Sakshi
Sakshi News home page

విలన్ ను చితకబాదేసిన మాధురీ దీక్షిత్

Published Wed, Jan 29 2014 2:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

విలన్ ను చితకబాదేసిన మాధురీ దీక్షిత్ - Sakshi

విలన్ ను చితకబాదేసిన మాధురీ దీక్షిత్

ముంబై: మాధురీ దీక్షిత్ పేరు వినగానే ఆమె చేసిన అద్భుతమైన నృత్యాలు గుర్తుకొస్తాయి. 1990ల్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. అలాంటి మాధురీ నెల రోజుల పాటు కుంగ్ ఫూలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కర్ర తిప్పడం, కత్తిపట్టడం తదితర విన్యాసాలను నేర్చుకుంది. ఇంకేం విలన్ ను చితకబాదేసింది. త్వరలో విడుదల కానున్న 'గులాబ్ గ్యాంగ్' చిత్రం కోసమే ఈ కసరత్తంతా. ఈ చిత్రంలో మాధురీ పోరాట సన్నివేశాల్లో ఇరగదీసిందట.

ఒకప్పుడు నెంబర్ వన్ స్థానం కోసం తనతో పోటీపడ్డ మరో అందాల నటి జూహిచావ్లాతో కలసి ఈ సినిమా ద్వారా  తొలిసారి వెండితెరను పంచుకోవడం మరో విశేషం. గులాబ్ గ్యాంగ్ చిత్రంలో మాధురీ ఫైటింగ్ సీన్ల కోసం ట్రైనర్ కనిష్క శర్మను పెట్టుకుని శిక్షణ తీసుకుంది. అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ చిత్రం మార్చి ఏడున విడుదలకానుంది. ఈ చిత్రంలో జూహీచావ్లా నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉండే కొంతమంది మహిళల స్ఫూర్తితో ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement